BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU
Showing posts with label SINGER--DWARAM LAKSHMI. Show all posts
Showing posts with label SINGER--DWARAM LAKSHMI. Show all posts

Monday, 2 April 2012

ANNAMAYYA SAMKIRTANALU--RAMA



DWARAM LAKSHMI
రామునికి శరణంటే రక్షించీ బ్రదుకరో
యేమిటికి విచారాలు యికదైత్యులాల

చలమున తాటకి జదిపినబాణము
లలిమారీచసుబాహులపై బాణము
మెలగీ పరశురాము మెట్లేసిన బాణము
తళతళమెరసీని తలరో యసురలు

మాయమృగముమీద మరివేసిన బాణము
చేయిచాచి వాలినేసిన బాణము
తోయధిమీదనటు తొడిగినబాణము
చాయలు దేరుచున్నది చనరోదైత్యేయులు

తగ కుంభకర్ణుని తలద్రుంచిన బాణము
జిగిరావణు పరిమార్చిన బాణము
మిగుల శ్రీవేంకటేశు మేటిపోదలోనున్నది
పగసాధించీనిక బారరో రాకాసులు

rAmuniki SaraNaMTE rakshimcI bradukarO
yEmiTiki vicArAlu yikadaityulAla


calamuna tATaki jadipinabANamu
lalimArIcasubAhulapai bANamu
melagI paraSurAmu meTlEsina bANamu
taLataLamerasIni talarO yasuralu


mAyamRgamumIda marivEsina bANamu
cEyicAci vAlinEsina bANamu
tOyadhimIdanaTu toDiginabANamu
cAyalu dErucunnadi canarOdaityEyulu


taga kumbhakarNuni taladruMcina bANamu
jigirAvaNu parimArcina bANamu
migula SrIvEMkaTESu mETipoadalOnunnadi
pagasAdhimcInika bArarO rAkAsulu
ANNAMAYYA LYRICS BOOK NO--4
SAMKIRTANA NO--283
RAGAM--SAMAMTAM

Sunday, 4 March 2012

ANNAMAYYA SAMKIRTANALU--ADHYATMIKAM


COW FORM OF SHIVA GIVING MILK TO VISHNU


AUDIO


నీవున్నచోటే వైకుంఠము నెరసులు మరి చొరరాదు
పావనమదిచెప్పేది వేదము పాటింపవలెను


దేవుడా నాదేహమె నీకు తిరుమలగిరిపట్టణము
భావింప హృదయకమలమె బంగారపుమేడ
వేవేలు నావిజ్ఞానాదులు వేడుకపరిచారకులు
శ్రీవల్లభా యిందులో నితరచింతలు వెట్టకువే


పరమాత్మా నామనసే బహురత్నంబుల మంచము
గరిమల నాయాత్మే నీకు కడుమెత్తనిపరుపు
తిరముగనుజ్ఞానదీపమున్నది దివ్యభోగమె ఆనందము
మరిగితి నీవున్నయెడలనిక మాయల గప్పకువే


ననిచిన నావూరుపులే నీకు నారదాదుల పాటలు
వినయపునాభక్తియే నీకును వినోదమగుపాత్ర
అనిశము శ్రీవెంకటేశ్వర అలమేల్మంగకు పతివి
ఘనుడవు నన్నేలితివిక కర్మములెంచకువే

nIvunnacOTE vaikumThamu nerasulu mari coraraadu
paavanamadiceppEdi vEdamu paaTimpavalenu


dEvuDA naadEhame nIku tirumalagiripaTTaNamu
bhaavimpa hRdayakamalame bamgaarapumEDa
vEvElu naavij~naanaadulu vEDukaparicaarakulu
SrIvallabhaa yimdulO nitaracimtalu veTTakuvE


paramaatmaa naamanasE bahuratnambula mamcamu
garimala naayaatmE nIku kaDumettaniparupu
tiramuganuj~naanadIpamunnadi divyabhOgame aanamdamu
marigiti nIvunnayeDalanika maayala gappakuvE


nanicina naavUrupulE nIku naaradaadula paaTalu
vinayapunaabhaktiyE nIkunu vinOdamagupaatra
aniSamu SrIvemkaTESwara alamElmamgaku pativi
ghanuDavu nannElitivika karmamulemcakuvE
ANNAMAYYA LYRICS BOOK NO--15
SAMKIRTANA--406
RAGAM MENTIONED--KEDARAGOULA


