BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU
Showing posts with label NIMDASTUTI. Show all posts
Showing posts with label NIMDASTUTI. Show all posts

Thursday, 28 June 2012

ANNAMAYYA SAMKIRTANALU--NIMDASTUTI



CKP
దేవరవు గావా తెలిసితిమల్లనాడే
చేవదేరినపనులు చెప్పనేల యికను


జఱసి జఱసి నీయాచారములేమి చెప్పేవు
యెఱగనా నీ సరితలింతకతొల్లి
యెఱుకలుసేసి నీవు యెచ్చరించనిపుడేల
మఱచేవా నీకతలు మాటిమాటికిని


వెంటనే పొగడుకొని విఱ్ఱవీగేవెంతేసి
కంటిగా నీగుణములు గరగరగా
పెంటలుగా బచారించి పెనుగులాడగనేల
జంటగాకవిడిచేవా చలముతో నీవు


పుక్కిటివిడెమిచ్చి పొంచీ వొడబరచేవు
దక్కెగా నీకాగిలి తతితోడను
గక్కన శ్రీవేంకటేశ కలసితివిదె నన్ను
తక్కువయినవా నీ తగినమన్ననలు

dEvaravu gAvA telisitimallanADE
cEvadErinapanulu ceppanEla yikanu


ja~rasi ja~rasi nIyAcAramulEmi ceppEvu
ye~raganA nI saritaliMtakatolli
ye~rukalusEsi nIvu yeccariMcanipuDEla
ma~racEvA nIkatalu mATimATikini


veMTanE pogaDukoni vi~r~ravIgEvemtEsi
kaMTigA nIguNamulu garagaragA
peMTalugA bacAriMci penugulADaganEla
jaMTagAkaviDicEvA calamutO nIvu


pukkiTiviDemicci poMcI voDabaracEvu
dakkegA nIkAgili tatitODanu
gakkana SrIvEMkaTESa kalasitivide nannu
takkuvayinavA nI taginamannanalu


ANNAMAYYA LYRICS BOOK NO--19
SAMKIRTANA NO--147
RAGAM MENTIONED--NATTANARAYANI

Saturday, 14 April 2012

ANNAMAYYA SAMKIRTANALU--SRUNGARAM / NIMDASTUTI


K.MURALIKRISHNA




నీవేమిసేతువయ్య నేవచ్చుటే దోసము
యీవేళ వెన్నెల గాసీనిదియేపో దోసము


వలచిన జవరాల వద్దనగ దోసము
కలిగినట్టాడకున్న కడుదోసము
యెలమి నీయంత నీవెరగవు దోసము
మలసి యింతసేసిన మరునిదే దోసము


చెంగటి చెలులు బుధ్ధి చెప్పినది దోసము
యింగితపు మతిరాయయినది దోసము
కంగించి రానీనియట్టి కాంతలదే దోసము
తొంగార దైవము దయవుట్టించని దోసము


తొట్టిన సంపదలతో దొరవైన దోసము
వట్టినేరాలు నిన్నేంఛేవారి దోసము
యిత్తే శ్రీవేంకటేశ యింతికూడితివి నేడు
తట్టినట్టిందరికి నింతట బాసె దోసము
nIvEmisEtuvayya nEvaccuTE dOsamu
yIvELa vennela gAsInidiyEpO dOsamu

valacina javarAla vaddanaga dOsamu
kaliginaTTADakunna kaDudOsamu
yelami nIyaMta nIveragavu dOsamu
malasi yimtasEsina marunidE dOsamu

ceMgaTi celulu budhdhi ceppinadi dOsamu
yiMgitapu matirAyayinadi dOsamu
kamgimci rAnIniyaTTi kAmtaladE dOsamu
tomgaara daivamu dayavuTTimcani dOsamu

toTTina saMpadalatO doravaina dOsamu
vaTTinErAlu ninnEMCEvAri dOsamu
yittE SrIvEMkaTESa yiMtikUDitivi nEDu
taTTinaTTindariki nimtaTa bAse dOsamu


ANNAMAYYA LYRICS BOOK NO--26
SAMKIRTANA NO--72
RAGAM MENTIONED--BOULI


Thursday, 10 February 2011

ANNAMAYYA SAMKIRTANALU__NIMDASTUTI


     
                                                                                     
ANAND BHATTAR
నీదాసుల భంగములు నీవుజూతురా
ఏదని జూచేవు నీకు నెచ్చరించవలెనా 


పాల సముద్రము మీద పవ్వళించ్చినట్టి నీకు
బేలలై సురలు మొరవెట్టిన యట్టు 
వేళతో మామనువులు విన్నవించితిమి నీకు
ఏల నిద్దిరించేవు మమ్మిట్టే రక్షించరాద 


ద్వారకా నగరములో తగ నెత్తమాడే నీకు
బిరాన ద్రౌపది మొరవెట్టిన యట్టు 
ఘోరపు రాజసభల కుంది విన్నవించితిమి
ఏరీతి పరాకు నీకు నింక రక్షించరాద 


ఎనసి వైకుంఠములో నిందిర గూడున్న నీకు
పెనగి గజము మొరవెట్టిన యట్టు 
చనువుతో మాకోరికె సారె విన్నవించితిమి
విని శ్రీవేంకటేశుండ వేగ రక్షించరాద 
nIdAsula BaMgamulu nIvujUturA
Edani jUcEvu nIku neccariMcavalenA 


pAla samudramu mIda pavvaLiMccinaTTi nIku
bElalai suralu moraveTTina yaTTu 
vELatO mAmanuvulu vinnaviMcitimi nIku
Ela niddiriMcEvu mammiTTE rakShiMcarAda 


dvArakA nagaramulO taga nettamADE nIku
birAna draupadi moraveTTina yaTTu 
GOrapu rAjasaBala kuMdi vinnaviMcitimi
ErIti parAku nIku niMka rakShiMcarAda 


enasi vaikuMThamulO niMdira gUDunna nIku
penagi gajamu moraveTTina yaTTu 
canuvutO mAkOrike sAre vinnaviMcitimi
vini SrIvEMkaTESuMDa vEga rakShiMcarAda