BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU
Showing posts with label DEITY--BALAKRISHNA. Show all posts
Showing posts with label DEITY--BALAKRISHNA. Show all posts

Tuesday, 27 November 2012

ANNAMAYYA SAMKIRTANALU--KRISHNA





అబ్బా.. ఎంత అల్లరి పిల్లాడమ్మా.. ఇలాంటి పసివాణ్ని ఎక్కడా చూడలేదమ్మా. మన తెలుగింటి తల్లులు తమ పిల్లాడి గురించి నిత్యం అనే మాటలివే. ఆ తిరుమల వెంకటేశ్వరుని అణువణువునా చూసిన అన్నమయ్య తానే యశోదగా మారారు... వెంకటేశ్వరుణ్ని పసి వాణ్ని చేశారు. యశోదమ్మ కంటిపాపల్లో చిన్నికృష్ణుడు ఎలా పెరిగాడనే విషయాన్ని కళ్ళకు కడుతూ... తెలుగింటి బుడుగుల్ని గుర్తు చేశారు.
చిన్ని శిశువు... చిన్ని శిశువు...
ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు

తోయంపు కురులతోడ తూగేటిశిరసు, చింత
కాయలవంటి జడలా గములతోడ
మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాలతోడ
పయక యశోద వెంట పారాడు శిశువు

ముద్దుల వ్రేళ్ళతోడ మొరవంక యుంగగాల
నిద్దపు చేతుల పైడి బొద్దుల తోడ
అద్దపు చెక్కులతోడ అప్పలప్పలనినంత
గద్దించి యశోదమేను కౌగిలించు శిశువు

బలుపైన పొట్ట మీది పాల చారలతోడ
నులివేడి వెన్నతిన్న నోరితోడ
చ్లగి నేడిదే వచ్చి శ్రీ వేంకటాద్రిపై
నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువు
Chinni sisuvu chinni sisuvu
Ennadu choodamamma ituvamti sisuvu

Toyampu kurulatoda toogaetisirasu, chimta
Kaayalavamti jadalaa gamulatoda

Mroyuchunna kanakapu muvvala paadaalatoda
Payaka yasoda vemta paaraadu sisuvu

Muddula vraellatoda moravamka yumgagaala
Niddapu chaetula paidi boddula toda
Addapu chekkulatoda appalappalaninamta
Gaddimchi yasodamaenu kaugilimchu sisuvu

Balupaina potta meedi paala chaaralatoda
Nulivaedi vennatinna noritoda
Chlagi naedidae vachchi Sree vaemkataadripai
Nilichi lokamulella nilipina sisuvu


ANNAMAYYA LYRICS BOOK NO--1
SAMKIRTANA NO--1
RAGAM MENTIONED--AHIRI



Tuesday, 6 March 2012

ANNAMAYYA SAMKIRTANALU--KRISHNA



MOHANA RAGAM
 పాలదొంగవద్ద వచ్చి పాడేరు తమ- 
 పాలిటిదైవమని బ్రహ్మాదులు 

రోల గట్టించుక పెద్దరోలలుగా వాపోవు 

బాలునిముందర వచ్చి పాడేరు 
ఆలకించి వినుమని యంబరభాగమునందు 

నాలుగుదిక్కులనుండి నారదాదులు 

నోరునిండా జొల్లుగార నూగి ధూళిమేనితో 

పారేటిబిడ్డనివద్ద బాడేరు 
వేరులేనివేదములు వెంటవెంట జదువుచు 

జేరిచేరి యింతనంత శేషాదులు 

ముద్దులు మోమునగార మూలలమూలలదాగె- 

బద్దులబాలునువద్ద బాడేరు 
అద్దివో శ్రీతిరువేంకటాద్రీశు డితడని 

చద్దికి వేడికి వచ్చి సనకాదులు 
YAMAN KALYANI
pAladoMgavadda vacci pADEru tama- 
pAliTidaivamani brahmAdulu 

rOla gaTTiMcuka peddarOlalugA vApOvu  

bAlunimuMdara vacci pADEru 
AlakiMci vinumani yaMbaraBAgamunaMdu 

nAlugudikkulanuMDi nAradAdulu 


nOruniMDA jollugAra nUgi dhULimEnitO 
pArETibiDDanivadda bADEru 
vErulEnivEdamulu veMTaveMTa jaduvucu 

jEricEri yiMtanaMta SEShAdulu 

muddulu mOmunagAra mUlalamUlaladAge- 

baddulabAlunuvadda bADEru 
addivO SrItiruvEMkaTAdrISu DitaDani 

caddiki vEDiki vacci sanakAdulu 
ANNAMAYYA BOOK NO--1
SAMKIRTANA NO--311
RAGAM MENTIONED--MALHARI

