BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU
Showing posts with label SINGER--P.SUSEELA. Show all posts
Showing posts with label SINGER--P.SUSEELA. Show all posts

Saturday, 14 April 2012

ANNAMAYYA SAMKIRTANALU__RAMA


P.SUSEELA




రామా దయాపరసీమా అయోధ్యాపుర-|
ధామా మావంటివారి తప్పులు లోగొనవే||


అపరాధియైనట్టియాతని తమ్మునినే|
కృపజూపితివి నీవు కింకలుమాని|
తపియించి యమ్ముమొనదారకుజిక్కినవాని|
నెపానగాచి విడిచి నీవాదరించితివి||


సేయరాని ద్రోహము చేసినపక్షికి నీవు|
పాయక అప్పటినభయమిచ్చితి|
చాయసేసుకొనివుండి స్వామిద్రోహి జెప్పనట్టి-|
తోయపుటేటెని మంచితోవనే పెట్టితివి||


నేరములెంచవు నీవు నీదయేచూపుదుగాని|
బీరపుశరణాగతి బిరుదనీవు|
చేరి నేడు నిలుచుండి శ్రీవేంకటాద్రిమీద|
గోరినవరములెల్లా కొల్లలొసగితివి|| 

rAmA dayAparasImaa ayOdhyApura-|
dhAmA mAvaMTivAri tappulu lOgonavE||


aparAdhiyainaTTiyAtani tammuninE|
kRpajUpitivi nIvu kiMkalumAni|
tapiyiMci yammumonadArakujikkinavAni|
nepAnagAci viDici nIvAdariMcitivi||


sEyarAni drOhamu cEsinapakShiki nIvu|
pAyaka appaTinabhayamicciti|
cAyasEsukonivuMDi swAmidrOhi jeppanaTTi-|
tOyapuTETeni maMcitOvanE peTTitivi||


nEramuleMcavu nIvu nIdayEcUpudugAni|
bIrapuSaraNAgati birudanIvu|
cEri nEDu nilucuMDi SrIvEMkaTAdrimIda|
gOrinavaramulellA kollalosagitivi|| 



ANNAMAYYA LYRICS BOOK NO--30
SAMKIRTANA NO--94
RAGAM MENTIONED--BOULI





Monday, 12 March 2012

ANNAMAYYA SAMKIRTANALU--ALAMELUMANGA




G.N.NAIDU & P.SUSEELA
మిక్కిలి మేలుది అలమేలుమంగ | అక్కరతో నిన్నుజూచీ నలమేలుమంగ ||

కొచ్చి కొచ్చి యాలాపించి కూరిమితో బాడగాను | మెచ్చీ నిన్నునిదె యలమేలుమంగ |
నెచ్చెలులతోడ నెల్లా నీగుణాలు సారె సారె | అచ్చలాన నాడుకొనీ నలమేలుమంగ ||

 వాడల వాడల నీవు వయ్యాళి దోలగాను | మేడలెక్కి చూచీ నలమేలుమంగ |
వీడెము చేతబట్టుక వెస నీవు పిలువగా | ఆడనుండి వచ్చె నీకడ కలమేలుమంగ ||

ఈలీల శ్రీవేంకటేశ ఇంత చనవియ్యగాను | మేలములాడీ నలమేలుమంగ |
యేలిన నీ రతులను ఇదె తన నేరుపెల్లా | ఆలోచనలు సేసీ నలమేలుమంగా |



mikkili mEludi alamElumaMga | akkaratO ninnujUcI nalamElumaMga ||

kocci kocci yAlApiMci kUrimitO bADagAnu | meccI ninnunide yalamElumaMga |
neccelulatODa nellA nIguNAlu sAre sAre | accalAna nADukonI nalamElumaMga ||

vADala vADala nIvu vayyALi dOlagAnu | mEDalekki cUcI nalamElumaMga |
vIDemu cEtabaTTuka vesa nIvu piluvagA | ADanuMDi vacce nIkaDa kalamElumaMga ||

IlIla SrIvEMkaTESa iMta canaviyyagAnu | mElamulADI nalamElumaMga |
yElina nI ratulanu ide tana nErupellA | AlOcanalu sEsI nalamElumaMgA ||

Tuesday, 21 February 2012

ANNAMAYYA SAMKIRTANALU--SRUNGARAM



P.SUSEELA





చెలి నీవు మొదలనే సిగ్గరిపెండ్లికూతురవు
యిలనింత పచ్చిదీరే ఇదివో నీభావము


చెక్కుల వెంటాగారె చెమట తుడుచుకోవే
చక్కబెట్టుకొనవె నీ జారిన కొప్పు
అక్కుమీద పెనగొన్న హారాలు చిక్కుదీయవె
ఇక్కువల నీకోర్కె ఈడేరెనిపుడు


