BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU
Showing posts with label GURUSTUTI. Show all posts
Showing posts with label GURUSTUTI. Show all posts

Wednesday, 14 May 2014

ANNAMAYYA STUTI




తాళ్ళపాక అన్నమయ్యా దైవము నీవె మాకు
వేళమె శ్రీహరిగానే వెరవానతిచ్చితివి

గురుడవు నీవే సుమీ కుమతినైన నాకు
సరవి బ్రహ్మోపదేశం చేసితి
పరమబంధుడవైన పరికింప నీవే సుమీ
వరుసనె చెడకుండా  వహించుకొంటివి

తల్లివైన నీవేసుమీ తగిన విషయాలలో
వల్లదాన వడకుండా వతికించితి
అల్లుకొని తోడూనీడవైన నీవే సుమీ
చిల్లరమయలలోన చెడకుండా చేసితి

దాతవు నీవే సుమీ తగు శ్రీవేంకటనాధ
నా తలపులలోన నిలిచి నమ్మజేసితివి
యేతల చూచిన నాకు నేడుగడయూ నీవై
ఆతల యీతల నన్ను ఆదుకొని గాచితి


taaLLapaaka annamayyaa daivamu neeve maaku
vELame SrIharigaanE veravaanatichcitivi

guruDavu nIvE sumI kumatinaina naaku
saravi brahmOpadESam cEsiti
paramabamdhuDavaina parikimpa neevE sumee
varusane ceDakuMDA  vahimchukomTivi

tallivaina neevEsumee tagina vishayaalalO
valladaana vaDakuMDA vatikimchiti
allukoni tODooneeDavaina neevE sumee
chillaramayalalOna ceDakumDA cEsiti

daatavu neevE sumee tagu SrIvEmkaTanaadha
naa talapulalOna nilichi nammajEsitivi
yEtala choochina naaku nEDugaDayoo neevai
aatala yeetala nannu aadukoni gaaciti




Wednesday, 9 May 2012

GURUSTUTI--ANNAMAYYA



ప|| శరణంటి మాతని సమ్మంధమునజేసి |
మరిగించి మమునేలి మన్నించవే ||
చ|| సకలవేదములు సంకీర్తనలుచేసి |
ప్రకటించి నిను బాడి పావనుడైన |
అకలంకుడు తాళ్ళపాకన్నమాచార్యుల |
వెకలియై యేలిన శ్రీవేంకటనిలయ ||
చ|| నారదాది సనకసనందాదులవలె |
పేరుపడి నిన్ను బాడి పెద్దలైనట్టి |
ఆరీతి దాళ్ళపాకన్నమాచార్యుల |
చేరి యేలినయట్టి శ్రీవేంకటనిలయ ||
చ|| సామవేద సామగాన సప్తస్వరములను |
బాముతో నీసతినిన్ను బాడినయట్టి |
ఆముకొన్న తాళ్ళపాకన్నమాచార్యుల |
వేమరుమెచ్చిన శ్రీవేంకటనిలయా ||


pa|| SaraNaMTi mAtani sammaMdhamunajEsi |marigiMci mamunEli manniMcavE ||

ca|| sakalavEdamulu saMkIrtanalucEsi |prakaTiMci ninu bADi pAvanuDaina |
akalaMkuDu tALLapAkannamAcAryula |vekaliyai yElina SrIvEMkaTanilaya ||
ca|| nAradAdi sanakasanaMdAdulavale | pErupaDi ninnu bADi peddalainaTTi |
ArIti dALLapAkannamAcAryula | cEri yElinayaTTi SrIvEMkaTanilaya ||
ca|| sAmavEda sAmagAna saptasvaramulanu | bAmutO nIsatininnu bADinayaTTi |
Amukonna tALLapAkannamAcAryula | vEmarumeccina SrIvEMkaTanilayA |

Sunday, 6 May 2012

GURUSTUTI--ANNAMAYYA



BKP
అప్పనివరప్రసాది అన్నమయ్య
అప్పసము మాకే కలడన్నమయ్య


అంతటికీ యేలికైన ఆదినారాయణు తన
అంతరంగాన నిలిపెను అన్నమయ్యా
సంతసాన చెలువొందే సనక సనందాదు-
లంతటివాడు తాళ్ళపాక అన్నమయ్య


బిరుదుటెక్కెములుగా పెక్కు సంకీర్తనములు
హరిమీద విన్నవించె అన్నమయ్యా
విరివికలిగినట్టి వేదముల అర్ధమెల్ల
అరసి తెలిపినాడు అన్నమయ్యా


