BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU
Showing posts with label PEDATIRUMALACHARYA. Show all posts
Showing posts with label PEDATIRUMALACHARYA. Show all posts

Wednesday, 9 May 2012

GURUSTUTI--ANNAMAYYA



ప|| శరణంటి మాతని సమ్మంధమునజేసి |
మరిగించి మమునేలి మన్నించవే ||
చ|| సకలవేదములు సంకీర్తనలుచేసి |
ప్రకటించి నిను బాడి పావనుడైన |
అకలంకుడు తాళ్ళపాకన్నమాచార్యుల |
వెకలియై యేలిన శ్రీవేంకటనిలయ ||
చ|| నారదాది సనకసనందాదులవలె |
పేరుపడి నిన్ను బాడి పెద్దలైనట్టి |
ఆరీతి దాళ్ళపాకన్నమాచార్యుల |
చేరి యేలినయట్టి శ్రీవేంకటనిలయ ||
చ|| సామవేద సామగాన సప్తస్వరములను |
బాముతో నీసతినిన్ను బాడినయట్టి |
ఆముకొన్న తాళ్ళపాకన్నమాచార్యుల |
వేమరుమెచ్చిన శ్రీవేంకటనిలయా ||


pa|| SaraNaMTi mAtani sammaMdhamunajEsi |marigiMci mamunEli manniMcavE ||

ca|| sakalavEdamulu saMkIrtanalucEsi |prakaTiMci ninu bADi pAvanuDaina |
akalaMkuDu tALLapAkannamAcAryula |vekaliyai yElina SrIvEMkaTanilaya ||
ca|| nAradAdi sanakasanaMdAdulavale | pErupaDi ninnu bADi peddalainaTTi |
ArIti dALLapAkannamAcAryula | cEri yElinayaTTi SrIvEMkaTanilaya ||
ca|| sAmavEda sAmagAna saptasvaramulanu | bAmutO nIsatininnu bADinayaTTi |
Amukonna tALLapAkannamAcAryula | vEmarumeccina SrIvEMkaTanilayA |

Thursday, 18 November 2010

GURUSTUTI___PEDATIRUMALACHARYA





DINAMU DWADASI
పెద తిరుమలయ్య తన తండ్రి యెడల అపారమైన భక్తిప్రపత్తులను కనబరిచినాడు.             అన్నమాచార్యుల పుణ్య తిథి, ఫాల్గుణ బహుళ ద్వాదశినాడు ఆచార్యునికి భక్ష్యభోజ్యాదులనర్పించి శ్రీలక్ష్మీసమేతుడైన శ్రీ వేంకటేశ్వరునుతో, వైష్ణవ భక్తాగ్రేసరులతో విందులారగించగా విచ్చేయమని తిరుమలయ్య అర్ధ్రత తో పాడుకున్న పాటే అతని పితృభక్తికి అక్షర తార్కాణం. 


దినము ద్వాదశి నేడు తీర్థదివసము నీకు
జనకుడ అన్నమాచార్యుడ విచ్చేయవే

అనంతగరుడ ముఖ్యులైన సూరిజనులతో
ఘననారదాది భాగవతులతో
దనుజ మర్దనుండైన దైవశిఖామణితోడ
వెనుకొని యారగించ విచ్చేయవే

వైకుంఠాన నుండి యాళువారలలోపల నుండి
లోకపు నిత్యముక్తులలోన నుండి
శ్రీకాంతతోడ నున్న శ్రీవేంకటేశుగూడి
యీకడ నారగించ నింటికి విచ్చేయవే

సంకీర్తనముతోడ సనకాదులెల్లబాడ 
పొంకపు శ్రీవేంకటాద్రి భూమి నుండి
లంకె శ్రీవేంకటగిరి లక్ష్మీవిభుడు నీవు
నంకెల మాయీంటి విందు లారగించవే


dinamu dwaadaSi nEDu tIrthadivasamu nIku
janaku(Da annamaaachaaryu(Da vichchEyavE

anaMtagaruDa mukhyulaina sUrijanulatO
ghananAradAdi bhAgavatulatO
danuja mardanuMDaina daivaSikhaamaNitODa
venukoni yAragiMcha vichchEyavE

vaikuMThAna nuMDi yALuvAralalOpala nuMDi
lOkapu nityamuktulalOna nuMDi
SrIkAMtatODa nunna SrIvEMkaTESu(gUDi
yIkaDa nAragiMcha niMTiki vichchEyavE

saMkIrtanamutODa sanakaadulella(baaDa 
poMkapu SrIvEMkaTAdri bhUmi nuMDi
laMke SrIvEMkaTagiri lakshmIvibhu(Du nIvu
naMkela maayIMTi viMdu laaragiMchavE