BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Monday 7 January, 2013

ANNAMAYYA SAMKIRTANALU--TATWAMULU

Photo: పరమాత్ముడు నిత్యుడు, సత్యుడు, శాశ్వతుడు. అందునా వెంకటాద్రి మీది విభుడు... ప్రత్యక్షమైన పరబ్రహ్మ స్వరూపము అంటున్నారు అన్నమయ్య. ఆ మూర్తి..... లోకాలు ఏలే మూర్తి, బ్రహ్మాదులు వెదకే మూర్తి, మోక్షమిచ్చే మూర్తి, లోకహితుడైన మూర్తి, ముగ్గురయ్యల మూల మూర్తి, సర్వాత్ముడైన మూర్తి. ఆ దేవుడు..... ఎన్నో రూపాల్లో జన్నించి, ఎన్నెన్నో రూపాల్లో కొలువై, ఆయన కళ్ళు సూర్యచంద్రులు, జీవలన్నీ ఆయనరూపులే, ఆయనే చైతన్యానికి ప్రతిరూపం. ఆ వేల్పు.... ఒక పాదం ఆకాశాన్ని తాకగా, మరో పాదం భూమిపై నిలిచి ఉంది. ఆయన శ్వాస మహామారుతం, ఆయన దాసులే పుణ్యులు, ఆయనే సర్వేశుడు, పరమేశుడు, సకల చరాచర సృష్టికి హితం గూర్చే వాడు. ఆయనే తిరువేంటాద్రి విభుడంటూ... విశ్వమంతా శ్రీహరే అని వర్ణించారు అన్నమయ్య.

ఈ మధ్యే శ్రీరామదాసు సినిమాలోనూ ఈ కీర్తనను పోలిని పాటే ఉంచడం విశేషం. అల్లా... అంటూ ప్రారంభమై ఏ వేల్పు ఎల్ల వేల్పులును గొలిచెడి వెల్పు....... ఏ మూర్తి ఘనమూర్తి, ఏ మూర్తి గుణకీర్తి అంటూ సాగుతుంది. అది ఈ కీర్తన నుంచి పుట్టనదే.

యేవేల్పుపాదయుగ మిలయునాకాశంబు
యేవేల్పుపాదకేశాంతం బనంతంబు
యేవేల్పునిశ్వాస మీమహామారుతము
యేవేల్పునిజదాసు లీపుణ్యులు
యేవేల్పు సర్వేశు డేవేల్పు పరమేశు-
డేవేల్పు భువనైకహితమనోభావకుడు
యేవేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కడుఘనము
ఆవేల్పు తిరువేంకటాద్రివిభుడు

నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు
సత్యాత్ముడై యుండి సత్యమై తానుండు
ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సం
స్తుత్యుడీ తిరువేంకటాద్రివిభుడు

ఏమూర్తి లోకంబులెల్ల నేలెడునాత
డేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాత
డేమూర్తి నిజమోక్షమియ్య జాలెడునాత
డేమూర్తి లోకైకహితుడు
యేమూర్తి నిజమూర్తి యేమూర్తియును గాడు
యేమూర్తి త్రైమూర్తు లేకమైనయాత
డేమూర్తి సర్వాత్ము డేమూర్తి పరమాత్ము-
డామూర్తి తిరువేంకటాద్రివిభుడు

యేదేవుదేహమున నిన్నియును జన్మించె
నేదేవుదేహమున నిన్నియును నణగె మరి
యేదేవువిగ్రహం బీసకల మింతయును
యేదేవునేత్రంబు లినచంద్రులు
యేదేవు డీజీవులిన్నింటిలో నుండు
నేదేవుచైతన్య మిన్నిటికి నాధార
మేదేవు డవ్యక్తు డేదేవు డద్వంద్వదు-
డాదేవుడీ వేంకటాద్రివిభుడు