అందమైన రామానుజ మతమున 
అందుకొని నిలచినాడు అన్నమయ్యా
విందువలె మాకును శ్రీవేంకటనాధునికిచ్చె
అందరిలో తాళ్ళపాక అన్నమయ్యా

appanivaraprasaadi annamayya
appasamu mAkE kalaDannamayya


aMtaTikI yElikaina AdinArAyaNu tana
aMtaramgAna nilipenu annamayyA
saMtasAna celuvoMdE sanaka sanaMdAdu-
laMtaTivADu tALLapAka annamayya


biruduTekkemulugA pekku samkIrtanamulu
harimIda vinnaviMce annamayyA
virivikaliginaTTi vEdamula ardhamella
arasi telipinADu annamayyA


aMdamaina rAmAnuja matamuna 
amdukoni nilacinADu annamayyA
viMduvale mAkunu SrIvEMkaTanAdhunikicce
aMdarilO tALLapAka annamayyA




ANNAMAYYA JAYANTHI SUBHAKANKSHALU..

Sunday, 15 May 2011

GURUSTUTI--ANNAMAYYA JAYANTHI



Suralaku-Narulaku---Nadabridavani


సురలకు నరులకు సొరిది వినవిన
అరుదు తాళ్ళపాక అన్నమయ్య పదములు
చరణం:-1
చక్కెరై చవిచూపి జాలై తావిచల్లీ
నక్కజపు మాతువజ్రాలై మెరసీని
నిక్కుటద్దములై మా నిలువు నీడలు చూపీ-
నక్కర తాళ్ళపాక అన్నమయ్య పదములు


రీ;;,రిపమపమరిసనిరి/సా;;,నిసరిసనిసరిపమ
పా,మపదాప మపదదపమ రిమ/రీ,రిమపామ రిమపమరిస రిమ
పా,రిమామ రిమామ రిపాప మ/నీని పసాస నిరీరి పమరిసని
సా,రిససనిదపా,పమరిసని/సా,సరిమపమ రిమపనిప మపని సని
చరణం:-2
పన్నీరై పైబూసీ కప్రంబై చలువరేచీ
మిన్నగల ముత్యములై మెయినిండీనీ
వెన్నుబలములై మా వెంటవెంట తిరిగీని
అన్నిట తాళ్ళపాక అన్నమయ్యపదములు
చరణం:-3
నెట్టన వేదాంతములై నిత్యములై పొడచూపీ
పుట్టుతోనె గురువులై బోధించీని
గట్టి వరాలిచ్చే శ్రీవేంకటనాధుని మెప్పించి-
నట్టె తాళ్ళపాక అన్నమయ్య పదములు
రీ;;,రిపమపమరిసనిరి/సా;;,నిసరిసనిసరిపమ
పా,మపదాప మపదదపమ రిమ/రీ,రిమపామ రిమపమరిస రిమ
పా,రిమామ రిమామ రిపాప మ/నీని పసాస నిరీరి పమరిసని
సా,రిససనిదపా,పమరిసని/సా,సరిమపమ రిమపనిప మపని సని

suralaku narulaku soridi vinavina
arudu taaLLapaaka annamayya padamulu
charaNaM:-1
cakkerai chavichUpi jaalai taavicallI
nakkajapu maatuvajraalai merasIni
nikkuTaddamulai maa niluvu nIDalu chUpI-
nakkara taaLLapaaka annamayya padamulu

rI;;,ripamapamarisaniri/saa;;,nisarisanisaripama
paa,mapadaapa mapadadapama rima/rI,rimapaama rimapamarisa rima
paa,rimaama rimaama ripaapa ma/nIni pasaasa nirIri pamarisani
saa,risasanidapaa,pamarisani/saa,sarimapama rimapanipa mapani sani
charaNaM:-2
pannIrai paibUsI kapraMbai chaluvarEcI
minnagala mutyamulai meyiniMDInI
vennubalamulai maa veMTaveMTa tirigIni
anniTa taaLLapaaka annamayyapadamulu
charaNaM:-3
neTTana vEdAMtamulai nityamulai poDacUpI
puTTutOne guruvulai bOdhiMcIni
gaTTi varaaliccE SrIvEMkaTanaadhuni meppiMci-
naTTe taaLLapaaka annamayya padamulu
rI;;,ripamapamarisaniri/saa;;,nisarisanisaripama
paa,mapadaapa mapadadapama rima/rI,rimapaama rimapamarisa rima
paa,rimaama rimaama ripaapa ma/nIni pasaasa nirIri pamarisani
saa,risasanidapaa,pamarisani/saa,sarimapama rimapanipa mapani sani



శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారి జన్మదినసందర్భములో చిన్ని కానుక..
కాస్త అయినా నేర్చుకుని గురువుగారి జయంతినాడు పాడుకుంటారని ఆశిస్తూ..
అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ
మీ

