వద్దు వద్దు కోపము వదిలినింతే నీకు
సుద్దులేల చెప్పేవు సొలసితి నిన్నును
మారుకొన్నదానకను మాటాడినదాన గాను
యేరా నాతోనేలనెగ్గు వట్టేవు
యీరీతినింతే కోరికలని పరాకురాగా
కూరిమినిట్టే వేడుకొనెను నిన్నును
గుంపించినదానగాను గొణగిన దానగాను
పెంపొనగేరా నన్ను దిక్కొనేవు
చంపల చెమట జార చేత తుడిచితినింతే
అంపలేను ఆయమంటి ఆదరించే నిన్నును
బాసియున్నదానగాను పదరిన దనగను
వేసరక నన్ను యేల వెడ్డువెట్టేవు
ఆశలశ్రీవెంకటేశ అట్టే నన్ను కూడీటీవి
మోసలేదు నీకు నాకు
suddulEla ceppEvu solasiti ninnunu
maarukonnadaanakanu maaTADinadAna gAnu
yErA nAtOnElaneggu vaTTEvu
yIrItiniMtE kOrikalani parAkurAgA
kUriminiTTE vEDukonenu ninnunu
guMpiMcinadAnagAnu goNagina dAnagAnu
peMponagErA nannu dikkonEvu
caMpala cemaTa jaara cEta tuDicitiniMtE
aMpalEnu AyamaMTi AdariMcE ninnunu
bAsiyunnadAnagAnu padarina danaganu
vEsaraka nannu yEla veDDuveTTEvu
ASalaSrIvenkaTESa aTTE nannu kUDITIvi
mOsalEdu nIku naaku mokkamiCCEninnunu