BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Friday, 11 January 2013

ANNAMAYYA SAMKIRTANALU--SRUNGARAM



EMTA MOHAMO GANI


ఎంత మోహమో కాని ఇతడు నీమీదను
సంతతము బాయకిటు సరుస నున్నాడు

పలుకవే పతితోడ పగడవాతెర దెరచి
చిలుకవే సెలవులను చిరునవ్వులు
మొలకసిగ్గులివేల మోనంబు లింకనేల
కలయికకు వచ్చి ఇదె కాచుకొన్నాడు

కనుగొనవె వొకమాటు కలువకన్నుల నితని
పెనగవే కరములను ప్రియము చల్లి
పొనిగేటి తమకమేల పొసగి గుట్టికనేల
నినుగదియువేడుకను నిలుచున్నవాడూ

కొసరవే యీవేళ కూరిములు సారెకును
విసరవే సణగు లిటు వేమారును
వెస రతుల మరిగి శ్రీవేంకటేశుడు గూడి
సుసరమున నీతోడ జొక్కుచున్నాడు


eMta mOhamO kAni itaDu nImIdanu
saMtatamu bAyakiTu sarusa nunnADu

palukavE patitODa pagaDavAtera derachi
chilukavE selavulanu chirunavvulu
molakasiggulivEla mOnaMbu liMkanEla
kalayikaku vachchi ide kAchukonnADu

kanugonave vokamATu kaluvakannula nitani
penagavE karamulanu priyamu challi
ponigETi tamakamEla posagi guTTikanEla
ninugadiyuvEDukanu niluchunnavADU

kosaravE yIvELa kUrimulu sArekunu
visaravE saNagu liTu vEmArunu
vesa ratula marigi SrIvEMkaTESuDu gUDi
susaramuna nItODa jokkuchunnADu

ANNAMAYYA LYRICS BOOK NO--28
SAMKIRTANA NO--65
RAGAM MENTIONED--AHIRI
UNABLE TO UPLOAD IN ESNIPS 
PLZ DOWNLOAD THE SAMKIRTANA FRM SRAVAN'S FOLDER AND LISTEN..






No comments:

Post a Comment