బాలాంత్రపు వెంకట శేష రమాకుమారి
09437418299

SrI tALLapAka annamAcAryulavaari janmadinasamdarbhamulO cinni kaanuka..
kaasta ayinA nErcukuni guruvugaari jayantinaaDu paaDukunTArani ASistU..
aMdarikI SubhAkaankShalu teliyajEstU
mI

baalaantrapu venkaTa SESha ramaakumaari
09437418299
balantrapuvariblog.blogspot.com


stotramalika.blogspot.com


siniganalahari.blogspot.com




seeking good suggestions 

Thursday, 18 November 2010

GURUSTUTI___PEDATIRUMALACHARYA





DINAMU DWADASI
పెద తిరుమలయ్య తన తండ్రి యెడల అపారమైన భక్తిప్రపత్తులను కనబరిచినాడు.             అన్నమాచార్యుల పుణ్య తిథి, ఫాల్గుణ బహుళ ద్వాదశినాడు ఆచార్యునికి భక్ష్యభోజ్యాదులనర్పించి శ్రీలక్ష్మీసమేతుడైన శ్రీ వేంకటేశ్వరునుతో, వైష్ణవ భక్తాగ్రేసరులతో విందులారగించగా విచ్చేయమని తిరుమలయ్య అర్ధ్రత తో పాడుకున్న పాటే అతని పితృభక్తికి అక్షర తార్కాణం. 


దినము ద్వాదశి నేడు తీర్థదివసము నీకు
జనకుడ అన్నమాచార్యుడ విచ్చేయవే

అనంతగరుడ ముఖ్యులైన సూరిజనులతో
ఘననారదాది భాగవతులతో
దనుజ మర్దనుండైన దైవశిఖామణితోడ
వెనుకొని యారగించ విచ్చేయవే

వైకుంఠాన నుండి యాళువారలలోపల నుండి
లోకపు నిత్యముక్తులలోన నుండి
శ్రీకాంతతోడ నున్న శ్రీవేంకటేశుగూడి
యీకడ నారగించ నింటికి విచ్చేయవే

సంకీర్తనముతోడ సనకాదులెల్లబాడ 
పొంకపు శ్రీవేంకటాద్రి భూమి నుండి
లంకె శ్రీవేంకటగిరి లక్ష్మీవిభుడు నీవు
నంకెల మాయీంటి విందు లారగించవే


dinamu dwaadaSi nEDu tIrthadivasamu nIku
janaku(Da annamaaachaaryu(Da vichchEyavE

anaMtagaruDa mukhyulaina sUrijanulatO
ghananAradAdi bhAgavatulatO
danuja mardanuMDaina daivaSikhaamaNitODa
venukoni yAragiMcha vichchEyavE

vaikuMThAna nuMDi yALuvAralalOpala nuMDi
lOkapu nityamuktulalOna nuMDi
SrIkAMtatODa nunna SrIvEMkaTESu(gUDi
yIkaDa nAragiMcha niMTiki vichchEyavE

saMkIrtanamutODa sanakaadulella(baaDa 
poMkapu SrIvEMkaTAdri bhUmi nuMDi
laMke SrIvEMkaTagiri lakshmIvibhu(Du nIvu
naMkela maayIMTi viMdu laaragiMchavE

