P.SUSEELA
గంధము పూసేవేలే కమ్మని మేన యీ-
గంధము నీ మేనితావి కంటి నెక్కుడా
అద్దము చూచే వేలే అప్పటప్పటికిని
అద్దము నీ మోముకంటె నపురూపమా
ఒద్దిక తామర విరి నొత్తేవు కన్నులు నీ-
గద్దరి కన్నుల కంటె కమలము ఘనమా
బంగారు పెట్టేవేలే పడతి నీమెయినిండా
బంగరు నీతనుకాంతి ప్రతివచ్చీనా
ఉంగరాలేటికి నే వొడికపు వేళ్ళ
వెంగలి మణుల నీ వేలిగోరబోలునా
సవర మేటికినే జడియు నీనెరులకు
సవరము నీకొప్పుసరి వచ్చీనా
యివలజవులు నీకు నేలే వేంకటపతి
సవరని కెమ్మోవి చవి చవికంటేనా
gaMdhamu pUsEvElE kammani mEna yI-
gaMdhamu nI mEnitAvi kaMTi nekkuDA
addamu cUcE vElE appaTikini
addamu nI mOmukaMTe napurUpamA
oddika tAmara viri nottEvu kannulu nI-
gaddari kannula kaMTe kamalamu GanamA
baMgAru peTTEvElE paDati nImeyiniMDA
baMgAru nItanukAMti prativaccInA
uMgarAlETiki nE voDikapu vELLa
veMgali maNula nI vEligOrabOlunA
savara mETikinE jaDiyu nInerulaku
savaramu nIkoppusari vaccInA
yivalajavulu nIku nElE vEMkaTapati
savarani kemmOvi cavikeMTEnA
AUDIO LINK
No comments:
Post a Comment