BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU
Showing posts with label ANNAMAYYA--O. Show all posts
Showing posts with label ANNAMAYYA--O. Show all posts

Tuesday, 15 May 2012

ANNAMAYYA SAMKIRTANALU--HANUMAN


BKP
ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా
యెక్కడా హనుమంతుని కెదురా లోకము

ముందట నేలెడి పట్టమునకు బ్రహ్మయినాడు
అందరు దైత్యులచంపి హరిపేరైనాడు
అంది రుద్రవీర్యము తానై హరుడైనాడు
యెందునా హనుమంతుని కెదురా లోకము

చుక్కలు మోవ పెరిగి సూర్యుడు తానైనాడు
చిక్కు పాతాళము దూరి శేషుడైనాడు
గక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు
ఎక్కువ హనుమంతుని కెదురా లోకము

జలధి పుటమెగసి చంద్రుడు తానైనాడు
చెలగి మేరుపుపొంత సింహమైనాడు
బలిమి శ్రీవేంకటేశు బంటై మంగాంబుధి
ఇల ఈ హనుమంతుని కెదురా లోకము
okkaDE EkAMga viiruDurviki daivamaunaa
yekkaDA hanumaMtuni keduraa lOkamu

muMdaTa nEleDi paTTamunaku brahmayinaaDu
aMdaru daityulachaMpi haripErainaaDu
aMdi rudraviiryamu taanai haruDainaaDu
yeMdunaa hanumaMtuni keduraa lOkamu

chukkalu mOva perigi suuryuDu taanainaaDu
chikku paataaLamu duuri SEshuDainaaDu
gakkana vaayujuDai jagatpraaNuDainaaDu
ekkuva hanumaMtuni keduraa lOkamu

jaladhi puTamegasi chaMdruDu taanainaaDu
celagi mErupupoMta siMhamainaaDu
balimi SriivEMkaTESu baMTai maMgaaMbudhi
ila ii hanumaMtuni keduraa lOkamu


ANNAMAYYA LYRICS BOOK NO--4
SAMKIRTANA NO--462
RAGAM MENTIONED--PADI


HANUMAN JAYANTI SUBHAKANKSHALU
B V S RAMAKUMARI

Sunday, 25 September 2011

ANNAMAYYA SAMKIRTANALU__SARANAGATI



B.GOVIND
ఒక్కడే మోక్షకర్త ఒక్కటే శరణాగతి
దిక్కని హరి గొల్చి బతికిరి తొంటివారు


నానాదేవతలున్నరు నానాలోకములున్నవి
నానావ్రతాలున్నవి నడచేటివి
జ్ఞానికి కామ్యకర్మాలు చెరపి పొందేవేమి
అనుకొన్నవేలోకాలైనా ఆయ గాక


ఒక్కడు దప్పికిద్రావు ఒక్కడు కడపనించు
ఒక్కడిందులాడు మడుగొక్కటియందే
చక్కజ్ఞానియైనవాడు సారార్ధము వేదమందు
తక్కక చేకొనుగాక తలకెత్తుకొనునా


యిది భగవద్గీతార్ధమిది అర్జునునితోను
యెదుటనే యుపదేశమిచ్చె కృష్ణుడు
వెదకి వినరో శ్రీవేంకటేశుదాసులారా
బతుకు ద్రోవ మనకు పాటించిచేకొనరో

okkaDE mOkShakarta okkaTE SaraNAgati
dikkani hari golci batikiri toMTivAru


naanaadEvatalunnaru naanaalOkamulunnavi
naanaavrataalunnavi naDacETivi
jnaaniki kaamyakarmaalu cerapi pomdEvEmi
anukonnavElOkaalainaa aaya gaaka


okkaDu dappikidraavu okkaDu kaDapaniMcu
okkaDiMdulaaDu maDugokkaTiyaMdE
cakkajnaaniyainavaaDu saaraardhamu vEdamaMdu
takkaka cEkonugaaka talakettukonunaa


yidi bhagavadgItaardhamidi arjununitOnu
yeduTanE yupadESamicce kRShNuDu
vedaki vinarO SrIvEMkaTESudaasulaaraa
batuku drOva manaku paaTiMcicEkonarO






Thursday, 17 February 2011

ANNAMAYYA SAMKIRTANALU__KRISHNA





P.S.RANGANATH


ఒకరికొకరు వొడ్డుతప్పులనే
పకపకనవ్వు పచరించేరు


కొట్టెనుట్లదే గోవిందుడంతలో
దిట్టేరు గోపసతీమణులు
పట్టిజున్నులట్టె పైపై గోవిందుడు
మెట్టెలపాదాల మెట్టెరింతులు


వారవట్టి బాలు వంచి గోవిందుడు
గోరదీరేరదే గొల్లెతలు
చీరలంటినట్టె చెంది గోవిందుడు
మేరతో కొప్పు వంచీ రింతులు


కెలసి వెన్న యారగించీ గోవిందుడు
తొలగ తోసేరు దొడ్డివారు
కలసేను శ్రీవేంకటాద్రి గోవిందుడు
అలమేలు మరి నంగనలు



okarikokaru voDDutappulanE
pakapakanavvu pacariMcEru


koTTenuTladE gOviMduDaMtalO
diTTEru gOpasatImaNulu
paTTijunnulaTTe paipai gOviMduDu
meTTelapaadaala meTTeriMtulu


vaaravaTTi baalu vaMci gOviMduDu
gOradIrEradE golletalu
cIralaMTinaTTe ceMdi gOviMduDu
mEratO koppu vaMcI riMtulu


kelasi venna yaaragiMcI gOviMduDu
tolaga tOsEru doDDivaaru
kalasEnu SrIvEMkaTAdri gOviMduDu
alamElu mari naMganalu

