PRIYA SISTERS
ప : మేలుకొనవే నీలమేఘవర్ణుడా
వేళ తప్పకుండాను శ్రీవేంకటేశుడా
చ : మంచముపై నిద్రదేర మల్లెల వేసేరు
ముంచి తుఱుము ముడువ మొల్లల వేసేరు
కంచము పొద్దారగించ కలువల వేసేరు
పింఛపు చిక్కుదేర సంపెంగల వేసేరు
చ : కలసిన కాకదేర గన్నేరుల వేసేరు
వలపులు రేగీ విరజాజుల వేసేరు
చలువగా వాడుదేర జాజుల వేసేరు
పులకించ గురువింద పూవుల వేసేరు
చ : తమిరేగ గోపికలు తామరల వేసేరు
చెమటార మంచి తులసిని వేసేరు
అమర శ్రీవేంకటేశ అలమేలుమంగ నీకు
మమతల పన్నీటి చేమంతుల వేసేరు
pa : maelukonavae neelamaeghavarNuDaa
vaeLa tappakuMDaanu SreevaeMkaTaeSuDaa
cha : maMchamupai nidradaera mallela vaesaeru
muMchi tu~rumu muDuva mollala vaesaeru
kaMchamu poddaaragiMcha kaluvala vaesaeru
piMChapu chikkudaera saMpeMgala vaesaeru
cha : kalasina kaakadaera gannaerula vaesaeru
valapulu raegee virajaajula vaesaeru
chaluvagaa vaaDudaera jaajula vaesaeru
pulakiMcha guruviMda poovula vaesaeru
cha : tamiraega gOpikalu taamarala vaesaeru
chemaTaara maMchi tulasini vaesaeru
amara SreevaeMkaTaeSa alamaelumaMga neeku
mamatala panneeTi chaemaMtula vaesaeru
ANNAMAYYA LYRICS BOOK NO--15
SAMKIRTANA NO--200
RAGAM MENTIONED--BHUPALAM
DWARAM TYAGARAJU
నానా మహిమల శ్రీ నారసింహము
పూని మమ్ము రక్షించీ పొగడెద నిదివో
కొండవంటి వేదాద్రిగుహలలో సింహము
దండి భవనాశి యేటిదరి సింహము
అండ నారుశాస్త్రముల అడవిలో సింహము
నిండి అహోబలముపై నిక్కిచూచీనదిగో
దిట్ట యోగీంద్రుల మతితెర మఱగు సింహము
జట్టిగొన్న శ్రీసతితో జంటసింహము
పట్టి దైత్యుల వేటాడే బలుదీము సింహము
మెట్టి అహోబలముపై మెఱసీదానదిగో
పలుదేవతల వెనుబలమైన సింహము
కెలసి కంబాన చెనగిన సింహము
అలరి శ్రీవేంకటేశడైనట్టి సింహము
కొలువై అహోబలాన గురుతయనిదివో
nAnA mahimala SrI nArasiMhamu
pUni mammu rakShiMcI pogaDeda nidivO
koMDavaMTi vEdAdriguhalalO siMhamu
daMDi bhavanASi yETidari siMhamu
aMDa nAruSAstramula aDavilO siMhamu
niMDi ahObalamupai nikkicUcInadigO
diTTa yOgIMdrula matitera ma~ragu siMhamu
jaTTigonna SrIsatitO jaMTasiMhamu
paTTi daityula vETADE baludImu siMhamu
meTTi ahObalamupai me~rasIdAnadigO
paludEvatala venubalamaina siMhamu
kelasi kaMbAna cenagina siMhamu
alari SrIvEMkaTESaDainaTTi siMhamu
koluvai ahObalAna gurutayanidivO
ANNAMAYYA LYRICS BOOK NO--15
SAMKIRTANA NO--119
RAGAM MENTIONED--NATA
D.V.MOHANAKRISHNA
యిదియె నాకు మతము యిదివ్రతము
వుదుటల కర్మము వొల్లనింకను
నిపుణత హరి నే నిను శరణనుటె
తపములు జపములు ధర్మములు
నెపమున సకలము నీవే చేకొను
వుపమల పుణ్యము వొల్ల నేయింకను
హరి నీదాసుడననుకొనుటే నా-
పరమును ఇహమును భాగ్యమును
ధర నీమాయల తప్పుదెరువులను
వొరగి సుకృతము వొల్లనేయింకను
నారాయణ నీనామము దలచుట
సారపు చదువులు శాస్త్రములు
యీరీతి శ్రీవేంకటేశ నిను గొలిచితి
వూరక యితరమువొల్లనే యింకను
yidiye nAku matamu yidivratamu
vuduTala karmamu vollaniMkanu
nipuNata hari nE ninu SaraNanuTe
tapamulu japamulu dharmamulu
nepamuna sakalamu nIvE cEkonu
vupamala puNyamu volla nEyiMkanu
hari nIdAsuDananukonuTE nA-
paramunu ihamunu bhaagyamunu
dhara nImAyala tappuderuvulanu
voragi sukRtamu vollanEyiMkanu
nArAyaNa nInAmamu dalacuTa