Monday, 27 February 2012

ANNAMAYYA SAMKIRTANALU--TATWAMULU


అచ్చుత మిమ్ముదలచేయంతపని వలెనా
యిచ్చల మీవారే మాకు నిహపరా లియ్యగా

మిమ్ము నెఱిగినయట్టిమీదాసుల నెఱిగే
సమ్మవిజ్ఞానమే చాలదా నాకు 
వుమ్మడి మీసేవ సేసుకుండేటివైష్ణవుల
 సమ్ముఖాన సేవించుటే చాలదా నాకు

నిరతి నీకు మొక్కేనీడింగరీలకు 
సరవితో మొక్కుటే చాలదా నాకు 
పరగ నిన్ను బూజించే ప్రసన్నుల బూజించే
సరిలేనిభాగ్యము చాలదా నాకు

అంది నీకు భక్తులై నయలమహానుభావుల
చందపువారిపై భక్తి చాలదా నాకు 
కందువ శ్రీ వేంకటేశ కడు నీబంటుబంటుకు 
సందడిబంటనవుటే చాలదా నాకు 
Achchuta mimmudalacheyamtapani valenaa 
Yichchala meevaare maaku nihaparaa liyyagaa

Mimmu neringinayattimeedaasula nerige
Sammavijnaaname chaaladaa naaku 
Vummadi meeseva sesukundetivaishnavula
Sammukhaana sevinchute chaaladaa naaku

Nirati neeku mokkeneedingareelaku 
Saravito mokkute chaaladaa naaku 
Paraga ninnu boojimche prasannula boojimche
Sarilenibhaagyamu chaaladaa naaku


Andi neeku bhaktulai nayalamahaanubhaavula
Chandapuvaaripai bhakti chaaladaa naaku 
Kanduva sree venkatesa kadu neebantubantuku 
Sandadibantanavute chaaladaa naaku

Thursday, 28 April 2011

ANNAMAYYA SAMKIRTANALU__RAMA




రామ రామచంద్ర రాఘవా రాజీవలోచనరాఘవా|
సౌమిత్రిభరత శతృఘ్నులతోడ జయమందు దశరథరాఘవా|| 


శిరసుకూకటులరాఘవా చిన్నారిపొన్నారిరాఘవా|
గరిమ నావయసున తాటకి జంపినకౌసల్యనందనరాఘవా|
అరిదియజ్ఞముగాచురాఘవా అట్టె హరునివిల్లువిరిచినరాఘవా|
సిరులతో జనకునియింట జానకి జెలగి పెండ్లాడినరాఘవా|| 


మలయునయోధ్యారాఘవా మాయామృగాంతకరాఘవా|
చెలగిచుప్పనాతి గర్వ మడచి దైత్యసేనలజంపిన రాఘవా|
సొలసి వాలిజంపి రాఘవా దండిసుగ్రీవునేలినరాఘవా|
జలధిబంధించినరాఘవా లంకసంహరించినరాఘవా||


దేవతలుచూడరాఘవా నీవు దేవేంద్రురథమెక్కిరాఘవా|
రావణాదులను జంపి విభీషణురాజ్యమేలించినరాఘవా|
వేవేగ మరలిరాఘవా వచ్చి విజయపట్టమేలిరాఘవా|
శ్రీవేంకటగిరిమీద నభయము చేరి మాకిచ్చినరాఘవా||

rAma rAmachaMdra rAghavA rAjIvalOcanarAghavA|
saumitribharata SatRghnulatODa jayamaMdu daSaratharAghavA|| 


