BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU
Showing posts with label SINGER--SPB. Show all posts
Showing posts with label SINGER--SPB. Show all posts

Tuesday, 28 February 2012

ANNAMAYYA SAMKIRTANALU--SRUNGARAM


SPB

ఎటువంటివిలాసిని ఎంత జాణ యీచెలువ
తటుకన నీకు దక్కె దైవార చూడవయ్యా


మగువమాటాడితేను మాణికాలు నిండుకొనీ
పగడాలు పెదవుల పచ్చిదేరీనీ
మగిడిచూచితేనూ మంచినీలాలుప్పతిల్లీ
తగునీకు నీపెదిక్కు తప్పక జూడవయ్యా


పడతి జవ్వనమున పచ్చలు కమ్ముకొనీని
నడచితే వైఢూర్యాలూ వెడలీ గోళ్ళ
తొడిబడనవ్వితేనూ తొరిగీనీ వజ్రాలు
వొడికమైనది యీపె వొరపు చూపవయ్యా


కొమ్మప్రియాల తేనెల కురిసీ పుష్యరాగాలు
కుమ్మరించీ చెనకుల గోమేధికాలు
ముమ్మరపు చెమటల ముత్తపుసరాలు నిండీ
నెమ్మది శ్రీవేంకటేశ నీదేవి చూడవయ్యా
eTuvamTivilAsini emta jANa yIceluva
taTukana nIku dakke daivaara cUDavayyA

maguvamaaTADitEnu maaNikAlu nimDukonI
pagaDAlu pedavula paccidErInI
magiDicUcitEnU mamcinIlAluppatillI
tagunIku nIpedikku tappaka jUDavayyaa

paDati javvanamuna paccalu kammukonIni
naDacitE vaiDHUryaalU veDalI gOLLa
toDibaDanavvitEnU torigInI vajraalu
voDikamainadi yIpe vorapu cUpavayyaa

kommapriyaala tEnela kurisI puShyaraagaalu
kummarimcI cenakula gOmEdhikaalu
mummarapu cemaTala muttapusaraalu nimDI
nemmadi SrIvEMkaTESa nIdEvi cUDavayyaa

Saturday, 18 February 2012

ANNAMAYYA SAMKIRTANALU--RAMA


NEDUNURI



జయ జయ రామా సమరవిజయ రామా
భయహర నిజభక్తపారీణ రామా

జలధిబంధించిన సౌమిత్రిరామా
సెలవిల్లువిరచినసీతారామా
అలసుగ్రీవునేలినాయోధ్యరామా
కలిగి యజ్ఞముగాచేకౌసల్యరామా

అరిరావణాంతక ఆదిత్యకులరామా
గురుమౌనులను గానేకోదండరామా
ధర నహల్యపాలిటిదశరథరామా
హరురాణినుతులలోకాభిరామా.

అతిప్రతాపముల మాయామృగాంతక రామా
సుతకుశలవప్రియ సుగుణ రామా
వితతమహిమలశ్రీవేంకటాద్రిరామా
మతిలోనబాయనిమనువంశరామా

SPB

jaya jaya raamaa samaravijaya raamaa
bhayahara nijabhaktapaareeNa raamaa

jaladhibaMdhiMchina saumitriraamaa
selavilluvirachinaseetaaraamaa
alasugreevunaelinaayOdhyaraamaa
kaligi yaj~namugaachaekausalyaraamaa

ariraavaNaaMtaka aadityakularaamaa
gurumaunulanu gaanaekOdaMDaraamaa
dhara nahalyapaaliTidaSaratharaamaa
haruraaNinutulalOkaabhiraamaa.

atiprataapamula maayaamRgaaMtaka raamaa
sutakuSalavapriya suguNa raamaa
vitatamahimalaSreevaeMkaTaadriraamaa
matilOnabaayanimanuvaMSaraamaa


Thursday, 16 February 2012

ANNAMAYYA SAMKIRTANALU---SRUNGARAM


SPB

పెనుపండుగలూ సేసి పిలిపించె నిన్నమాపె
పెనగీచిత్తపుచింత పెనులంపటములు

చెవులపండుగసేసె చెలి నీసుద్దులు విని
నవకపువేడుక నిన్నటిమాపె
తివిరి వేగుదాకా దీపాళిపండుగసేసె
జవకట్టి నినుబాసి జాగరాలను

కన్నులపండుగసేసె కలికి మేడపైనుండి
నిన్నుదప్పకిట్టెచూచి నిన్నమాపె
ఉన్నతినొకనిమిషముగాదిపండుగ సేసె
తన్ను తానె తనలోని తమకానను

నిచ్చపండుగలు సేసె నీతోడిమాటలనె
నెచ్చెలి యల్లంతనుండి నిన్నమాపె
పచ్చిగా లక్ష్మీదేవి పండుగలు సేసెనిదె
యిచ్చకుడ శ్రీవేంకటేశ నిన్నుగూడెనూ

penupaMDugalU sEsi pilipimce ninnamaape
penagIcittapucimta penulampaTamulu

cevulapaMDugasEse celi nIsuddulu vini
navakapuvEDuka ninnaTimApe
tiviri vEgudAkA dIpALipaMDugasEse
javakaTTi ninubaasi jaagaraalanu

kannulapamDugasEse kaliki mEDapainumDi
ninnudappakiTTecUci ninnamaape
unnatinokanimiShamugaadipamDuga sEse
tannu taane tanalOni tamakaananu

niccapamDugalu sEse nItODimaaTalane
necceli yallamtanumDi ninnamaape
paccigaa lakShmIdEvi pamDugalu sEsenide
yiccakuDa SrIvEMkaTESa ninnugUDenU


