BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU
Showing posts with label ANNAMAYYA BOOK NO--19. Show all posts
Showing posts with label ANNAMAYYA BOOK NO--19. Show all posts

Saturday, 15 December 2012

ANNAMAYYA SAMKIRTANALU--SRUNGARAM


CKP

ఇందులోనేవున్నది మీఇద్దరి జాణతనము
అందరము నేమని యాడేము నిన్నును

బాగాలిచ్చేయాటదాని పయ్యెదకొంగెడలించి
చేగదేరేచన్నులు పిసికేవేమయ్యా
ఆగడీడవని నిన్నునౌగాదనగలేక
సోగకన్నుల దప్పక చూచెనాపెనిన్నును

కుంచెవేసేమగువను కొప్పువట్టితీసిమోవి-
యంచు గంటిసేసితివౌనయ్య
వంచకుండవనుచు రవ్వలుగా జేయగలేక
ముంచినమొగమాటాన మొక్కినవ్వీ నిన్నును

సురటివిసరేయింతి జొక్కించి కాగిటగూడి
కెరలించేవు సిగ్గుచెక్కిటనేమయ్యా
పొరపొచ్చెగాడవని పోరక శ్రీవేంకటేశ
సరినిక్కి పైనొరగి యాసలబెట్టీ నిన్నును
imdulOnEvunnadi mIiddari jANatanamu
amdaramu nEmani yADEmu ninnunu

bAgAliccEyATadAni payyedakomgeDalimci
cEgadErEcannulu pisikEvEmayyaa
AgaDIDavani ninnunougAdanagalEka
sOgakannula dappaka cUcenApeninnunu

kumcevEsEmaguvanu koppuvaTTitIsimOvi-
yaMcu gaMTisEsitivounayya
vamcakumDavanucu ravvalugA jEyagalEka
mumcinamogamATAna mokkinavvI ninnunu

suraTivisarEyimti jokkimci kAgiTagUDi
keralimcEvu siggucekkiTanEmayyaa
porapoccegADavani pOraka SrIvEMkaTESa
sarinikki painoragi yAsalabeTTI ninnunu
ANNAMAYYA LYRICS BOOK NO--19
SAMKIRTANA NO--222
RAGAM MENTIONED--KUMTALAVARALI

Monday, 23 July 2012

ANNAMAYYA SAMKIRTANALU---SRUNGARAM


CKP

కానవచ్చీనందులోనే కడమదొడమలెల్లా
నీనేరుపులామీద నెరుపుమా చూతము


చేపట్టుకుంచమనంటా సిగ్గులీడబలికేవు
ఆపెతోడనీమాటే ఆడుమా నీవు
వోపుదునంటా నాకు వూడిగాలు చెప్పేవు
యేపున నాపెచేత చేయించుకొమ్మా చూతము


గోలదాననంటా నన్ను కొనగోర జెనకేవు
నాలినాపెతోడనిట్టె నవ్వుమా నీవు
మేలుగలదాననంటా మెట్టేవు నాపాదము
గేలినాపెపాదాన దాకించుమాచూతము


సేసుకొన్నదాననంటా చేరి నన్నుగూడితివి
ఆసల నాపె కాగిట నంటుమా నీవు
శ్రీసతినంటా నన్ను శ్రీవేంకటేశ ఏలితి
భూసతి ఆపెను నిట్టె పొందుమా చూతము
kaanavaccInaMdulOnE kaDamadoDamalellA
nInErupulAmIda nerupumA cUtamu

cEpaTTukuMcamanaMTA siggulIDabalikEvu
ApetODanImATE ADumA nIvu
vOpudunaMTA nAku vUDigAlu ceppEvu
yEpuna nApecEta cEyiMcukommA cUtamu

gOladAnanaMTA nannu konagOra jenakEvu
nAlinApetODaniTTe navvumA nIvu
mElugaladAnanaMTA meTTEvu nApaadamu
gElinApepAdAna dAkiMcumAcUtamu

sEsukonnadAnanaMTA cEri nannugUDitivi
Asala nApe kAgiTa naMTumA nIvu
SrIsatinaMTA nannu SrIvEMkaTESa Eliti
bhUsati Apenu niTTe poMdumA cUtamu