SirasukUkaTularAghavA chinnAriponnArirAghavA|
garima nAvayasuna tATaki jaMpinakausalyanaMdanarAghavA|
aridiyaj~namugAchurAghavA aTTe harunivilluvirichinarAghavA|
sirulatO janakuniyiMTa jAnaki jelagi peMDlADinarAghavA|| 


malayunayOdhyArAghavA mAyAmRgAMtakarAghavA|
chelagichuppanAti garwa maDachi daityasEnalajaMpina rAghaVA|
solasi vAlijaMpi rAghavA daMDisugrIvunElinarAghavA|
jaladhibaMdhiMchinarAghavA laMkasaMhariMchinarAghavA||


dEvataluchUDarAghavA nIvu dEvEMdrurathamekkirAghavA|
rAvaNAdulanu jaMpi vibhIshaNurAjyamEliMchinarAghavA|
vEvEga maralirAghavA vachchi vijayapaTTamElirAghavA|
SrIvEMkaTagirimIda nabhayamu chEri mAkichchinarAghavA||


Friday, 18 March 2011

ANNAMAYYA SAMKIRTANALU__TATWAMULU

 
    




DWARAM LAKSHMI


నాకునాకే సిగ్గయ్యీని నన్ను జూచుకుంటేను
చేకొని నీవే మన్నించ చెయ్యొగ్గేగాని

సేయరాని పాపములు సేసివచ్చి యేనోర
నాయెడ నిన్ను వరములడిగేను
కాయముతో యింద్రియకింకరుడనై యేమని
చేయూర నీబంటనని చెప్పుకొనేను

వేగిలేచి సంసారవిధులకే వొడిగట్టి
యేగతి కొసరి నీపై నేట వేసేము
ఆగడపు బంగారుకాతుమనేన యమ్ముకొని
భోగపు మోక్షము నెట్టు వొందించు మనేము

కలుపుట్టుగుబతుకు కాంతలకు వెచ్చపెట్టి
వలసి నేడెట్టు నీవార మయ్యేము
నెలవై శ్రీవేంకటేశ నీవే కరుణించితివి
బలిమి సేసి నీకెట్టు భారము వేసేము


nAkunAkE siggayyIni nannu jUchukuMTEnu
chEkoni nIvE manniMcha cheyyoggEgAni

sEyarAni pApamulu sEsivachchi yEnOra
nAyeDa ninnu varamulaDigEnu
kAyamutO yiMdriyakiMkaruDanai yEmani
chEyUra nIbaMTanani cheppukonEnu

vEgilEchi saMsAravidhulakE voDigaTTi
yEgati kosari nIpai nETa vEsEmu
AgaDapu baMgArukAtumanEna yammukoni
bhOgapu mOkshamu neTTu voMdiMchu manEmu

kalupuTTugubatuku kAMtalaku vechchapeTTi
valasi nEDeTTu nIvAra mayyEmu
nelavai SrIvEMkaTESa nIvE karuNiMchitivi
balimi sEsi nIkeTTu bhAramu vEsEmu

Tuesday, 7 December 2010

ANNAMAYYA SAMKIRTANALU__SRIRANGAM


CKP
బ్రహ్మ పూజించె రఘుపతి విభీషణునికిచ్చె
బ్రహ్మణ్యుడీ రంగపతిగొలువరో


కావేరిమధ్యరంగక్షేత్రమల్లదివో
శ్రీవిమానమదిగో శేషపర్యంకమిదే
దేవుడల్లదె వాడె దేవిశ్రీలక్ష్మీ యదె
సేవించరో నాభిచిగురించెనతడూ


ఏడుగోడలునవిగో యెసగు పూదోపులవె
కూడిదామోదరపుర గోపురమిదే
తోడవేయికంబాల దొడ్డమంటపమదివో
చూడరో పసిడిమించుల కంబమదివో


ఆళువారులువారె అంగరంగవిభవమదె
వాలు శ్రీవైష్ణవపు వాడలవిగో
ఆలీల శ్రీవేంకటేశుడై వరమిచ్చీని
తాలిముల శ్రీరంగదైవము గొలువరో


