BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU
Showing posts with label SINGER--NITYASREE MAHADEVAN. Show all posts
Showing posts with label SINGER--NITYASREE MAHADEVAN. Show all posts

Thursday, 15 November 2012

ANNAMAYYA SAMKIRTANALU--TATWAMULU



NITYASREE

N.C.SATYANARAYANA/saraswati/khandachapu


అదిగాక నిజమతం బదిగాక యాజకం-
బదిగాక హృదయసుఖ మదిగాక పరము

అమలమగు విజ్ఞానమను మహాధ్వరమునకు-
నమరినది సంకల్పమనుమహాపశువు
ప్రమదమనుయూపగంబమునవిశసింపించి
విమలేందు యాహుతులు వేల్పంగవలదా

అరయ నిర్మమకారమాచార్య్డై చెలగ
వరుసతో ధర్మదేవత బ్రహ్మగాగ
దొరకొన్నశదమాదులు దానదైర్యభా-
స్వరగుణాదులు విప్రసమితి గావలదా

తిరువేంకటాచలాధిపు నిజధ్యానంబు
నరులకును సోమపానంబు గావలదా
పరగ నాతనికృపా పరిపూర్ణజలధిలో
నరుహులై యవబృథంబాడంగవలదా
adigAka nijamataM badigAka yAjakam-
badigAka hRdayasukha madigAka paramu

amalamagu vij~nAnamanu mahAdhwaramunaku-
namarinadi samkalpamanumahaapaSuvu
pramadamanuyUpagaMbamunaviSasimpimci
vimalEmdu yAhutulu vElpamgavaladA

araya nirmamakAramAcAryDai celaga
varusatO dharmadEvata brahmagAga
dorakonnaSadamAdulu daanadairyabhaa-
swaraguNAdulu viprasamiti gAvaladA

tiruvEMkaTAcalAdhipu nijadhyAnambu
narulakunu sOmapAnaMbu gAvaladA
paraga nAtanikRpaa paripUrNajaladhilO
naruhulai yavabRthambADamgavaladA 

ANNAMAYYA LYRICS BOOK NO--10
SAMKIRTANA NO--40
RAGAM MENTIONED--SRIRAGAM


TALAM_KHANDA CHAPU, ADITALAM, 


Thursday, 8 November 2012

ANNAMAYYA SAMKIRTANALU--SARANAGATI





NITYASREE MAHADEVAN
ధృవవరదా సంస్తుతవరదా
నవమైనయార్తుని నన్నుగావవే

కరిరాజవరదా కాకాసురవరదా
శరణాగతవిభీషణవరదా
సిరులవేదాలు నిన్ను జెప్పగా వినీని
మరిగి మఱగుజొచ్చే మమ్ముగావవే

అక్రూరవరదా అంబరీషవరదా
సక్రాది దివిజ నిచయవరదా
విక్రమించి యిన్నిటా నీవే ఘనమని నీకు
చక్రధర శరణంటి సరిగానవే

ద్రౌపదీవరదా తగనర్జునవరదా
శ్రీపతీ ప్రహ్లాశిశుదవరదా
యేపున శ్రీవేంకటాద్రి నిటునేను నాగురుడు
చూపగా గొలిచే నచ్చుగ గావవే


dhRvavaradA samstutavaradaa
navamainayArtuni nannugAvavE

karirAjavaradA kAkAsuravaradA
SaraNAgatavibhIShaNavaradA
sirulavEdAlu ninnu jeppagA vinIni
marigi ma~ragujoccE mammugAvavE

akrUravaradA aMbarIShavaradA
sakrAdi divija nicayavaradA
vikramiMci yinniTA nIvE ghanamani nIku
cakradhara SaraNaMTi sarigAnavE

droupadIvaradA taganarjunavaradA
SrIpatI prahlASiSudavaradA
yEpuna SrIvEMkaTAdri niTunEnu nAguruDu
cUpagA golicE naccuga gAvavE

ANNAMAYYA LYRICS BOOK NO--20
SAMKIRTANA NO--73
RAGAM MENTIONED--MALAVI

Thursday, 12 April 2012

ANNAMAYYA SAMKIRTANALU__TATWAMULU



NITYASREE MAHADEVAN
ప|| చూడరెవ్వరు దీనిసోద్యంబు పరికించి | 
      చూడజూడగ గాని సుఖమెరుగ రాదు ||

