G.NAGESWARA NAIDU
పలుకుతేనియలనుపారమియ్యవే
అలరువాసనల నీ అధరబింబాలకు
పుక్కిటిలేనగవు పొంగుఁబాలుచూపవే
చక్కని నీవదనంపుచందమామకు
అక్కరొ నీవాలుగన్నులారతిగానెత్తవే
గక్కన నీచెక్కు తొలుకరిమెరుపులకు
కమ్మని నీమేనితావి కానుకగానియ్యవే
వుమ్మగింతచల్లెడి నీవూరుపులకు
చిమ్ముల నీచెమటలఁ జేయవేమజ్జనము
దిమ్మరి నీమురిపెపుతీగమేనికి
పతివేంకటేశుగూడి పరవశమియ్యవే
యితవైన నీమంచి హృదయానకు
అతనినే తలచగ నానతియ్యగదవె
తతితోడ నీలోని తలపోతలకు
DUET
palukutEniyalanupAramiyyavE
alaruvAsanala nI adharabiMbAlaku
pukkiTilEnagavu poMgu@MbAluchUpavE
chakkani nIvadanaMpuchaMdamAmaku
akkaro nIvAlugannulAratigAnettavE
gakkana nIchekku tolukarimerupulaku
kammani nImEnitAvi kAnukagAniyyavE
vummagiMtachalleDi nIvUrupulaku
chimmula nIchemaTala@M jEyavEmajjanamu
dimmari nImuripeputIgamEniki
pativEMkaTESugUDi paravaSamiyyavE
yitavaina nImaMchi hRdayAnaku
ataninE talachaga nAnatiyyagadave
tatitODa nIlOni talapOtalaku
No comments:
Post a Comment