BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU
Showing posts with label GROUP SONGS. Show all posts
Showing posts with label GROUP SONGS. Show all posts

Tuesday, 10 July 2012

ANNAMAYYA SAMKIRTANALU--KALYANAM


GROUP SONG

ఈడగు పెండ్లి ఇద్దరి జేసేము
చేడెలాల ఇటు చెప్పరుగా


పచ్చికబయళ్ళ పడతియాడగ
ముచ్చటకృష్ణుడు మోహించి
వెచ్చపు పూదండ వేసివచ్చెనట
గచ్చులనాతని కానరుగా


ముత్తెపు ముంగిట ముదితనడువగా
ఉత్తముడేచెలి యురమునను
చిత్తరువు వ్రాసి చెలగి వచ్చెనొళ
జొత్తుమాని యిటుచూపరుగా


కొత్తచవికలో కొమ్మనిలిచితే
పొత్తున తలబాలు వోసెనట
యిత్తల శ్రీవేంకటేశుడు నవ్వుచూ
హత్తిసతిగూడె పాడరుగా

IDagu peMDli iddari jEsEmu
cEDelAla iTu cepparugA


paccikabayaLLa paDatiyADaga
muccaTakRShNuDu mOhiMci
veccapu pUdaMDa vEsivaccenaTa
gacculanAtani kAnarugA


muttepu muMgiTa muditanaDuvagA
uttamuDEceli yuramunanu
cittaruvu vrAsi celagi vaccenoLa
jottumAni yiTucUparugA


kottacavikalO kommanilicitE
pottuna talabAlu vOsenaTa
yittala SrIvEMkaTESuDu navvucU
hattisatigUDe pADarugA



Wednesday, 1 February 2012

ANNAMAYYA SAMKIRTANALU--TATWAMULU


GROUP
భారమైన వేపమాను పాలువోసి పెంచినాను
తీరని చేదేకాక దియ్యనుండీనా 

పాయదీసి కుక్కతోక బద్దలు వెట్టి బిగిసి

చాయ కెంతగట్టినాను చక్కనుండీనా 
కాయపు వికారమిది కలకాలము జెప్పినా

పోయిన పోకలే కాక బుద్ధి వినీనా 

ముంచిముంచి నీటిలోన మూల నానబెట్టుకొన్నా

మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యి నా 
పంచమహాపాతకాల బారి బడ్డచిత్తమిది

దంచి దంచి చెప్పినాను తాకి వంగీనా 


 కూరిమితో దేలుదెచ్చి కోకలోన బెట్టుకొన్నా
సారె సారె గుట్టుగాక చక్కనుండీనా 
వేరులేని మహిమల వేంకటవిభుని కృప

ఘోరమైన ఆస మేలుకోర సోకీనా 


P.S.RANGANATH
BAramaina vEpamAnu pAluvOsi peMcinAnu 
tIrani cEdEkAka diyyanuMDInA ||

pAyadIsi kukkatOka baddalu veTTi bigisi 

cAya keMtagaTTinAnu cakkanuMDInA 
kAyapu vikAramidi kalakAlamu jeppinA

pOyina pOkalE kAka buddhi vinInA 

muMcimuMci nITilOna mUla nAnabeTTukonnA 

miMcina goDDali nEDu mettanayyi nA 
paMcamahApAtakAla bAri baDDacittamidi 

daMci daMci ceppinAnu tAki vaMgInA 

kUrimitO dEludecci kOkalOna beTTukonnA 

sAre sAre guTTugAka cakkanuMDInA |
vErulEni mahimala vEMkaTaviBuni kRupa 

GOramaina Asa mElukOra sOkInA 

Wednesday, 1 December 2010

ANNAMAYYA SAMKIRTANALU__LALI PATALU






VEDAVATI PRABHAKAR

లాలి శ్రీ కృష్ణయ్య నీలమేఘవర్ణా
బాలగోపాల నీవు పవ్వళింపరా


శృంగారించిన మంచి బంగారుఊయలలో
శంఖుచక్రధరస్వామి నిదురపోరా


లలితాంగిరుక్మిణిలలనయె కవలెనా
పలుకుకోయిల సత్యభామె కావలెనా


ఎవ్వరుకావలెనయ్య ఇందరిలో నీకు
నవమోహనంగ నా చిన్నికృష్ణయ్య


అలుకలు పోవేల అలమేలుమంగతో
కులుకుతు శయనించు వేంకటెశ్వరుడా
laali Sree kRshNayya neelamEghavarNaa
baalagOpaala neevu pavvaLiMparaa

SRMgaariMchina maMchi baMgaaruooyalalO
SaMkhuchakradharaswaami nidurapOraa

lalitaaMgirukmiNilalanaye kavalenaa
palukukOyila satyabhaame kaavalenaa

evvarukaavalenayya iMdarilO neeku
navamOhanaMga naa chinnikRshNayya

alukalu pOvaela alamElumaMgatO
kulukutu SayaniMchu vEMkaTeSvaruDaa


Tuesday, 16 November 2010

ANNAMAYYA SAMKIRTANALU__SRUNGARAM




SRGRM


ఇద్దరి తమకము నిటువలెనె
పొద్దున నేమని బొంకుదమయ్యా

లలి నాకథరము లంచమియ్యగా
పలు సోకులయి పరగెనవే
పిలువగరాగా బెరసి నిందవడె
పొలతికి నేమని బొంకుదమయ్యా

అడుగుకొనుచు నిన్నంటి పెనగగా
తడయక నఖములు తాకెనవే
తొడుకొనిరాగా దూఱు మీదబడె
పొడవుగ నేమని బొంకుదమయ్యా

పెక్కులు చెవిలో ప్రియముగ చెప్పగ
ముక్కున జవ్వాది మోచె నిదే
యిక్కడ శ్రీవేంకటేశుడ సడివడె
పుక్కటి నేమని బొంకుదమయ్యా



FEMALE GROUP

iddari tamakamu niTuvalene
podduna nEmani boMkudamayyA

lali nAkatharamu laMchamiyyagA
palu sOkulayi paragenavE
piluvagarAgA berasi niMdavaDe
polatiki nEmani boMkudamayyA

aDugukonuchu ninnaMTi penagagA
taDayaka nakhamulu tAkenavE
toDukonirAgA dU~ru mIdabaDe
poDavuga nEmani boMkudamayyA

pekkulu chevilO priyamuga cheppaga
mukkuna javvAdi mOche nidE
yikkaDa SrIvEMkaTESuDa saDivaDe
pukkaTi nEmani boMkudamayyA