BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU
Showing posts with label RAGAM--SAHANA. Show all posts
Showing posts with label RAGAM--SAHANA. Show all posts

Friday, 3 December 2010

ANNAMAYYA SAMKIRTANALU__HANUMAN


G.NAGESWARA NAIDU

 ఏలవయ్య లోకమెల్ల ఇట్టె రాముదీవనచే
నీలవర్ణహనుమంత నీవు మాకు రక్ష
 

మొదలనింద్రుడు నీమోమునకెల్లా రక్ష
యిదె నీశిరసునకు యినుడు రక్ష
కదిసి నీకన్నులకు గ్రహతారకాలు రక్ష
చెదరని నీమేనికెల్ల శ్రీరామరక్ష

వడినీపాదములకు వాయుదేవుడు రక్ష
తొడలకు వరుణుడు తొడుగు రక్ష
విడువని మతికిని వేదరాసులే రక్ష
చెడని నీయాయువునకు శ్రీరామరక్ష

అంగపు నీతేజమునకు అగ్నిదేవుడు రక్ష
శృంగారమునకెల్లా శ్రీసతి రక్ష
మంగాంబుధి హనుమంత నీకేకాలము
చెంగట శ్రీవేంకటాద్రి శ్రీరామరక్ష
NITYASREE MAHADEVAN

Elavayya lOkamella iTTe raamudIvanacE
nIlavarNahanumaMta nIvu maaku rakSha

modalaniMdruDu nImOmunakellA rakSha
yide nISirasunaku yinuDu rakSha
kadisi nIkannulaku grahataarakaalu rakSha
cedarani nImEnikella SrIrAmarakSha

vaDinIpaadamulaku vaayudEvuDu rakSha
toDalaku varuNuDu toDugu rakSha
viDuvani matikini vEdaraasulE rakSha
ceDani nIyaayuvunaku SrIrAmarakSha

aMgapu nItEjamunaku agnidEvuDu rakSha
SRMgAramunakellaa SrIsati rakSha
maMgAMbudhi hanumaMta nIkEkaalamu
ceMgaTa SrIvEMkaTAdri SrIrAmarakSha



ANNAMAYYA LYRICS BOOK NO--4
SAMKIRTANA NO--459
RAGAM MENTIONED--SAMKARABHARANAM

Tuesday, 23 November 2010

ANNAMAYYA SAMKIRTANALU___RAMA


NEDUNURI

రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలములీయ గలిగెనిందరికి

గౌతము భార్యపాలిటి కామధేనువితడు
ఘాతల కౌశికుపాలి కల్పవ్రుక్షము
సీతాదేవి పాలిటి చింతామని యితడు
యీతడు దాసుల పాలిటి యిహపర దైవము

పరగసుగ్రీవుపాలి పరమ బంధువితడు
సరిహనుమంతుపాలి సామ్రాజ్యము
నిరతి విభీషణునిపాలి నిధానము యీతడు
గరిమజనకు పాలి ఘనపారిజాతము

తలప శబరిపాలి తత్వపు రహస్యము
అలరిగుహునిపాలి ఆదిమూలము
కలడన్నవారిపాలి కన్నులెదుటి మూరితి
వెలయ శ్రీవేంకటాద్రి విభుడితడు
GROUP SONG

raamachamdruDitaDu raghuveeruDu
kaamita phalamuleeya galigenimdariki

gautamu bhaaryapaaliTi kaamadhaenuvitaDu
Ghaatala kauSikupaali kalpavrukShamu
seetaadaevi paaliTi chimtaamani yitaDu
yeetaDu daasula paaliTi yihapara daivamu
paragasugreevupaali parama bamdhuvitaDu
sarihanumamtupaali saamraajyamu
nirati vibheeshaNunipaali nidhaanamu yeetaDu
garimajanaku paali ghanapaarijaatamu

talapa Sabaripaali tatvapu rahasyamu
alariguhunipaali aadimoolamu
kalaDannavaaripaali kannuleduTi mooriti
Velaya SreevaemkaTaadri vibhuDitaDu

Tuesday, 20 April 2010

ANNAMAYYA SAMIRTANAS__NAMASAMKIRTANA





నన్ను నిన్ను నెంచుకోవో నారాయణా
అన్నియు నీ చేతినే అదివో నారాయణా

నా మన సెరుగవా నారాయణా నేడు
నాములాయె వయసులు నారాయణా
నామధారికపు మొక్కు నారాయణా
ఆముకొని నీ ప్రియము లందునే నారాయణా

నగుతా నే నంటినింతే నారాయణా యిదె
నగ రెఱిగిన పని నారాయణా
నగవులు మాకు చాలు నారాయణా
అగడు సేయకు మికను అప్పటి నారాయణా

ననలు నీ వినయాలు నారాయణా , మంచి
ననుపంటి మిదివో నారాయణా
ఘనుడ శ్రీవేంకటాద్రిఁ గలసితి విట్లైనను
అనుమాన మెల్లా బాసెను అందు నారాయణా

nannu ninnu neMchukOvO nArAyaNA
anniyu nI chEtinE adivO nArAyaNA

nA mana serugavA nArAyaNA nEDu
nAmulAye vayasulu nArAyaNA
nAmadhArikapu mokku nArAyaNA
Amukoni nI priyamu laMdunE nArAyaNA

nagutA nE naMTiniMtE nArAyaNA yide
naga re~rigina pani nArAyaNA
nagavulu mAku chAlu nArAyaNA
agaDu sEyaku mikanu appaTi nArAyaNA

nanalu nI vinayAlu nArAyaNA , maMchi
nanupaMTi midivO nArAyaNA
ghanuDa SrIvEMkaTAdri@M galasiti viTlainanu
anumAna mellA bAsenu aMdu nArAyaNA