Friday, 19 November 2010

ANNAMAYYA SAMKIRTANALU--KRISHNA




VEDAVATI PRABHAKAR
మొత్తకురే అమ్మలాల ముద్దులాదు వీడె
ముత్తెమువలె నున్నాడు ముద్దులాడు

ఛక్కని యశొద తన్ను సలిగతొ మొత్తరాగా
మొక్క బోయీ కాళ్ళకు ముద్దులాడు
వెక్కసాన రేపల్లె వెన్నలెల్లమాపుదాక
ముక్కున వయ్యంగదిన్నా ముద్దులాడు

రువ్వెడి రాళ్ళ దల్లి రొల దన్నుగట్టెనంత
మువ్వల గంటల తోడి ముద్దులాడు
నవ్వెడి జెక్కుల నిండ నమ్మిక బాలునివలె
మువ్వురిలొ నెక్కుడైన ముద్దులాడు

వేల సంఖ్యల సతుల వెంట బెట్టుకొనిరాగా
మూల జన్నుగుడిచీని ముద్దులాడు
మేలిమి వేంకటగిరి మీదనున్నాడిదె వచ్చి
మూలభూతి దానైన ముద్దులాడు

VANIJAYRAM


mottakurae ammalaala muddulaadu veeDe
muttemuvale nunnaaDu muddulaaDu

Chakkani yaSoda tannu saligato mottaraagaa
mokka bOyee kaaLLaku muddulaaDu
Vekkasaana raepalle vennalellamaapudaaka
mukkuna vayyamgadinnaa muddulaaDu

ruvveDi raaLLa dalli rola dannugattenamta
muvvala gamTala tODi muddulaaDu
navveDi jekkula nimDa nammika baalunivale
muvvurilo nekkuDaina muddulaaDu

Vaela samkhyala satula vemTa beTTukoniraagaa
moola jannuguDicheeni muddulaaDu
mElimi vEmkaTagiri meedanunnaaDide vachchi
moolabhooti daanaina muddulaaDu
ANNAMAYYA LYRICS BOOK N0--6
SAMKIRTANA NO--144
RAGAM MENTIONED--KAMBODI

Friday, 12 November 2010

ANNAMAYYA SAMKIRTANALU__KRISHNA




BKP


ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని .. 
పట్టి తెచ్చి పొట్టనిండ పాలు వోయరే
..
కామిడై పారిదెంచి కాగెడి వెన్నలలోన ..

 చేమ పూవు కడియాల చేయిపెట్టి
చీమ గుట్టెనని తన చెక్కిట కన్నీరు జార ..

 వేమరు వాపోయె వాని వెడ్డువెట్టరే
..
ముచ్చువలె వచ్చి తన ముంగమురువులచేయి .. 

తచ్చెడి పెరుగులోన తగవెట్టి
నొచ్చెనని చేయిదీసి నోరనెల్ల జొల్లుగార .. 

వొచ్చెలి వాపోవువాని నూరడించరే
..
ఎప్పుడు వచ్చెనో మా యిల్లు జొచ్చి పెట్టేలోని .. 

చెప్పరాని వుంగరాల చేయిపెట్టి
అప్పడైన వేంకటేద్రిఅసవాలకుడు గాన .. 

తప్పకుండ బెట్టెవాని తలకెత్త రే


iTTi muddulADi baaluDaeDavaaDu vaani ..

 paTTi techchi poTTaniMDa paalu vOyarae
..
kaamiDai paarideMchi kaageDi vennalalOna .. 

chaema poovu kaDiyaala chaeyipeTTi
cheema guTTenani tana chekkiTa kanneeru jaara .. 

vaemaru vaapOye vaani veDDuveTTarae
..
muchchuvale vachchi tana muMgamuruvulachaeyi .. 

tachcheDi perugulOna tagaveTTi
nochchenani chaeyideesi nOranella jollugaara .. 

vochcheli vaapOvuvaani nooraDiMcharae
..
eppuDu vachchenO maa yillu jochchi peTTaelOni .. 

chepparaani vuMgaraala chaeyipeTTi
appaDaina vaeMkaTaedriasavaalakuDu gaana ..

 tappakuMDa beTTevaani talaketta rae

ANNAMAYYA LYRICS BOOK NO--5
SAMKIRTANA NO--148
RAGAM MENTIONED--DEVAGAMDHARI