చ|| ఎడతెగనిమమత వేయగరానిపెను మోపు | 

    కడలేని ఆశ చీకటి దవ్వుకొనుట |
    నిడివైనకనుచూపు నీడనుండిన ఎండ | 

    వడి చెడని తమకంబు వట్టితాపంబు ||

చ|| బుద్ధి మానిన చింత పోని యూరికి దెరువు |

      పొద్దు వోవని వలపు పొట్ట పొంకంబు |
      ఎద్దుబట్టిన శివంబెరుక మాలిన ప్రియము- | 

      లొద్దిక విహారంబు లుబ్బు గవణంబు ||

చ|| తీపు లోపలి తీపు తిరు వేంకటేశ్వరుని |

      చూపు పొడగనని చూపులో చూపు |
      ఆపదలువాయు నెయ్యపు దలపులీ తలపు | 

      రూపైన రుచిలోని రుచి వివేకంబు ||
SATTIRAJU VENUMADHAV
pa|| cUDarevvaru dInisOdyaMbu parikiMci |  
        cUDajUDaga gAni suKameruga rAdu ||

ca|| eDateganimamata vEyagarAnipenu mOpu | 

        kaDalEni ASa cIkaTi davvukonuTa |
        niDivainakanucUpu nIDanuMDina eMDa | 

        vaDi ceDani tamakaMbu vaTTitApaMbu ||

ca|| buddhi mAnina ciMta pOni yUriki deruvu | 

       poddu vOvani valapu poTTa poMkaMbu |
       eddubaTTina SivaMberuka mAlina priyamu- | 

       loddika vihAraMbu lubbu gavaNaMbu ||

ca|| tIpu lOpali tIpu tiru vEMkaTESvaruni | 

       cUpu poDaganani cUpulO cUpu |
       ApadaluvAyu neyyapu dalapulI talapu | 
       rUpaina rucilOni ruci vivEkaMbu ||

ANNAMAYYA LYRICS BOOK NO--10
SAMKIRTANA--96
RAGAM MENTIONED--BOULI



Sunday, 25 March 2012

ANNAMAYYA SAMKIRTANALU--ADHYATMIKAM

 



NITYASREE MAHADEVAN

ఇదియే సులభము ఇందరికి 
కదియగ వశమా కరుణనె గాక


నగధరుండు పన్నగశయనుడు భూ-
గగనాంతరిక్ష గాత్రుండు 
అగణితుడితని నరసి తెలియగా 
తగునా కనెడిది దాస్యమె గాక


కమలజజనకుడు కామునిజనకుడు 
కమలాసతిపతి ఘనగుణుడూ 
విమలుండీహరి వెదకి కావగను 
అమరున శరణాగతి గాక 


దేవుడు త్రిగుణాతీతుడనంతుడు 
కైవల్యమొసగు ఘనుడితడు 
శ్రీవేంకటపతి జీవాంతరాత్ముడు 
భావించ వశమా భక్తినె గాక




idiyE sulabhamu indariki 
kadiyaga vaSamaa karuNane gaaka


nagadharunDu pannagaSayanuDu bhU-
gaganaantariksha gaatrunDu 
agaNituDitani narasi teliyagaa 
tagunaa kaneDidi daasyame gaaka


kamalajajanakuDu kaamunijanakuDu 
kamalaasatipati ghanaguNuDU 
vimalunDIhari vedaki kaavaganu 
amaruna SaraNaagati gaaka 


dEvuDu triguNaateetuDanantuDu 
kaivalyamosagu ghanuDitaDu 
SrIvEnkaTapati jeevaantaraatmuDu 
Bhaavincha vaSamaa bhaktine gaaka

Saturday, 4 February 2012

ANNAMAYYA SAMKIRTANALU--SEVALU


NITYASREE MAHADEVAN

చూడరమ్మ యిదె నేడు సుక్కురారము
వేడుక చక్కదనాలు వేవేలైనాడు


చప్పుడుతో పన్నీటి మజ్జనముతో నున్నవాడు
అప్పుడే ఆదినారాయాణునివలె
కప్పురకాపామీద కడుపూసుకున్నవాడు
ముప్పిరి బులుకడిగె ముత్తెమువలె


పొసగెనప్పటి తట్టుపుణుగులందుకున్నాడు
కసుగందని కాలమేఘమువలెను
సుసగాన మేనునిండా సొమ్మువెట్టుకున్నాడు
పసల పద్దరువన్నె బంగారువలెను


అలమేల్మంగను యురమందు నిడుకొన్నవాడు
యెలమి సంపదలకు యిల్లువలెను
అలరుచు శ్రీవేంకటాద్రిమీదనున్నవాడు
కలబోసి చూడగా దొంతరకొండవలెను


cUDaramma yide nEDu sukkurAramu
vEDuka cakkadanaalu vEvElainADu


cappuDutO pannITi majjanamutO nunnavADu
appuDE AdinaaraayaaNunivale
kappurakaapaamIda kaDupUsukunnavaaDu
muppiri bulukaDige muttemuvale


posagenappaTi taTTupuNugulamdukunnADu
kasugamdani kaalamEghamuvalenu
susagaana mEnuniMDA sommuveTTukunnADu
pasala paddaruvanne bamgaaruvalenu


alamElmamganu yuramamdu niDukonnavADu
yelami sampadalaku yilluvalenu
alarucu SrIvEMkaTAdrimIdanunnavADu
kalabOsi cUDagaa domtarakoMDavalenu