యేవేల్పుపాదయుగ మిలయునాకాశంబు
యేవేల్పుపాదకేశాంతం బనంతంబు
యేవేల్పునిశ్వాస మీమహామారుతము
యేవేల్పునిజదాసు లీపుణ్యులు
యేవేల్పు సర్వేశు డేవేల్పు పరమేశు-
డేవేల్పు భువనైకహితమనోభావకుడు
యేవేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కడుఘనము
ఆవేల్పు తిరువేంకటాద్రివిభుడు
V ANANDA BHATTAR
నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు
సత్యాత్ముడై యుండి సత్యమై తానుండు
ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సం-
స్తుత్యుడీ తిరువేంకటాద్రివిభుడు

 ఏమూర్తి లోకంబులెల్ల నేలెడునాత-
డేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాత-
డేమూర్తి నిజమోక్షమియ్య జాలెడునాత-
డేమూర్తి లోకైకహితుడు
యేమూర్తి నిజమూర్తి యేమూర్తియును గాడు
యేమూర్తి త్రైమూర్తు లేకమైనయాత-
డేమూర్తి సర్వాత్ము డేమూర్తి పరమాత్ము-
డామూర్తి తిరువేంకటాద్రివిభుడు


యేదేవుదేహమున నిన్నియును జన్మించె
నేదేవుదేహమున నిన్నియును నణగె మరి
యేదేవువిగ్రహం బీసకల మింతయును
యేదేవునేత్రంబు లినచంద్రులు
యేదేవు డీజీవులిన్నింటిలో నుండు
నేదేవుచైతన్య మిన్నిటికి నాధార-
మేదేవు డవ్యక్తు డేదేవు డద్వంద్వదు-
డాదేవుడీ వేంకటాద్రివిభుడు

యేవేల్పుపాదయుగ మిలయునాకాశంబు
యేవేల్పుపాదకేశాంతం బనంతంబు
యేవేల్పునిశ్వాస మీమహామారుతము
యేవేల్పునిజదాసు లీపుణ్యులు
యేవేల్పు సర్వేశు డేవేల్పు పరమేశు-
డేవేల్పు భువనైకహితమనోభావకుడు
యేవేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కడుఘనము
ఆవేల్పు తిరువేంకటాద్రివిభుడు


 nityaatmuDai yuMDi nityuDai velugoMdu
satyaatmuDai yuMDi satyamai taanuMDu
pratyakshamai yuMDi brahmamai yuMDu saM-
stutyuDee tiruveMkaTaadrivibhuDu

cha : emoorti lOkaMbulella neleDunaata-
Demoorti brahmaadulella vedakeDunaata-
Demoorti nijamOkshamiyya jaaleDunaata-
Demoorti lOkaikahituDu
yemoorti nijamoorti yemoortiyunu gaaDu
yemoorti traimoortu lekamainayaata-
Demoorti sarvaatmu Demoorti paramaatmu-
Daamoorti tiruveMkaTaadrivibhuDu

 yedevudehamuna ninniyunu janmiMche
nedevudehamuna ninniyunu naNage mari
yedevuvigrahaM beesakala miMtayunu
yedevunetraMbu linachaMdrulu
yedevu DeejeevulinniMTilO nuMDu
nedevuchaitanya minniTiki naadhaara-
medevu Davyaktu Dedaevu DadvaMdvadu-
DaadevuDee veMkaTaadrivibhuDu

 yevelpupaadayuga milayunaakaaSaMbu
yevelpupaadakeSaaMtaM banaMtaMbu
yevelpuniSvaasa meemahaamaarutamu
yevelpunijadaasu leepuNyulu
yevelpu sarveSu Develpu parameSu-
Develpu bhuvanaikahitamanObhaavakuDu
yevelpu kaDusookshma mevelpu kaDughanamu
aavelpu tiruveMkaTaadrivibhuDu
ANNAMAYYA LYRICS BOOK NO--10
SAMKIRTANA NO-75
RAGAM MENTIONED--SRIRAGAM



No comments:

Post a Comment