తిలకము కరగెను దిద్దుకోవె నొసలను
కలసిన గురుతులు కప్పుకొనవె
యెలమి శ్రీవేంకటేశుడు యేలే అలమేల్మంగవు
తలచిన తలపులు తలకూడె నిపుడు



celi nIvu modalanE siggaripeMDlikUturavu


yilaniMta paccidIrE idivO nIbhaavamu

cekkula veMTaagaare cemaTa tuDucukOvE
cakkabeTTukonave nI jaarina koppu
akkumIda penagonna haaraalu cikkudIyave
ikkuvala nIkOrke IDErenipuDu

tilakamu karagenu diddukOve nosalanu
kalasina gurutulu kappukonave
yelami SrIvEMkaTESuDu YElE alamElmaMgavu
talacina talapulu talakUDe nipuDu

Tuesday, 27 December 2011

ANNAMAYYA SAMKIRTANALU--VARNANA



P.SUSEELA

గంధము పూసేవేలే కమ్మని మేన యీ-
గంధము నీ మేనితావి కంటి నెక్కుడా 


అద్దము చూచే వేలే  అప్పటప్పటికిని
అద్దము నీ మోముకంటె నపురూపమా 
ఒద్దిక తామర విరి నొత్తేవు కన్నులు నీ-
గద్దరి కన్నుల కంటె కమలము ఘనమా 


బంగారు పెట్టేవేలే పడతి నీమెయినిండా
బంగరు నీతనుకాంతి ప్రతివచ్చీనా 
ఉంగరాలేటికి నే వొడికపు వేళ్ళ
వెంగలి మణుల నీ వేలిగోరబోలునా 


సవర మేటికినే జడియు నీనెరులకు
సవరము నీకొప్పుసరి వచ్చీనా 
యివలజవులు నీకు నేలే వేంకటపతి
సవరని కెమ్మోవి చవి చవికంటేనా


gaMdhamu pUsEvElE kammani mEna yI-
gaMdhamu nI mEnitAvi kaMTi nekkuDA 


addamu cUcE vElE appaTikini
addamu nI mOmukaMTe napurUpamA 
oddika tAmara viri nottEvu kannulu nI-
gaddari kannula kaMTe kamalamu GanamA 


baMgAru peTTEvElE paDati nImeyiniMDA
baMgAru nItanukAMti prativaccInA 
uMgarAlETiki nE voDikapu vELLa
veMgali maNula nI vEligOrabOlunA 


savara mETikinE jaDiyu nInerulaku
savaramu nIkoppusari vaccInA 
yivalajavulu nIku nElE vEMkaTapati
savarani kemmOvi cavikeMTEnA 




AUDIO LINK

Wednesday, 23 February 2011

ANNAMAYYA SAMKIRTANALU__ALAMELUMANGA


G.NAGESWARA NAIDU
పలుకుతేనియలనుపారమియ్యవే
అలరువాసనల నీ అధరబింబాలకు


పుక్కిటిలేనగవు పొంగుఁబాలుచూపవే
చక్కని నీవదనంపుచందమామకు
అక్కరొ నీవాలుగన్నులారతిగానెత్తవే
గక్కన నీచెక్కు తొలుకరిమెరుపులకు


కమ్మని నీమేనితావి కానుకగానియ్యవే
వుమ్మగింతచల్లెడి నీవూరుపులకు
చిమ్ముల నీచెమటలఁ జేయవేమజ్జనము
దిమ్మరి నీమురిపెపుతీగమేనికి


పతివేంకటేశుగూడి పరవశమియ్యవే
యితవైన నీమంచి హృదయానకు
అతనినే తలచగ నానతియ్యగదవె
తతితోడ నీలోని తలపోతలకు
DUET
palukutEniyalanupAramiyyavE
alaruvAsanala nI adharabiMbAlaku


pukkiTilEnagavu poMgu@MbAluchUpavE
chakkani nIvadanaMpuchaMdamAmaku
akkaro nIvAlugannulAratigAnettavE
gakkana nIchekku tolukarimerupulaku


kammani nImEnitAvi kAnukagAniyyavE
vummagiMtachalleDi nIvUrupulaku
chimmula nIchemaTala@M jEyavEmajjanamu
dimmari nImuripeputIgamEniki


pativEMkaTESugUDi paravaSamiyyavE
yitavaina nImaMchi hRdayAnaku
ataninE talachaga nAnatiyyagadave
tatitODa nIlOni talapOtalaku


Tuesday, 23 November 2010

ANNAMAYYA SAMKIRTANALU___RAMA


NEDUNURI

రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలములీయ గలిగెనిందరికి

గౌతము భార్యపాలిటి కామధేనువితడు
ఘాతల కౌశికుపాలి కల్పవ్రుక్షము
సీతాదేవి పాలిటి చింతామని యితడు
యీతడు దాసుల పాలిటి యిహపర దైవము

పరగసుగ్రీవుపాలి పరమ బంధువితడు
సరిహనుమంతుపాలి సామ్రాజ్యము
నిరతి విభీషణునిపాలి నిధానము యీతడు
గరిమజనకు పాలి ఘనపారిజాతము

