BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU
Showing posts with label ANNAMAYYA BOOK NO--2. Show all posts
Showing posts with label ANNAMAYYA BOOK NO--2. Show all posts

Thursday, 10 May 2012

ANNAMAYYA SAMKIRTANALU--SRUNGARAM


BKP
సింగారమూరితివి చిత్తజు గురుడవు
సంగతి  జూచేరు మిమ్ము సాసముఖా 

పూవుల తెప్పలమీద పొలతులు నీవునెక్కి
పూవులు ఆకసము మోప పూచిచల్లుచు 
దేవదుందుభులు మ్రోయ దేవతలు కొలువగా 
సావధానమగు నీకు సాసముఖా 

అంగరంగవైభవాల అమరకామినులాడ 
నింగినుండి దేవతలు నినుజూడగా 
సంగీత తాళవాద్య చతురతలు మెరయ
సంగడిదేలేటి నీకు సాసముఖా 

పరగ కోనేటిలోన పసిడి మేడనుండి 
అరిది యిందిరయు నీవు ఆరగించి 
గరిమ శ్రీవేంకటేశ కన్నుల పండువకాగ 
సరవి నోలాడు సాసముఖా 

siMgAramUritivi cittaju guruDavu
samgati  jUcEru mimmu sAsamuKA 


pUvula teppalamIda polatulu nIvunekki
pUvulu Akasamu mOpa pUcicallucu 
dEvaduMduBulu mrOya dEvatalu koluvagA 
sAvadhAnamagu nIku sAsamuKA 


aMgaraMgavaiBavAla amarakAminulADa 
niMginuMDi dEvatalu ninujUDagA 
saMgIta tALavAdya caturatalu meraya
saMgaDidElETi nIku sAsamuKA 


paraga kOnETilOna pasiDi mEDanuMDi 
aridi yiMdirayu nIvu AragiMci 
garima SrIvEMkaTESa kannula paMDuvakAga 
saravi nOlADu sAsamuKA 
ANNAMAYYA LYRICS BOOK NO--2
SAMKIRTANA--471
RAGAM MENTIONED--SAMANTAM

Tuesday, 10 May 2011

ANNAMAYYA SAMKIRTANALU__SARANAGATI







KAMALARAMANA



కమలారమణ నీ కల్పితపు మానిసిని
తమితోడ నా దిక్కు దయచూడవే


ఆరీతి బ్రాహ్మణుడననుటేగాని దేహము
కోరి ఆచారమునకు కొలుపదు
పేరు వైష్ణవుడనే పెద్దరికమేగాని
సారమైన మనసులో జ్ఞానమేలేదు


చదివితిననియెడి చలపాదమింతేగాని
అదన అందులోని అర్ధమెరుగ
పదరి సంసారమనే బహురూమెగాని
చదురుననానందు సమర్ధుడగాను


దేవమీభక్తుడనే తేజమొక్కటేగాని
చేవమీర నిను పూజించనేరను
శ్రీవేంకటేశ నీ చేతిలోనివాడనేను
భావించి మరియేపాపమునెరుగను



kamalaaramaNa nI kalpitapu maanisini
tamitODa naa dikku dayacUDavE


ArIti brAhmaNuDananuTEgaani dEhamu
kOri Acaaramunaku kolupadu
pEru vaiShNavuDanE peddarikamEgAni
saaramaina manasulO j~naanamElEdu


cadivitinaniyeDi calapaadamiMtEgAni
adana aMdulOni ardhameruga
padari saMsaaramanE bahurUpamegaani
cadurunanaanaMdu samardhuDagaanu


dEvamIbhaktuDanE tEjamokkaTEgaani
cEvamIra ninu pUjiMcanEranu
SrIvEMkaTESa nI cEtilOnivADanEnu
bhaaviMci mariyEpaapamuneruganu
ANNAMAYYA LYRICS BOOK NO--2
SAMKIRTANA NO--255
RAGAM MENTIONED--KEDARAGOULA

Friday, 22 October 2010

ANNAMAYYA SAMKIRTANALU_HANUMAN



BKP
శరణు శరణు వేద శాస్త్రనిపుణ నీకు
అరుదైన రామ కార్యదురంధరా

హనుమంతరాయ అంజనాతనయా
ఘనవాయుసుత దివ్యకామరూప
అనుపమలంకాదహన వార్ధిలంఘన
జనసురనుత కలశాపురనివాస

రవితనయస(న?)చివ రావణవనాపహార
పవనవేగబలాఢ్య భక్తసులభ
భువనపూర్ణదేహా బుధ్ధివిశారద
జవసత్వవేగ కలశాపురనివాస

సీతాశోకనాశన సంజీవశైలాకర్షణ
ఆతతప్రతాపశౌర్యా అసురాంతకా
కౌతుక శ్రీవేంకటేశు కరుణాసమేత
సాతకుంభవర్ణ కలశాపురనివాస

SaraNu SaraNu vEda SAstranipuNa nIku
arudaina rAma kAryaduraMdharA

hanumaMtarAya aMjanAtanayA
ghanavAyusuta divyakAmarUpa
anupamalaMkAdahana vArdhilaMghana
janasuranuta kalaSApuranivAsa

ravitanayasa(na?)chiva rAvaNavanApahAra
pavanavEgabalADhya bhaktasulabha
bhuvanapUrNadEhA budhdhiviSArada
javasatvavEga kalasApuranivAsa

sItASOkanASana saMjIvaSailAkarshaNa
AtatapratApaSauryA asurAMtakA
kautuka SrIvEMkaTESu karuNAsamEta
sAtakuMbhavarNa kalaSApuranivAsa



ANNAMAYYA LYRICS BOOK NO--2
SAMKIRTANA NO--347
RAGAM MENTIONED--SALAMGANATA