BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU
Showing posts with label RAGAM--KHAMAS. Show all posts
Showing posts with label RAGAM--KHAMAS. Show all posts

Thursday, 10 May 2012

ANNAMAYYA SAMKIRTANALU--SRUNGARAM


BKP
సింగారమూరితివి చిత్తజు గురుడవు
సంగతి  జూచేరు మిమ్ము సాసముఖా 

పూవుల తెప్పలమీద పొలతులు నీవునెక్కి
పూవులు ఆకసము మోప పూచిచల్లుచు 
దేవదుందుభులు మ్రోయ దేవతలు కొలువగా 
సావధానమగు నీకు సాసముఖా 

అంగరంగవైభవాల అమరకామినులాడ 
నింగినుండి దేవతలు నినుజూడగా 
సంగీత తాళవాద్య చతురతలు మెరయ
సంగడిదేలేటి నీకు సాసముఖా 

పరగ కోనేటిలోన పసిడి మేడనుండి 
అరిది యిందిరయు నీవు ఆరగించి 
గరిమ శ్రీవేంకటేశ కన్నుల పండువకాగ 
సరవి నోలాడు సాసముఖా 

siMgAramUritivi cittaju guruDavu
samgati  jUcEru mimmu sAsamuKA 


pUvula teppalamIda polatulu nIvunekki
pUvulu Akasamu mOpa pUcicallucu 
dEvaduMduBulu mrOya dEvatalu koluvagA 
sAvadhAnamagu nIku sAsamuKA 


aMgaraMgavaiBavAla amarakAminulADa 
niMginuMDi dEvatalu ninujUDagA 
saMgIta tALavAdya caturatalu meraya
saMgaDidElETi nIku sAsamuKA 


paraga kOnETilOna pasiDi mEDanuMDi 
aridi yiMdirayu nIvu AragiMci 
garima SrIvEMkaTESa kannula paMDuvakAga 
saravi nOlADu sAsamuKA 
ANNAMAYYA LYRICS BOOK NO--2
SAMKIRTANA--471
RAGAM MENTIONED--SAMANTAM

Friday, 25 February 2011

ANNAMAYYA SAMKIRTANALU__SRUNGARAM





AUDIO


దేవుడవూ నీవు దేవుల నేను
వావులు కూడగాను వడిసేసవెట్టితి


వలపులునేనెరగ వాసులెరగను నీవు-
కలకల నవ్వితేనే కరగితిని
పలుకులు నేనేర భావించగ నేనీర
పిలిచి విడమిచ్చితే ప్రియమందితిని


మనసుసాధించనోప మర్మములడుగనోప
చెనకి బోరనూదితే చేకొంటిని
పెనగజాలను నేను బిగియగజాలను
చనువిచ్చి చూచితేనె కానిమ్మంటిని


పచ్చిచేతలూ రచించ పలుమారు సిగ్గువడ
మచ్చిక కాగిలించితే మరిగితిని
ఇచ్చట శ్రీవేంకటేశ ఏలుకొంటివిటు నన్ను
మెచ్చి కాగిలించితేను మేకొని మొక్కితిని



dEvuDavU nIvu dEvula nEnu
vaavulu kUDagaanu vaDisEsaveTTiti



valapulunEneraga vaasuleraganu nIvu-
kalakala navvitEnE karagitini
alukalu nEnEra bhaavimcaga nEnIra
pilici viDamiccitE priyamaMditini



manasusaadhimcanOpa marmamulaDuganOpa
cenaki bOranUditE cEkoMTini
penagajaalanu nEnu bigiyagajaalanu
canuvicci cUcitEne kaanimmamTini


paccicEtalU raciMca palumaaru sigguvaDa
maccika kaagiliMcitE marigitini
iccaTa SrIvEmkaTESa ElukoMTiviTu nannu
mecci kaagiliMcitEnu mEkoni mokkitini