Wednesday, 17 November 2010

ANNAMAYYA SAMKIRTANALU--SRUNGARAM


SRGRM
ఓయమ్మా ఇంతయేల వొద్దనరే
నాయముగాదిందరిలో నగుబాటు తనకును

చెక్కునొక్కితిని సెలవి నవ్వితిని
మక్కువతో నెంతైనా మాటాడడు
మొక్కూ మొక్కితిని మోనాన నుండితిని
యెక్కుడు దిట్టితినంటా నెగ్గువట్టీ నితడు

ఇచ్చకము జేసితి ఇచ్చితి విడెమును
కచ్చుపెట్టి యెంతైనా కరగడు
ముచ్చటలాడితిని మోవిజూచితి తన్ను
బచ్చిగా జేసితినంటా పగచాటీ నితడు

కన్నులా జొక్కితిని కాగిటా నించితిని
మన్నించె రతినెంతైనా మానడు
సన్నల మెచ్చితిని చాయల హెచ్చితిని
ఇన్నిటా శ్రీవేంకటేశు డెంతజాణే ఇతడు


OyammA iMtayEla voddanarE
nAyamugAdiMdarilO nagubATu tanakunu

chekkunokkitini selavi navvitini
makkuvatO neMtainA mATADaDu
mokkU mokkitini mOnAna nuMDitini
yekkuDu diTTitinaMTA negguvaTTI nitaDu

ichchakamu jEsiti ichchiti viDemunu
kachchupeTTi yeMtainA karagaDu
muchchaTalADitini mOvijUchiti tannu
bachchigA jEsitinaMTA pagachATI nitaDu

kannulA jokkitini kAgiTA niMchitini
manniMche ratineMtainA mAnaDua
sannala mechchitini chAyala hechchitini
inniTA SrIvEMkaTESu DeMtajANE itaDu

Friday, 22 October 2010

ANNAMAYYA SAMKIRTANALU_HANUMAN




 BKP
ఓ పవనాత్మజ ఓ ఘనుడా
బాపు బాపనగా పరిగితిగా


ఓ హనుమంతుడ ఉదయాచల ని-
ర్వాహక నిజ సర్వ ప్రబలా
దేహము మోచిన తెగువకు నిటువలె
సాహస మిటువలె చాటితిగా 


ఓ రవి గ్రహణ ఓదనుజాంతక
మారులేక మతి మలసితిగా
దారుణపు వినతా తనయాదులు
గారవింప నిటు కలిగితిగా


ఓ దశముఖ హర ఓ వేంకటపతి-
పాదసరోరుహ పాలకుడా
ఈ దేహముతో ఇన్నిలోకములు
నీదేహమెక్క నిలిచితిగా 



O pavanAtmaja O ghanuDA
bApu bApanagA parigitigA


O hanumaMtuDa udayAchala ni-
rwAhaka nija sarwa prabalA
dEhamu mOcina teguvaku niTuvale
sAhasa miTuvale chATitigA 


O ravi grahaNa OdanujAMtaka
mArulEka mati malasitigA
dAruNapu vinatA tanayAdulu
gAraviMpa niTu kaligitigA


O daSamukha hara O vEMkaTapati-
pAdasarOruha pAlakuDA
I dEhamutO innilOkamulu
nIdEhamekka nilichitigA 


ANNAMAYYA LYRICS BOOK NO--4
SAMKIRTANA--327
RAGAM MENTIONED--SRIRAGAM

Wednesday, 28 April 2010

ANNAMAYYA SAMKIRTANALU__ALAMELUMANGA






ఒకపరి కొకపరి వయ్యారమై 
మొకమున కళలెల్ల మొలచినట్లుండె

జగదేక పతిమేన చల్లిన కర్పూర ధూళి -
జిగిగొని నలువంక చిందగాను
మొగి చంద్రముఖి నురమున నిలిపె గాను - 
పొగరు వెన్నెల దిగిపోసినట్లుండె

పొరిమెరుగు చెక్కుల పూసిన తట్టు పునుగు - 
కరిగి యిరుదెసల కారగాను
కరిగమన విభుడు గనుక మోహ మదము - 
తొరిగి సామజ సిరి తొలకి నట్లుండె

నెరయ శ్రీవేంకటేశు మేన సింగారముగాను - 
తరచైన సొమ్ములు ధరియించగా
మెఱుగు బోడీ అలమేలు మంగయు తాను - 
మెఱుపు మేఘము గూడి మెఱసినట్టుండె
okapari kokapari koyyaaramai 
mokamuna kaLalella molachinaTluMDe

jagadaeka patimaena challina karpoora dhooLi -
jigigoni naluvaMka chiMdagaanu
mogi chaMdramukhi nuramuna nilipe gaanu - 
pogaru vennela digipOsinaTluMDe

porimerugu chekkula poosina taTTu punugu - 
karigi yirudesala kaaragaanu
karigamana vibhuDu ganuka mOha madamu - 
torigi saamaja siri tolaki naTluMDe

neraya SreevaeMkaTaeSu maena siMgaaramugaanu - 
tarachaina sommulu dhariyiMchagaa
me~rugu bODee alamaelu maMgayu taanu - me~
rupu maeghamu gooDi me~rasinaTTuMDe