ANNAMAYYA LYRICS BOOK NO--19,
SAMKIRTANA NO--201
,RAGAM MENTIONED--PURVAGOULA

Saturday, 30 June 2012

ANNAMAYYA SAMKIRTANALU--SRUNGARAM


CKP
ఊరకే నన్నిట్టు దూరివుప్పదించేవు
యేరీతి తక్కరియౌట యెఱగవు నీవు


ఆతడు వాసులెక్కించి ఆటకానకు బెట్టితే
యేతులకు గాతాలించి యేలచూచేవే
రాతిరిబగలు దాను రచ్చలెందో సేసివచ్చి
యీతల సటలుసేసేదెఱగవు నీవు




తానే సన్నలు సేసితగవుల బెట్టితేను
పేనిపట్టుక నీవేల పెనగాడేవే
ఆనుకొనివాడవారినందరి బెండ్లాడివచ్చి
యీనేరుపులు చూపేది యెఱగవు నీవు


శ్రీవేంకటేశ్వరుడు చేరి యిద్దరిగూడితే
చేవమీర నీవేల సిగ్గువడేవే
వేవేలు సతులకు వేరెసేసవెట్టివచ్చి
యీవిధానమొఱగేది యెఱగవునీవు


UrakE nanniTTu dUrivuppadiMcEvu
yErIti takkariyouTa ye~ragavu nIvu


AtaDu vAsulekkiMci ATakAnaku beTTitE
yEtulaku gAtAliMci yElacUcEvE
raatiribagalu dAnu raccaleMdO sEsivacci
yItala saTalusEsEde~ragavu nIvu




tAnE sannalu sEsitagavula beTTitEnu
pEnipaTTuka nIvEla penagADEvE
AnukonivaaDavArinaMdari beMDlADivacci
yInErupulu cUpEdi ye~ragavu nIvu




SrIvEMkaTESwaruDu cEri yiddarigUDitE
cEvamIra nIvEla sigguvaDEvE
vEvElu satulaku vEresEsaveTTivacci
yIvidhAnamo~ragEdi ye~rgavunIvu




ANNAMAYYA LYRICS BOOK NO--19
SAMKIRTANA NO--186
RAGAM MENTIONED--SUDHAVASANTAM

Thursday, 28 June 2012

ANNAMAYYA SAMKIRTANALU--SRUNGARAM





CKP


మచ్చికతోనేలవయ్య మదన సామ్రాజ్యలక్ష్మి
పచ్చిసింగారాలచేత బండారలు నిండెను


కొమరె తురుమునను గొప్పమేఘముదయించి
చెమటవాన గురిసె జెక్కులవెంట
అమరపులకపైరు అంతటాను చెలువొంది 
ప్రమదాలవలపుల పంటలివి పండెను


మించులచూపులతీగె మెఱుగులిట్టె మెరిచి
అంచెగోరికల జళ్ళవె పట్టెను
సంచితపుకుచముల జవ్వనరాసులుమించె
పొంచి నవ్వులయామని పొదిగొనెనిదివో


అలమేలుమంగమోవి యమృతము కారుకమ్మి
నలువంక మోహనపు సోనలు ముంచెను
యెలమి శ్రీవేంకటేశ యింతినిట్టె గూడితివి
కొలదిమీరి రతుల కోటార్లు గూడెను



maccikatOnElavayya madana sAmrAjyalakShmi
paccisiMgAraalacEta baMDAralu niMDenu


komare turumunanu goppamEghamudayiMci
cemaTavAna gurise jekkulaveMTa
amarapulakapairu aMtaTAnu celuvoMdi 
pramadAlavalapula paMTalivi paMDenu


miMculacUpulatIge me~ruguliTTe merici
aMcegOrikala jaLLave paTTenu
saMcitapukucamula javvanarAsulumiMce
poMci navvulayAmani podigonenidivO


alamElumaMgamOvi yamRtamu kArukammi
naluvaMka mOhanapu sOnalu muMcenu
yelami SrIvEMkaTESa yiMtiniTTe gUDitivi
koladimIri ratula kOTArlu gUDenu