DWARAM LAKSHMI

brahma pUjiMce raghupati viBIShaNunikicce
brahmaNyuDI raMgapatigoluvarO


kaavErimadhyaraMgakShEtramalladivO
SrIvimaanamadigO SEShaparyaMkamidE
dEvuDallade vaaDe dEviSrIlakShmI yade
sEviMcarO naabhiciguriMcenataDU


EDugODalunavigO yesagu pUdOpulave
kUDidaamOdarapura gOpuramidE
tODavEyikaMbAla doDDamaMTapamadivO
cUDarO pasiDimiMcula kaMbamadivO


ALuvAruluvAre aMgaraMgavibhavamade
vaalu SrIvaiShNavapu vADalavigO
aalIla SrIvEMkaTESuDai varamiccIni
taalimula SrIraMgadaivamu goluvarO

https://www.youtube.com/watch?v=8zSWED6NfVQ&list=RD9fjGPiZLcxM&index=7

Wednesday, 24 November 2010

ANNAMAYYA SAMKIRTANALU__TATWAMULU




DWARAM LAKSHMI


వెదకి వెదకి చొప్పులెత్తుచును విచారించితిని యిన్నాళ్ళు
ఇదివో కంటిని శ్రీవేంకటగిరి యెదుటనె నీ శ్రీపాదములు


ఘనతులసీ కాననంబులో కాపురము సేతువు అనగాను
అనిశము పద్మవనంబునను ఆడుచునుండుదు వనగాను
నిను నీ దాసులుపాడేచోట్ల నెలవై యాలింతు వనగాను 
ఇనమండలమున నుండుదువనగా ఈమాట విని నేను


పైకొని క్షీరాంబుధిలో నెప్పుడు పవ్వళించివుందువు అనగాను
వైకుంఠంబున వెలుగొందుచు సర్వము భావించేవనగాను
దాకొని జీవులలో ఎప్పుడు అంతర్యామివై వుందువు యనగాను
లోకము నీవై వుండుదువు అనగా లోలత నీమాట విని నేను


పరమయోగీంద్రులు తలపోయుచునున్న భావముతోనుందువు యనగాను
పరిపరివిధముల పుణ్యకర్మము పాయక చరింతువు యనగాను
గరిమలనెప్పుడు అలమేల్మంగ కౌగిటిలోవాడవు యనగాను
ఇరవుగ శ్రీవేంకటేశుడవనగా యీమాటవిని నేను

vedaki vedaki coppulettucunu vicaariMcitini yinnaaLLu
idivO kaMTini SrIvEMkaTagiri yeduTane nI SrIpaadamulu

ghanatulasI kaananaMbulO kaapuramu sEtuvu anagaanu
aniSamu padmavanaMbunanu aaDucunuMDudu vanagaanu
ninu nI daasulupaaDEcOTla nelavai yaaliMtu vanagaanu 
inamaMDalamuna nuMDuduvanagaa ImATa vini nEnu

paikoni kShIrAMbudhilO neppuDu pavvaLiMcivuMduvu anagaanu
vaikuMThaMbuna velugoMducu sarwamu BAviMcEvanagaanu
daakoni jIvulalO eppuDu aMtaryaamivai vuMduvu yanagaanu
lOkamu nIvai vuMDuduvu anagaa lOlata nImaaTa vini nEnu

paramayOgIMdrulu talapOyucununna bhaavamutOnuMduvu yanagaanu
pariparividhamula puNyakarmamu paayaka cariMtuvu yanagaanu
garimalaneppuDu alamElmaMga kougiTilOvaaDavu yanagaanu
iravuga SrIvEMkaTESuDavanagaa yImaaTavini nEnu



Friday, 19 November 2010

ANNAMAYYA SAMKIRTANALU__LAKSHMINARASIMHA



AADIMOORTY

ఆదిమూర్తి యీతడు ప్రహ్లాదవరదుడు
ఏదెస జూచినా తానె ఈతడిదె దేవుడు


నవ్వుల మోముతోడ నరసింహరూపుతోడ
జవ్వని తొడమీద సరసమాడ
పువ్వుల దండలు ఇరుభుజాలపై
వేసుకొని ఉవ్విళ్ళూర కొలువై వున్నాడు దేవుడు