ANNAMAYYA SAMKIRTANALU--BOOK-11
183RD SAMKIRTANA.
DESALAM RAGAM

Tuesday, 14 February 2012

ANNAMAYYA SAMKIRTANALU--SRUNGARAM



SPB
ఎంతజాణరో యీకలికీ
కాంతుడా నీభోగములకే తగును


చెలి నీకౌగిటిచెమటలజేసెను
చలువగనిప్పుడు జలకేళి
అలరుచు కుచముల నదుముచు చేసెను
పలుమరు ముదముల పర్వతకేళి


పైపై పెనగుచు బాహులతలనే
వైపుగ జేసెను వనకేళి
చూపుల నీపై సొలయుచుజేసెను
పూపవసంతము పూవులకేళి


అరుదుగనట్టివి అధరామృతముల
సరిజేసెను భోజనకేళి
కరగుచు శ్రీవేంకటేశ సేసెను
పరగిన రతులనె పరిణయకేళి
emtajANarO yIkalikI
kaamtuDaa nIbhOgamulakE tagunu


celi nIkougiTicemaTalajEsenu
caluvaganippuDu jalakELi
alarucu kucamula nidumucu cEsenu
palumaru mudamula parvatakELi


paipai penagucu baahulatalanE
vaipuga jEsenu vanakELi
cUpula nIpai solayucujEsenu
pUpavasamtamu pUvulakEli


aruduganaTTivi adharaamRtamula
sarijEsenu bhOjanakELi
karagucu SrIvEMkaTESa sEsenu
paragina ratulane pariNayakELi


Saturday, 28 January 2012

ANNAMAYYA SAMKIRTANALU--SARANAGATI




SPB
శ్రీహరిపాదతీర్థమే చెడని మందు
మోహపాశాలుకోసి మోక్షమిచ్చేమందు


కారమై కంటగించని కడుచల్లనీమందు
నూరనీ కాచనియట్టి నున్నని మందు
కోరికతో వెలపెట్టి కొనితేవల్లని మందు
వేరువెల్లంకులూ వెందువోని మందు


గురుతైనరోగములు గుణముచేసే మందు
దురితములు యెడబాపే దొడ్డమందు
నిరతము బ్రహ్మాదులు నేరుపుతోసేవించేమందు
నరకము సొరనట్టి నయమైన మందు


పొంకముతో భయములు పొందనీయని మందు
మంకుబుధ్ధులు మాంపి మన్నించే మందు
పంకజాక్ష వేంకటరమణ ప్రసన్నుని మందు
శంకించక తనదాసుల చేపట్టే మందు



SrIharipaadatIrthamE ceDani maMdu
mOhapaaSAlukOsi mOkShamiccEmamdu


kaaramai kamTagimcani kaDucallanImamdu
nUranI kaacaniyaTTi nunnani mamdu
kOrikatO velapeTTi konitEvallani mamdu
vEruvellamkulU vemduvOni mamdu


gurutainarOgamulu guNamucEsE mamdu
duritamulu yeDabaapE doDDamamdu
niratamu brahmaadulu nEruputOsEvimcEmamdu
narakamu soranaTTi nayamaina mamdu


pomkamutO bhayamulu pomdanIyani mamdu
mamkubudhdhulu maanpi mannimcE mamdu
pamkajaakSha vEmkaTaramaNa prasannuni mamdu
Samkimcaka tanadaasula cEpaTTE mamdu




Friday, 15 April 2011

ANNAMAYYA SAMKIRTANALU__RAMA




SPB


రామ రామ రామకృష్ణ రాజీవలోచన నీకు
దీము వంటి బంటననే తేజమే నాది

వారధి దాటి మెప్పించ వాయుజుడనే గాను
సారె చవుల మెప్పించ శబరిగాను
బీరాన సీత నిచ్చి మెప్పించ జనకుండగాను
ఏరీతి మెప్పింతు నన్నెట్లా గాచేవో

ఘనమై మోచి మెప్పించ గరుడుడనే గాను
కొన కామసుఖమిచ్చు గోపిక గాను
వినుతించి మెప్పించ వేయినోళ్ళ భొగిగాను
నిన్నెట్లు మెప్పింతు నన్ను గాచే దెట్లా

నవ్వుచు పాడి మెప్పించ నారదుడనే గాను
అవ్వల ప్రాణమీయ జటాయువు గాను
ఇవ్వల శ్రీ వేంకటేశ యిటునీకె శరణంటి
అవ్వల నా తెరువిదే రక్షించే దెట్లా



NEDUNURI


Raama raama raamakrshna raajeevalochana neeku
Deemu vamti bamtananae taejamae naadi

Vaaradhi daati meppimcha vaayujudanae gaanu
Saare chavula meppimcha Sabarigaanu
Beeraana seeta nichchi meppimcha janakumdagaanu
Aereeti meppimtu nannetlaa gaachaevo

Ghanamai mochi meppimcha garududanae gaanu
Kona kaamasukhamichchu gopika gaanu
Vinutimchi meppimcha vaeyinolla bhogigaanu
Ninnetlu meppimtu nannu gaachae detlaa

Navvuchu paadi meppimcha naaradudanae gaanu
Avvala praanameeya jataayuvu gaanu
Ivvala Sree vaemkataesa yituneeke saranamti
Avvala naa teruvidae rakshimchae detlaa