తలప శబరిపాలి తత్వపు రహస్యము
అలరిగుహునిపాలి ఆదిమూలము
కలడన్నవారిపాలి కన్నులెదుటి మూరితి
వెలయ శ్రీవేంకటాద్రి విభుడితడు
GROUP SONG

raamachamdruDitaDu raghuveeruDu
kaamita phalamuleeya galigenimdariki

gautamu bhaaryapaaliTi kaamadhaenuvitaDu
Ghaatala kauSikupaali kalpavrukShamu
seetaadaevi paaliTi chimtaamani yitaDu
yeetaDu daasula paaliTi yihapara daivamu
paragasugreevupaali parama bamdhuvitaDu
sarihanumamtupaali saamraajyamu
nirati vibheeshaNunipaali nidhaanamu yeetaDu
garimajanaku paali ghanapaarijaatamu

talapa Sabaripaali tatvapu rahasyamu
alariguhunipaali aadimoolamu
kalaDannavaaripaali kannuleduTi mooriti
Velaya SreevaemkaTaadri vibhuDitaDu

Monday, 15 November 2010

ANNAMAYYA SAMKIRTANALU__ALAMELUMANGA






P.SUSEELA
ఇన్నిరాసుల యునికి యింతి చెలువపు రాశి
కన్నె నీ రాశి కూటమి గలిగిన రాశి 

కలికి బొమవిండ్లుగల కాంతకును ధనురాశి
మెలయు మీనాక్షికిని మీనరాశి 
కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి
చెలగు హరిమధ్యకును సింహరాశి 


చిన్నిమకరాంకపు బయ్యెద చేడియకు మకరరాశి
కన్నెపాయపు సతికి కన్నెరాశి 
వన్నెమై పైడి తులదూగు వనితకు దులారాశి
తిన్నని వాడి గోళ్ళ సతికి వౄశ్చికరాశి 


ఆముకొను నొరపుల మెరయు నతివకు వౄషభరాశి
గామిడి గుట్టుమాటల సతికి కర్కాటకరాశి 
కోమలపు చిగురుమోవి కోమలికి మేషరాశి
ప్రేమ వేంకటపతి గలిసె ప్రియ మిథునరాశి 
innirAsula yuniki yiMti celuvapu rASi
kanne nI rASi kUTami galigina rASi 
kaliki bomaviMDlugala kAMtakunu dhanurASi
melayu mInAkShikini mInarASi 
kuluku kucakuMBamula kommakunu kuMBarASi
celagu harimadhyakunu siMharASi 

cinnimakarAMkapu bayyeda cEDiyaku makararASi
kannepAyapu satiki kannerASi 
vannemai paiDi tuladUgu vanitaku dulArASi
tinnani vADi gOLLa satiki vRuScikarASi 

Amukonu norapula merayu nativaku vRuShaBarASi
gAmiDi guTTumATala satiki karkATakarASi 
kOmalapu cigurumOvi kOmaliki mESharASi
prEma vEMkaTapati galise priya mithunarASi 

Saturday, 13 November 2010

ANNAMAYYA SAMKIRTANALU__KALYANAM




AUDIO LINK


చూచివచ్చితి నీవున్న చోటికె తోడితెచ్చితి
చేచేత పెండ్లాడు చిత్తగించవయ్యా
చూచివచ్చితి తోడి తెచ్చితి


లలితాంగి జవరాలు లావణ్యవతి యీపె
కలువకంఠి మంచి కంబుకంఠి
జలజవదనా చక్రజఘన సింహమధ్య
తలెరుబోడి చక్కదనము యిట్టిదయా


అలివేణి మిగుల నీలాలక శశిబాల 
మలయజగంధి మహామానిని యీపె
చెలచు మరుని దిండ్లబొమ్మలదె  చారుబింబోష్ఠ 
కలితకుందరదన చక్కదనము యిట్టిదయా


చెక్కుటద్దములగిది శ్రీకారకర్ణములది 
నిక్కు చన్నులరంభోరు నిర్మలపాదా
గ్రక్కన శ్రీవేంకటేశ కదిసే లతాహస్త
దక్కె నీకీ లేమా చక్కదనము యిట్టిదయా



cUcivacciti nIvunna cOTike tODitecciti
cEcEta peMDlADu cittagiMcavayyaa
cUcivacciti tODi tecciti


lalitaaMgi javaraalu laavaNyavati yIpe
kaluvakaMThi maMci kaMbukaMThi
jalajavadanaa cakrajaghana siMhamadhya
talerubODi cakkadanamu yiTTidayaa


alivENi migula nIlaalaka SaSibAla 
malayajagaMdhi mahaamaanini yIpe
celacu maruni diMDlabommalade  caaru biMbOShTha 
kalitakuMdaradana cakkadanamu yiTTidayaa


cekkuTaddamulagidi SrIkaarakarNamuladi 
nikku cannularaMBOru nirmalapaadaa
grakkana SrIvEMkaTESa kadisE lataahasta
dakke nIkI lEmaa cakkadanamu yiTTidayaa