sArapu caduvulu SAstramulu
yIrIti SrIvEMkaTESa ninu goliciti
vUraka yitaramuvollanE yiMkanu
ANNAMAYYA LYRICS BOOK NO--15
SAMKIRTANA NO--166
RAGAM MENTIONED--SAMKARABHARANAM
N.C.SATYANARAYANA& R.RAMYA
యీ దేహికి నింకాను
సాధించిన సకలము జయము
యేది తుద యెన్నడుముగుసును
ఆదికి ననాది హరిమాయ
సాధించి సుజ్ఞానియైతే
యీదెస వెదకిన యిహమే పరము
బలిమేది భవముల బాయగ
కలిగినట్లెల్లా గర్మంబు
నిలుకడలో నిర్మలుడైతే
వలసినచోటనే వాడికి సుఖము
తనివేది తగుభోగములకు
తనలోపలనే దైవికము
చనవుననూ శరణుచొచ్చితే
వెనుకొనెనిదె శ్రీవేంకటవిభుడు
I dEhiki niMkAnu
sAdhimcina sakalamu jayamu
yEdi tuda yennaDumugusunu
Adiki nanAdi harimAya
sAdhimci sujnAniyaitE
yIdesa vedakina yihamE paramu
balimEdi bhavamula bAyaga
kaliginaTlellA garmambu
nilukaDalO nirmaluDaitE
valasinacOTanE vADiki sukhamu
tanivEdi tagubhOgamulaku
tanalOpalanE daivikamu
canavunanU SaraNucoccitE
venukonenide SrIvEMkaTavibhuDu
ANNAMAYYA LYRICS BOOK NO--15
SAMKIRTANA NO--4
RAGAM MENTIONED--MAMGALAKOUSIKA
N.C.SATYANARAYANA& B.M.VASANTA
శరణంటే నీవు దిక్కు సర్వేశ్వరా
నిరతి మాయవావికిని నిజమేది
యిన్నిటా బుట్టినదేహికి యింకా సులశీలమేది
చన్నుబాలకానికి యాచారమేది
పన్నిన సంసారికి పరమాత్ముచింతయేది
వున్నతి జంతరపుబొమ్మకు ఉద్యోగమేది
పంచేద్రియబుధ్ధికి పట్టి స్వతంత్ర్యమేది
చంచలచిత్తునికి విజ్ఞానమేది
యెంచబూతావాసునికింక జేసేధర్మమేది
నించి మలమూత్రకాయునికి భోగమేది
కామాతురునకును కర్మానుష్ఠానమేది
వాముల నిత్యలోభికి వైరాగ్యమేది
శ్రీమంతుడైనయట్టి శ్రీవేంకటేశ్వర నీవే
కామించి కాచితి గాక గతియేది
SaraNaMTE nIvu dikku sarwESwarA
nirati mAyavAvikini nijamEdi
yinniTA buTTinadEhiki yiMkA sulaSIlamEdi
cannubAlakAniki yAcAramEdi
pannina saMsAriki paramAtmuciMtayEdi
vunnati jaMtarapubommaku udyOgamEdi
pamcEdriyabudhdhiki paTTi swatamtryamEdi
camcalacittuniki vijnAnamEdi
yeMcabUtAvAsunikimka jEsEdharmamEdi
niMci malamUtrakAyuniki bhOgamEdi
kAmAturunakunu karmAnuShThAnamEdi
vAmula nityalObhiki vairAgyamEdi
SrImamtuDainayaTTi SrIvEMkaTESwara nIvE
kAmiMci kAciti gAka gatiyEdi
ANNAMAYYA LYRICS BOOK NO--15
SAMKIRTANANA--205
RAGAM MENTIONED--BHUPALAM
pattina-varala-bhagyamidi
పట్టిన వారల భాగ్యమిదే
గుట్టు తెలిసితే గురుతులివే
కామ ధేనువును కల్పవృక్షమును
దామోదర నీ దర్శనం
భూమీశత్వము భువనేశత్వము
సామజవరద నీ శరణ్యము
పరుస వేదియును పరమైశ్వర్యము
హరి నిను గొలిచే అనుభవము
నిరత భోగములు నిధి నిధానములు
గరిమమెరయు మీ కైంకర్యములు
నిండు భొగములు నిత్య శోభనము
కొండలయ్య నీ గుణ కధలు
అండనె శ్రీ వేంక టాధిప సర్వము
మెండుకొన్నదిదె మీ కరుణ
paTTina vaarala bhaagyamidE
guTTu telisitE gurutulivE
kaama dhEnuvunu kalpavRkshamunu
daamOdara nee darSanam
bhUmeeSatvamu bhuvanESatvamu
saamajavarada nee SaraNyamu
parusa vEdiyunu paramaiSwaryamu
hari ninu golichE anu bhavamu
nirata bhOgamulu nidhi nidhaanamulu
garimamerayu mee kaimkaryamulu
nimDu bhogamulu nitya SObhanamu
konDalayya nee guNa kadhalu
anDane SrI vEnka Taadhipa sarvamu
menDukonnadide mee karuNa
ANNAMAYYA LYRICS BOOK NO--15
SAMKIRTANA NO--126
RAGAM MENTIONED--MALAHARI