Wednesday, 14 July 2010

GURUSTUTI--COMPOSED BY BKP






మనసా వాచా కర్మణా
ముదమారా హరి సేవించి
అనవరతము అప్పనిపై
అనుపమ పదముల పాడిన జతుల
చిట్టస్వరం:-
రిరిససనిదనిససమగరిససపమగరిస
రిగమాపదపామగరిపమగరిదపమగరి
గమపదనిసరీసనిదపామగరి
సర్వధారినామసంవత్సరమందు వైశాఖమున
విశాఖనక్షత్రమున మాగురువై జన్మమందినావుగదా
సంకీర్తనాచార్య..అన్నమాచార్య..
సానిదపమగరిగమపదని
సంకీర్తనాచార్య..అన్నమాచార్యా
శ్రీహరినందకాంశోద్భవ..
సంకీర్తనాచార్య..అన్నమాచార్య..
సరీసనిదనిపనిదపమగరిసరిగమపదపమగమపదని
సంకీర్తనాచార్య..అన్నమాచార్య..
భవ్యంబౌతాళ్ళపాక వంశంబున జన్మించితివిసంకీర్తనాచార్య..అన్నమాచార్య
మాపదమదపదమపమగరిగమ పదనీదపమగరిసరిగమ
గపామ దాపనీద సనిరిసగరి సనిరిసనిదపమగమపదని
సంకీర్తనాచార్య..అన్నమాచార్య..
లక్కమాంబ నారాయణసూరిదంపతులకు పుణ్యాలపంటవై
మమ్మిలతరింపజేయగ అవతరించిన
సంకీర్తనాచార్య..అన్నమాచార్య..
దా దనిద దనిద పనిదదపమప
పదప పదప మగరిగమపమగరిదపదమపమగరి
నిదనిదపదమపమగరి సనిసనిదనిదపదమపమగరి
స-రి-గ-మ-ప-ద-మ.ప.ద.ని.స
రిగమగారి
సంకీర్తనాచార్య..అన్నమాచార్య..
బాల్యమ్మునందె వైరాగ్యమున తిరుమలకై చనుచుండగ
మార్గమున అలమేలుమంగమ్మ కౄపతోడ ప్రసాదముల ప్రేమ తినిపించగ
దివ్యస్తోత్రంబులెన్నంగా జేసి ధన్యుండైనావు
సా సనీదప మగరిస గమపదని సా సనీదప మగరిస
రిసగరిమదపమదపదనిసరిగమ్మగరిసనిసరిగారి సనిదని సరీసనిద పమపదని
సరిగరి.నిసరిదా దనిసప. పదనిమా మపదగామాపదని సరిగమ పమగరిస పదనిసరిసనిదపా
మగరిగమపదని
సంకీర్తనాచార్య..అన్నమాచార్య..
ఈ జగంబున.తరించగ.శరణాగతియే గతియని
ఈ జగంబున.తరించగ.శరణాగతియే గతియని
తెలియరో యనుచు సంకీర్తనలు సాయించినావు
వ్ర్తముగా శ్రీ రామనుజాచార్య మతమును అందుకొన్నట్టి నీవే
శరణం శరణమయా మాగురువీవెనయా బాలకౄష్ణనుత
సంకీర్తనాచార్య..అన్నమాచార్య..

manasaa vaacaa karmaNA
mudamaaraa hari sEviMci
anavaratamu appanipai
anupama padamula paaDina jatula
chiTTaswaraM:-
ririsasanidanisasamagarisasapamagarisa
rigamaapadapaamagaripamagaridapamagari
gamapadanisarIsanidapaamagari
sarwadhaarinaamasaMvatsaramaMdu vaiSaakhamuna
viSAKanakShatramuna maaguruvai janmamaMdinaavugadaa
saMkIrtanaacaarya..annamaacaarya..
sAnidapamagarigamapadani
saMkIrtanaacaarya..annamaachaaryaa
SrIharinaMdakaaMSOdbhava..
saMkIrtanaachaarya..annamaacaarya..
sarIsanidanipanidapamagarisarigamapadapamagamapadani
saMkIrtanaachaarya..annamaacaarya..
bhavyaMboutaaLLapaaka vaMSaMbuna janmiMcitivisaMkIrtanaachaarya..annamaachaarya
maapadamadapadamapamagarigama padanIdapamagarisarigama
gapaama daapanIda sanirisagari sanirisanidapamagamapadani
saMkIrtanaachaarya..annamaacaarya..
lakkamaaMba naaraayaNasUridaMpatulaku puNyAlapaMTavai
mammilatariMpajEyaga avatariMcina
saMkIrtanaachaarya..annamaacaarya..
daa danida danida panidadapamapa
padapa padapa magarigamapamagaridapadamapamagari
nidanidapadamapamagari sanisanidanidapadamapamagari
sa-ri-ga-ma-pa-da-ma.pa.da.ni.sa
rigamagaari
saMkIrtanaachaarya..annamaacaarya..
baalyammunaMde vairaagyamuna tirumalakai chanuchuMDaga
maargamuna alamElumaMgamma kRupatODa prasaadamula prEma tinipiMcaga
divyastOtraMbulennaMgA jEsi dhanyuMDainaavu
sA sanIdapa magarisa gamapadani saa sanIdapa magarisa
risagarimadapamadapadanisarigammagarisanisarigaari sanidani sarIsanida pamapadani
sarigari.nisaridaa danisapa. padanimaa mapadagaamaapadani sarigama pamagarisa padanisarisanidapaa
magarigamapadani
saMkIrtanaachaarya..annamaacaarya..
I jagaMbuna.tariMcaga.SaraNAgatiyE gatiyani
I jagaMbuna.tariMcaga.SaraNAgatiyE gatiyani
teliyarO yanuchu saMkIrtanalu saayiMchinaavu
vrtamugaa SrI raamanujaachaarya matamunu aMdukonnaTTi nIvE
SaraNaM SaraNamayaa maaguruvIvenayaa baalakRuShNanuta
saMkIrtanaachaarya..annamaacaarya..