BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU
Showing posts with label SAMKIRTANA--292. Show all posts
Showing posts with label SAMKIRTANA--292. Show all posts

Thursday, 21 May 2015

ANNAMAYYA SAMKIRTANALU---- LAKSHMI NARASIMHA




chittaja gurudaa O


చిత్తజగరుడ శ్రీనరసింహ |
బత్తి సేసేరు మునులు పరికించవయ్య ||

చ|| సకలదేవతలును జయవెట్టు చున్నారు |
     చకితులై దనవులు సమసిరదె |
     అకలంకయగు లక్ష్మి అటు నీతొడపై నెక్కె |
     ప్రకటమైన నీకోపము మానవయ్య ||

చ|| తుంబురు నారదులు దొరకొని పాడేరు |
     అంబుజాసనుండభయమ డిగీనదె |
     అంబరవీధి నాడేరు అచర లందరు గూడి |
     శంబరరిపు జనక శాంతము చూపవయ్యా ||

చ|| హత్తి కొలిచేరదె యక్షులును గంధర్వులు |
     చిత్తగించు పొగడేరు సిద్ధ సాధ్యులు |
     సత్తుగ నీ దాసులము శరణుజొచ్చితిమిదె |
     ఇత్తల శ్రీవేంకటేశ ఏలు కొనవయ ||
cittajagaruDa SrInarasiMha |
batti sEsEru munulu parikiMcavayya ||

ca|| sakaladEvatalunu jayaveTTu cunnAru |
     cakitulai danavulu samasirade |
     akalaMkayagu lakShmi aTu nItoDapai nekke |
     prakaTamaina nIkOpamu mAnavayya ||

ca|| tuMburu nAradulu dorakoni pADEru |
     aMbujAsanuMDaBayama DigInade |
     aMbaravIdhi nADEru acara laMdaru gUDi |
     SaMbararipu janaka SAMtamu cUpavayyA ||

ca|| hatti kolicErade yakShulunu gaMdharvulu |
     cittagiMcu pogaDEru siddha sAdhyulu |
     sattuga nI dAsulamu SaraNujoccitimide |
     ittala SrIvEMkaTESa Elu konavaya ||

Tuesday, 21 February 2012

ANNAMAYYA SAMKIRTANALU--SRUNGARAM




SRIVANI

ఎంతవాడవయ్యా నీవు యెక్కడెక్కడ 
పొంత నీ జాణతనాలు పొగిడేము నేము

మాటలనే తేనెలూరి మంతనాన నోరు యూరి
యేటవెట్టే నీమహిమ లెక్కడెక్కడ
తేటలు నీచేతవిని దేహమెల్లాజెమరించె
మూటలుగా నవ్వితిమి మొక్కేము నీకు

చూపులనే వాడిరేగి సొలపుల నాసరేగీ
యేపున నీయెమ్మెలివి యెక్కడెక్కడ
తీపుల నీపాల జిక్కి తిద్దుపడె గుణమెల్ల
మోపుగా వలచితిమి మొక్కేము నీకు

కందువల తమిపుట్టె కాగిట బీరము వుట్టీ
యిందులోని నీనేరుపులెక్కడెక్కడ
పొందితి శ్రీవేంకటేశ భోగము రతులకెక్కె 
ముందర నింకొకమాటు మొక్కేము నీకు


emtavaaDavayyA nIvu yekkaDekkaDa 
pomta nI jANatanaalu pogiDEmu nEmu


maaTalanE tEnelUri mamtanaana nOru yUri
yETaveTTE nImahima lekkaDekkaDa
tETalu nIcEtavini dEhamellaajemarimce
mUTalugaa navvitimi mokkEmu nIku


cUpulanE vADirEgi solapula naasarEgI
yEpuna nIyemmelivi yekkaDekkaDa
tIpula nIpAla jikki tiddupaDe guNamella
mOpugaa valacitimi mokkEmu nIku


kamduvala tamipuTTe kaagiTa bIramu vuTTI
yimdulOni nInErupulekkaDekkaDa
pomditi SrIvEMkaTESa bhOgamu ratulakekke 
mumdara nimkokamaaTu mokkEmu nIku
ANNAMAYYA LYRICS BOOK--27
SAMKIRTANA--292
PAGE NO --197