ANNAMAYYA LYRICS BOOK NO--19
SAMKIRTANA NO--281
RAGAM MENTIONED--PADI






ANNAMAYYA SAMKIRTANALU--NIMDASTUTI



CKP
దేవరవు గావా తెలిసితిమల్లనాడే
చేవదేరినపనులు చెప్పనేల యికను


జఱసి జఱసి నీయాచారములేమి చెప్పేవు
యెఱగనా నీ సరితలింతకతొల్లి
యెఱుకలుసేసి నీవు యెచ్చరించనిపుడేల
మఱచేవా నీకతలు మాటిమాటికిని


వెంటనే పొగడుకొని విఱ్ఱవీగేవెంతేసి
కంటిగా నీగుణములు గరగరగా
పెంటలుగా బచారించి పెనుగులాడగనేల
జంటగాకవిడిచేవా చలముతో నీవు


పుక్కిటివిడెమిచ్చి పొంచీ వొడబరచేవు
దక్కెగా నీకాగిలి తతితోడను
గక్కన శ్రీవేంకటేశ కలసితివిదె నన్ను
తక్కువయినవా నీ తగినమన్ననలు

dEvaravu gAvA telisitimallanADE
cEvadErinapanulu ceppanEla yikanu


ja~rasi ja~rasi nIyAcAramulEmi ceppEvu
ye~raganA nI saritaliMtakatolli
ye~rukalusEsi nIvu yeccariMcanipuDEla
ma~racEvA nIkatalu mATimATikini


veMTanE pogaDukoni vi~r~ravIgEvemtEsi
kaMTigA nIguNamulu garagaragA
peMTalugA bacAriMci penugulADaganEla
jaMTagAkaviDicEvA calamutO nIvu


pukkiTiviDemicci poMcI voDabaracEvu
dakkegA nIkAgili tatitODanu
gakkana SrIvEMkaTESa kalasitivide nannu
takkuvayinavA nI taginamannanalu


ANNAMAYYA LYRICS BOOK NO--19
SAMKIRTANA NO--147
RAGAM MENTIONED--NATTANARAYANI

Wednesday, 20 June 2012

ANNAMAYYA SAMKIRTANALU--KRISHNA


CKP

అడుగరే చెలులాల అతనినే యీమాట
వుడివోనితమకాన నుండబోలు తాను


వేడుకగలప్పుడే వెసనవ్వు వచ్చుగాక
వాడి వున్నప్పుడు తలవంపులేకావా
యేడనో సతులచేత యేపుల బడిరాబోలు
యీడనే జెనకగాను యిటులానుండునా


ఆసలగూడినప్పుడే ఆయాలు గరగుగాక
పాసివున్నప్పుడు తడబాటులేకావా
బేసబెల్లివలపుల పిరివీకై రాబోలు
సేస నేబెట్టగాను సిగ్గువడి వుండునా


సరసమాడినప్పుడే చవులెల్లా బుట్టుగాక
కొరవైనయప్పుడు కొఱతలే కావా
యిరవై శ్రీవేంకటేశుడింతలోనే నన్నుగూడె
వరుసనిందాకానిటువలె జొక్కకుండునా


aDugarE celulAla ataninE yImATa
vuDivOnitamakAna nuMDabOlu tAnu


vEDukagalappuDE vesanavvu vaccugAka
vADi vunnappuDu talavaMpulEkAvA
yEDanO satulacEta yEpula baDirAbOlu
yIDanE jenakagAnu yiTulAnuMDunA


AsalagUDinappuDE AyAlu garagugAka
pAsivunnappuDu taDabATulEkAvA
bEsabellivalapula pirivIkai rAbOlu
sEsa nEbeTTagAnu sigguvaDi vuMDunA


sarasamADinappuDE cavulellA buTTugAka
koravainayappuDu ko~ratalE kAvA
yiravai SrIvEMkaTESuDiMtalOnE nannugUDe
varusaniMdAkAniTuvale jokkakuMDunA




ANNAMAYYA LYRICS BOOK NO--19
SAMKIRTANA NO--298
RAGAM MENTIONED--DESAKSHI