సంకు చక్రములతోడ జమళికోరల
తోడ అంకెల కటి అభయహస్తాలెత్తి
కంకణాల హారాలతో ఘనకిరీటము వెట్టి
పొంకమైన ప్రతాపాన పొదలీని దేవుడు


నానా దేవతలతోడ నారదాదుల తోడ
గానములు వినుకొంటా గద్దెపై నుండి
ఆనుక శ్రీవేంకటాద్రి నహోబలమునందు
తానకమై వరాలిచ్చి దాసులకు దేవుడు



AdimUrti yItaDu prahlAdavaraduDu 
Edesa jUcinA tAne ItaDide dEvuDu
navvula mOmutODa narasiMharUputODa 
javvani toDamIda sarasamADa 
puvvula daMDalu irubhujAlapai 
vEsukoni uvviLLUra koluvai vunnADu dEvuDu 

saMku cakramulatODa jamaLikOrala 
tODa aMkela kaTi aBayahastAletti 
kaMkaNAla hArAlatO GanakirITamu veTTi 
poMkamaina pratApAna podalIni dEvuDu 

nAnA dEvatalatODa nAradAdula tODa 
gAnamulu vinukoMTA gaddepai nuMDi 
Anuka SrIvEMkaTAdri nahObalamunaMdu
tAnakamai varAlicci dAsulaku dEvuDu


ANNAMAYYA SAMIRTANAS__SARANAGATI




DWARAM LAKSHMI


వేరొక్కరూలేరు విశ్వమంతా నీమహిమే
ఏరీతినీవేకలవు ఇతరములేదు


తల్లివై రక్షింతువు తండ్రివై పోషింతువు 
ఇల్లాలివై మోహము ఇత్తువు నాకు
ఒళ్ళై పెరుగుదువు ఒగిపురాకౄతమౌదు
ఇల్లుముంగిలై వుందువు ఇంతా నీమహిమే


గురుడవైబోధింతువు కొడుకువై ఈడేర్తువు
అరుదై నిధానమవు అవుదువునీవే
దొరవై నన్నేలుదువు దూతవై పనిసేతువు
ఇరవైన అసిరులిత్తువు ఇంతానీమహిమే


దేవుడవై పూజగొందువు దిక్కుప్రాణమౌదువు
కావలసినాట్టౌదు కామించినట్లు
శ్రీవేంకటేశ నీవే చిత్తములోపలినుండి
ఈవలవైకుంఠమిత్తువు ఇంతానీమహిమే



vErokkarUlEru viSwamaMtaa nImahimE
ErItinIvEkalavu itaramulEdu


tallivai rakShiMtuvu taMDrivai pOShiMtuvu 
illaalivai mOhamu ittuvu naaku
oLLai peruguduvu ogipuraakRutamoudu
illumuMgilai vuMduvu iMtaa nImahimE


guruDavaibOdhiMtuvu koDukuvai IDErtuvu
arudai nidhaanamavu avuduvunIvE
doravai nannEluduvu dUtavai panisEtuvu
iravaina asirulittuvu iMtAnImahimE


dEvuDavai pUjagoMduvu dikkupraaNamouduvu
kaavalasinaaTToudu kaamiMcinaTlu
SrIvEMkaTESa nIvE cittamulOpalinuMDi
IvalavaikuMThamittuvu iMtAnImahimE

Wednesday, 17 November 2010

ANNAMAYYA SAMKIRTANALU__SARANAGATI


DWARAM LAKSHMI

దేవదేవోత్తమ నాకుదిక్కు నీవే యెపుడును
యేవివరము తెలియ నేమిసేతునయ్యా

పాపముడిగినగాని ఫలియించదు పుణ్యము
కోపముమానినగాని కూడదు శాంతి
చాపల మడచక నిశ్చలబుద్ధి గలుగదు
యేపున నా వసము గాదేమి సేతునయ్యా