Friday, 21 January 2011

ANNAMAYYA SAMKIRTANALU__KRISHNA






SHOBHARAJ


కొలిచితే రక్షించే గోవిందుడితడు
యిలకు లక్ష్మికి మగడీ గోవిందుడితడు

గోవర్థనమెత్తినట్టి గోవిందుడితడు
వేవేలు గొల్లెతల గోవిందుడితడు
కోవిదుడై ఆలగాచే గోవిందుడితడు
ఆవల కంసు(జంపిన ఆగోవిందుడితడు

కౄరకాళింగ మర్దన గోవిందుడితడు
వీర చక్రాయుధపు గోవిందుడితడు
కోరి సముద్రాలు దాటే గోవిందుడితడు
ఆరీతి బాలుర (దెచ్చే యాగోవిందుడితడు

కుందనపు కాశతోడి గోవిందుడితడు
విందుల రేపల్లె గోవిందుడితడు
పొంది శ్రీవేంకటాద్రిపై పొసగ తిరుపతిలో
అందమై పవ్వళించిన ఆ గోవిందుడితడు

NITYASREE MAHADEVAN


kolichitE rakShiMchE gOviMduDitaDu
yilaku lakshmiki magaDI gOviMduDitaDu

gOvarthanamettinaTTi gOviMduDitaDu
vEvElu golletala gOviMduDitaDu
kOviduDai AlagAchE gOviMduDitaDu
Avala kaMsu(jaMpina AgOviMduDitaDu

kRUrakALiMga mardana gOviMduDitaDu
vIra chakrAyudhapu gOviMduDitaDu
kOri samudrAlu dATE gOviMduDitaDu
ArIti bAlura (dechchE yAgOviMduDitaDu

kuMdanapu kASatODi gOviMduDitaDu
viMdula rEpalle gOviMduDitaDu
poMdi SrIvEMkaTAdripai posaga tirupatilO
aMdamai pavvaLiMchina A gOviMduDitaDu

Thursday, 20 January 2011

ANNAMAYYA SAMKIRTANALU__SANSKRIT



NITYASREE MAHADEVAN


జడమతిరహం కర్మజంతురేకోహం
జడధినిలయాయ నమోసారసాక్షాయ


పరమపురుషాయ నిజభక్తజనసులభాయ
దురితదూరాయ సింధురహితాయ 
నరకాంతకాయ శ్రీనారాయణాయ తే
మురహరాయ నమో నమో 


నగసముద్ధరణాయ నందగోపసుతాయ
జగదంతరాత్మాయ సగుణాయ
మృగనరాంగాయ నిర్మితభవాండాయ ప-
న్నగరాజశయనాయ నమో నమో 


దేవదేవేశాయ దివ్యచరితాయ బహు-
భావనాతీతాయ పరమాయ 
శ్రీవేంకటేశాయ జితదైత్యనికరాయ
భూవల్లభాయ నమో పూర్ణకామాయ

jaDamatirahaM karmajaMturEkOhaM
jaDadhinilayAya namOsArasAkShAya

paramapuruShAya nijaBaktajanasulaBAya
duritadUrAya siMdhurahitAya 
narakAMtakAya SrInArAyaNAya tE
muraharAya namO namO namO

nagasamuddharaNAya naMdagOpasutAya
jagadaMtarAtmAya saguNAya
mRganarAMgAya nirmitaBavAMDAya pa-
nnagarAjaSayanAya namO namO 

dEvadEvESAya divyacaritAya bahu-
BAvanAtItAya paramAya 
SrIvEMkaTESAya jitadaityanikarAya
BUvallaBAya namO pUrNakAmAya

Friday, 3 December 2010

ANNAMAYYA SAMKIRTANALU__HANUMAN


G.NAGESWARA NAIDU

 ఏలవయ్య లోకమెల్ల ఇట్టె రాముదీవనచే
నీలవర్ణహనుమంత నీవు మాకు రక్ష
 

మొదలనింద్రుడు నీమోమునకెల్లా రక్ష
యిదె నీశిరసునకు యినుడు రక్ష
కదిసి నీకన్నులకు గ్రహతారకాలు రక్ష
చెదరని నీమేనికెల్ల శ్రీరామరక్ష

