BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU
Showing posts with label RAGAM--KALYANI. Show all posts
Showing posts with label RAGAM--KALYANI. Show all posts

Friday, 15 April 2011

ANNAMAYYA SAMKIRTANALU__RAMA




SPB


రామ రామ రామకృష్ణ రాజీవలోచన నీకు
దీము వంటి బంటననే తేజమే నాది

వారధి దాటి మెప్పించ వాయుజుడనే గాను
సారె చవుల మెప్పించ శబరిగాను
బీరాన సీత నిచ్చి మెప్పించ జనకుండగాను
ఏరీతి మెప్పింతు నన్నెట్లా గాచేవో

ఘనమై మోచి మెప్పించ గరుడుడనే గాను
కొన కామసుఖమిచ్చు గోపిక గాను
వినుతించి మెప్పించ వేయినోళ్ళ భొగిగాను
నిన్నెట్లు మెప్పింతు నన్ను గాచే దెట్లా

నవ్వుచు పాడి మెప్పించ నారదుడనే గాను
అవ్వల ప్రాణమీయ జటాయువు గాను
ఇవ్వల శ్రీ వేంకటేశ యిటునీకె శరణంటి
అవ్వల నా తెరువిదే రక్షించే దెట్లా



NEDUNURI


Raama raama raamakrshna raajeevalochana neeku
Deemu vamti bamtananae taejamae naadi

Vaaradhi daati meppimcha vaayujudanae gaanu
Saare chavula meppimcha Sabarigaanu
Beeraana seeta nichchi meppimcha janakumdagaanu
Aereeti meppimtu nannetlaa gaachaevo

Ghanamai mochi meppimcha garududanae gaanu
Kona kaamasukhamichchu gopika gaanu
Vinutimchi meppimcha vaeyinolla bhogigaanu
Ninnetlu meppimtu nannu gaachae detlaa

Navvuchu paadi meppimcha naaradudanae gaanu
Avvala praanameeya jataayuvu gaanu
Ivvala Sree vaemkataesa yituneeke saranamti
Avvala naa teruvidae rakshimchae detlaa

Thursday, 24 February 2011

ANNAMAYYA SAMKIRTANALU__SRUNGARAM






N.C.SRIDEVI



యెంత నేరుపరి యీలేమ
దొంతివెట్టి సంతోసముల


వెలది సెలవులను వెన్నెల కాసి
చెలులు నీ సుద్దులు చెప్పగను
తలపోతలనే దండలు గుచ్చి 
నెలకొని యెదుటను నీవుండగను


వనితచెక్కులను వానలు కురిసి
తనియని విరహము తమకమున
కనుచూపులనే కలువలు చల్లి
నినుపుల వలపుల నీదా తలపు


పెరవపెరవులను తేనెలు చింది
మరినీవాడిన మాటలను
నెరిశ్రీవేంకటనిలయకూడితివి
జరసీనీతో జాణతనములా

yeMta nErupari yIlEma
doMtiveTTi saMtOsamula


veladi selavulanu vennela kaasi
celulu nI suddulu ceppaganu
talapOtalanE daMDalu gucci 
nelakoni yeduTanu nIvuMDaganu


vanitacekkulanu vaanalu kurisi
taniyani virahamu tamakamuna
kanucUpulanE kaluvalu calli
ninupula valapula nIdA talapu


peravaperavulanu tEnelu ciMdi
marinIvADina maaTalanu
neriSrIvEMkaTanilayakUDitivi
jarasInItO jANatanamulaa

Monday, 8 November 2010

ANNAMAYYA SAMKIRTANALU_HANUMAN




BKP
అవధారు చిత్తగించు హనుమంతుడు వీడె
భువిలోన కలశాపుర హనుమంతుడు

రామ నీ సేవకుడిదె రణరంగధీరుడు
ఆముకొన్నసత్వగల హనుమంతుడు
దీమసాన లంక సాధించి ఉంగరము దెచ్చె
కామితఫలదుడు యీఘనహనుమం
తుడూ


జానకీరమణ సప్తజలధులు లంఘించి
ఆనుక సంజీవి దెచ్చె హనుమంతుడు
పూని చుక్కలెల్లా మొలపూసలుగాగ పెరిగి
భానుకోటికంతితో జొప్పెడు హనుమంతుడు


యినవంశ శ్రీవేంకటేశ నీకరుణతోడ
అనుపమజయశాలి హనుమంతుడు
పనిపూని ఇటమీది బ్రహ్మపట్టమునకు నీ-
యనుమతి గాచుకున్నాడదె హనుమంతుడు



avadhAru chittagiMchu hanumaMtuDu vIDe
bhuvilOna kalaSApura hanumaMtuDu

rAma nI sEvakuDide raNaraMgadhIruDu
Amukonnasatwagala hanumaMtuDu
dImasAna laMka sAdhiMchi uMgaramu dechche
kAmitaphaladuDu yIghanahanumaMtuDu

jAnakIramaNa saptajaladhulu laMghiMchi
Anuka saMjIvi dechche hanumaMtuDu
pUni chukkalellA molapUsalu(gA(ga perigi
bhAnukOTikaMtitO( joppeDu hanumaMtuDu

yinavaMSa SrIvEMkaTESa nIkaruNatODa
anupamajayaSAli hanumaMtuDu
panipUni iTamIdi brahmapaTTamunaku nI-
yanumati( gAchukunnADade hanumaMtuDu



ANNAMAYYA LYRICS BOOK NO--4
SAMKIRTANA--490
RAGAM MENTIONED--MALAVIGOULA