ఆసవిడిచిన గాని యంకెకురాదు విరతి
రోసినగాని సుజ్ఞానరుచి పుట్టదు
వేసాలు దొలగించక వివేకా లెల్లా మెచ్చరు
యీసుద్దు లేమియు నేరనేమి సేతు నయ్యా

కల్లలాడకున్నగాని కడతేరదు సత్యము
వొల్ల నన్నగాని సుఖ మొనగూడదు
యిల్లిదె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టే
యెల్లకాల మీమేలున కేమిసేతు నయ్యా


dEvadEVOttama nAkudikku nIvE yepuDunu
yEvivaramu teliya nEmisEtunayyA

pApamuDiginagAni phaliyiMchadu puNyamu
kOpamumAninagAni kUDadu SAMti
chApala maDachaka niSchalabuddhi galugadu
yEpuna nA vasamu gA dEmi sEtunayyA

AsaviDichina gAni yaMkekurAdu virati
rOsinagAni suj~nAnaruchi puTTadu
vEsAlu dolagiMchaka vivEkA lellA mechcharu
yIsuddu lEmiyu nEra nEmi sEtu nayyA

kallalADakunnagAni kaDatEradu satyamu
volla nannagAni sukha monagUDadu
yillide SrIvEMkaTESa yElitivi nannu niTTE
yellakAla mImEluna kEmi sEtu nayyA

Tuesday, 9 November 2010

ANNAMAYYA SAMIRTANAS__TATWAMULU



నమ్మితిజుమ్మీ వో మనసా నాకే హితవయి మెలంగుమీ
ముమ్మాటికి నే( జెప్పితి(జుమ్మీ మురహరునామమే జపించుమీ

తలచకుమీ యితరధర్మములు తత్వజ్ఞానము మరువకుమీ
కలగకుమీ యేపనికైనను కడుశాంతంబుననుండుమీ
వలవకుమీ వనితలకెప్పుడు వైరాగ్యంబున నుండుమీ
కొలువకుమీ యితరదేవతల గోవిందునే భజించుమీ

కోరకుమీ దేహభోగములు గొనకొని తపమే చేకొనుమీ
మీరకుమీ గురువులయానతి మెఱయ పురాణములే వినుమీ
చేరకుమీ దుర్జనసంగతి జితేంద్రియుడవై నిలువుమీ
దూరకుమీ కర్మఫలంబును ధ్రువవరదునినే నుతించుమీ

వెఱవకుమీ పుట్టుగులకు మరి వివేకించి ధీరుడవగుమీ
మఱవకుమీ యలమేల్మంగకుమగడగు శ్రీవేంకటపతిని
కెఱలకుమీ మాయారతులను కేవలసాత్వికుడవుగమ్మీ
తొఱలకుమీ నేరములను సింధు రక్షకునినే సేవించుమీ



nammitijummI vO manasA nAkE hitavayi melaMgumI
mummATiki nE( jeppiti(jummI muraharunAmamE japiMchumI 


talachakumI yitaradharmamulu tatwaj~nAnamu maruvakumI
kalagakumI yEpanikainanu kaDuSAMtaMbunanuMDumI
valavakumI vanitalakeppuDu vairAgyaMbuna nuMDumI
koluvakumI yitaradEvatala gOviMdunE bhajiMchumI


kOrakumI dEhabhOgamulu gonakoni tapamE chEkonumI
mIrakumI guruvulayAnati me~raya purANamulE vinumI
chErakumI durjanasaMgati jitEMdriyuDavai niluvumI
dUrakumI karmaphalaMbunu dhruvavaraduninE nutiMchumI


ve~ravakumI puTTugulaku mari vivEkiMchi dhIruDavagumI
ma~ravakumI yalamElmaMgakumagaDagu SrIvEMkaTapatini
ke~ralakumI mAyAratulanu kEvalasAtwikuDavugammI
to~ralakumI nEramulanu siMdhu rakshakuninE sEviMchumI