వడినీపాదములకు వాయుదేవుడు రక్ష
తొడలకు వరుణుడు తొడుగు రక్ష
విడువని మతికిని వేదరాసులే రక్ష
చెడని నీయాయువునకు శ్రీరామరక్ష

అంగపు నీతేజమునకు అగ్నిదేవుడు రక్ష
శృంగారమునకెల్లా శ్రీసతి రక్ష
మంగాంబుధి హనుమంత నీకేకాలము
చెంగట శ్రీవేంకటాద్రి శ్రీరామరక్ష
NITYASREE MAHADEVAN

Elavayya lOkamella iTTe raamudIvanacE
nIlavarNahanumaMta nIvu maaku rakSha

modalaniMdruDu nImOmunakellA rakSha
yide nISirasunaku yinuDu rakSha
kadisi nIkannulaku grahataarakaalu rakSha
cedarani nImEnikella SrIrAmarakSha

vaDinIpaadamulaku vaayudEvuDu rakSha
toDalaku varuNuDu toDugu rakSha
viDuvani matikini vEdaraasulE rakSha
ceDani nIyaayuvunaku SrIrAmarakSha

aMgapu nItEjamunaku agnidEvuDu rakSha
SRMgAramunakellaa SrIsati rakSha
maMgAMbudhi hanumaMta nIkEkaalamu
ceMgaTa SrIvEMkaTAdri SrIrAmarakSha



ANNAMAYYA LYRICS BOOK NO--4
SAMKIRTANA NO--459
RAGAM MENTIONED--SAMKARABHARANAM

ANNAMAYYA SAMKIRTANALU__SARANAGATI


NITYASREE



శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీసతి వల్లభా
శరణు రాక్షస గర్వ సంహర శరణు వేంకటనాయకా


కమలధరుడును కమలమిత్రుడు కమలశత్రుడు పుత్రుడు
క్రమముతొ మీకొలువు కిప్పుడు కాచినా రెచ్చరికయా

ఆనిమిషేంద్రులు మునులు దిక్పతులమర కిన్నర సిద్ధులు
ఘనతతో రంభాదికాంతలు కాచినా రెచ్చరికయా

ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను గొలువగ వచ్చిరి
విన్నపము వినవయ్య తిరుపతి వేంకటాచలనాయకా

SaraNu SaraNu suraemdra sannuta Saranu Sreesati vallabhaa
SaraNu raakshasa garva saMhara SaraNu vEMkaTanaayakaa

kamaladharuDunu kamalamitruDu kamalaSatruDu putruDu
kramamuto meekoluvu kippuDu kaachinaa rechcharikayaa

Animishaemdrulu munulu dikpatulamara kinnara siddhulu
GhanatatO rambhaadikaamtalu kaachinaa rechcharikayaa

ennagala prahlaada mukhyulu ninnu goluvaga vachchiri
Vinnapamu vinavayya tirupati vaemkaTaachalanaayakaa

Friday, 22 October 2010

ANNAMAYYA SAMKIRTANALU_HANUMAN


BKP


మంగాంబుధి హనుమంత నీ శరణ
మంగవించి
తిమి హనుమంత 


బాలార్క బింబము ఫలమని పట్టిన
ఆలరిచేతల హనుమంతా 
తూలని బ్రహ్మాదులచే వరముల
ఓలి చేకొనిన ఓ హనుమంత 

జలధిదాట నీ సత్వము కపులకు
అలరి తెలిసితివి హనుమంతా 
ఇలయు నాకసము నేకముగా నటు
బలిమి పెరిగితివి భళి హనుమంత 

పాతాళము లోపలి మైరావణు-
ఆతల చంపిన హనుమంతా 
చేతులు మోడ్చుక శ్రీవేంకటపతి-
నీతల కొలిచే హిత హనుమంత 

NITYASREE MAHADEVAN

maMgAMbudhi hanumaMta nI SaraNa
maMgaviMchimi hanumaMta 

bAlArka biMbamu phalamani paTTina
AlarichEtala hanumaMtA
tUlani brahmAdulachE varamula
Oli chEkonina O hanumaMta 

jaladhidATa nI satvamu kapulaku
alari telisitivi hanumaMtA 
ilayu nAkasamu nEkamugA naTu
balimi perigitivi bhaLi hanumaMta 

pAtALamu lOpali mairAvaNu-
Atala chaMpina hanumaMtA 
chEtulu mODchuka SrIvEMkaTapati-

nItala kolichE hita hanumaMta 


ANNAMAYYA LYRICS BOOK NO--4
SAMKIRTANA NO--444
RAGAM MENTIONED--SAMANTAM