P.SUSEELA
చెలి నీవు మొదలనే సిగ్గరిపెండ్లికూతురవు
యిలనింత పచ్చిదీరే ఇదివో నీభావము
చెక్కుల వెంటాగారె చెమట తుడుచుకోవే
చక్కబెట్టుకొనవె నీ జారిన కొప్పు
అక్కుమీద పెనగొన్న హారాలు చిక్కుదీయవె
ఇక్కువల నీకోర్కె ఈడేరెనిపుడు
తిలకము కరగెను దిద్దుకోవె నొసలను
కలసిన గురుతులు కప్పుకొనవె
యెలమి శ్రీవేంకటేశుడు యేలే అలమేల్మంగవు
తలచిన తలపులు తలకూడె నిపుడు
celi nIvu modalanE siggaripeMDlikUturavu
yilaniMta paccidIrE idivO nIbhaavamu
cekkula veMTaagaare cemaTa tuDucukOvE
cakkabeTTukonave nI jaarina koppu
akkumIda penagonna haaraalu cikkudIyave
ikkuvala nIkOrke IDErenipuDu
tilakamu karagenu diddukOve nosalanu
kalasina gurutulu kappukonave
yelami SrIvEMkaTESuDu YElE alamElmaMgavu
talacina talapulu talakUDe nipuDu
No comments:
Post a Comment