BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU
Showing posts with label SINGER--SATTIRAJU VENUMADHAV. Show all posts
Showing posts with label SINGER--SATTIRAJU VENUMADHAV. Show all posts

Thursday, 12 April 2012

ANNAMAYYA SAMKIRTANALU__TATWAMULU



NITYASREE MAHADEVAN
ప|| చూడరెవ్వరు దీనిసోద్యంబు పరికించి | 
      చూడజూడగ గాని సుఖమెరుగ రాదు ||

చ|| ఎడతెగనిమమత వేయగరానిపెను మోపు | 

    కడలేని ఆశ చీకటి దవ్వుకొనుట |
    నిడివైనకనుచూపు నీడనుండిన ఎండ | 

    వడి చెడని తమకంబు వట్టితాపంబు ||

చ|| బుద్ధి మానిన చింత పోని యూరికి దెరువు |

      పొద్దు వోవని వలపు పొట్ట పొంకంబు |
      ఎద్దుబట్టిన శివంబెరుక మాలిన ప్రియము- | 

      లొద్దిక విహారంబు లుబ్బు గవణంబు ||

చ|| తీపు లోపలి తీపు తిరు వేంకటేశ్వరుని |

      చూపు పొడగనని చూపులో చూపు |
      ఆపదలువాయు నెయ్యపు దలపులీ తలపు | 

      రూపైన రుచిలోని రుచి వివేకంబు ||
SATTIRAJU VENUMADHAV
pa|| cUDarevvaru dInisOdyaMbu parikiMci |  
        cUDajUDaga gAni suKameruga rAdu ||

ca|| eDateganimamata vEyagarAnipenu mOpu | 

        kaDalEni ASa cIkaTi davvukonuTa |
        niDivainakanucUpu nIDanuMDina eMDa | 

        vaDi ceDani tamakaMbu vaTTitApaMbu ||

ca|| buddhi mAnina ciMta pOni yUriki deruvu | 

       poddu vOvani valapu poTTa poMkaMbu |
       eddubaTTina SivaMberuka mAlina priyamu- | 

       loddika vihAraMbu lubbu gavaNaMbu ||

ca|| tIpu lOpali tIpu tiru vEMkaTESvaruni | 

       cUpu poDaganani cUpulO cUpu |
       ApadaluvAyu neyyapu dalapulI talapu | 
       rUpaina rucilOni ruci vivEkaMbu ||

ANNAMAYYA LYRICS BOOK NO--10
SAMKIRTANA--96
RAGAM MENTIONED--BOULI



Saturday, 9 July 2011

ANNAMAYYA SAMKIRTANALU__RAMA



Reetigowla

(to get a copy of album 'annamayya padamandakini' with 108 kirtanas in 108 raga composed by Sri Venumadhav, please contact sujana ranjani : seetaramasarma@gmail.com)
 ఇతడే పరబ్రహ్మ మిదియె రామకథ 
శతకోటి విస్తరము సర్వపుణ్య ఫలము 

ధరలో రాముడు పుట్టె ధరణిజ బెండ్లాడె 

అరణ్య వాసులకెల్ల నభయమిచ్చె
సొరిది ముక్కుజెవులు చుప్పనాతికిని గోసె

ఖరదూషణులను ఖండించి వేసె

కినిసి వాలి జంపి కిష్కింద సుగ్రీవుకిచ్చె 

వనధి బంధించి దాటె వానరులతో
కవలి రావణ కుంభకర్ణాదులను జంపి 

వనిత జేకొని మళ్ళివచ్చె నయోధ్యకును

సౌమిత్రియు భరతుడు శత్రుఘ్నుడు గొలువగ 

భూమి యేలె కుశలవ పుత్రుల గాంచె
శ్రీమంతుడై నిలిచె శ్రీవేంకటాద్రి మీద 

కామించి విభీషణు లంకకు బట్టముగట్టె 


MOHANA


itaDE parabrahma midiye rAmakatha 
SatakOTi vistaramu sarvapuNya Palamu

dharalO rAmuDu puTTe dharaNija beMDlADe 

araNya vAsulakella naBayamicce
soridi mukkujevulu cuppanAtikini gOse 

KaradUShaNulanu KaMDiMci vEse

kinisi vAli jaMpi kiShkiMda sugrIvukicce 

vanadhi baMdhiMci dATe vAnarulatO
kavali rAvaNa kuMBakarNAdulanu jaMpi 

vanita jEkoni maLLivacce nayOdhyakunu

saumitriyu BaratuDu SatruGnuDu goluvaga 

BUmi yEle kuSalava putrula gAMce
SrImaMtuDai nilice SrIvEMkaTAdri mIda 

kAmiMci viBIShaNu laMkaku baTTamugaTTe 

Sunday, 15 May 2011

GURUSTUTI--ANNAMAYYA JAYANTHI



Suralaku-Narulaku---Nadabridavani


సురలకు నరులకు సొరిది వినవిన
అరుదు తాళ్ళపాక అన్నమయ్య పదములు
చరణం:-1
చక్కెరై చవిచూపి జాలై తావిచల్లీ
నక్కజపు మాతువజ్రాలై మెరసీని
నిక్కుటద్దములై మా నిలువు నీడలు చూపీ-
నక్కర తాళ్ళపాక అన్నమయ్య పదములు


రీ;;,రిపమపమరిసనిరి/సా;;,నిసరిసనిసరిపమ
పా,మపదాప మపదదపమ రిమ/రీ,రిమపామ రిమపమరిస రిమ
పా,రిమామ రిమామ రిపాప మ/నీని పసాస నిరీరి పమరిసని
సా,రిససనిదపా,పమరిసని/సా,సరిమపమ రిమపనిప మపని సని
చరణం:-2
పన్నీరై పైబూసీ కప్రంబై చలువరేచీ
మిన్నగల ముత్యములై మెయినిండీనీ
వెన్నుబలములై మా వెంటవెంట తిరిగీని
అన్నిట తాళ్ళపాక అన్నమయ్యపదములు
చరణం:-3
నెట్టన వేదాంతములై నిత్యములై పొడచూపీ
పుట్టుతోనె గురువులై బోధించీని
గట్టి వరాలిచ్చే శ్రీవేంకటనాధుని మెప్పించి-
నట్టె తాళ్ళపాక అన్నమయ్య పదములు
రీ;;,రిపమపమరిసనిరి/సా;;,నిసరిసనిసరిపమ
పా,మపదాప మపదదపమ రిమ/రీ,రిమపామ రిమపమరిస రిమ
పా,రిమామ రిమామ రిపాప మ/నీని పసాస నిరీరి పమరిసని
సా,రిససనిదపా,పమరిసని/సా,సరిమపమ రిమపనిప మపని సని

suralaku narulaku soridi vinavina
arudu taaLLapaaka annamayya padamulu
charaNaM:-1
cakkerai chavichUpi jaalai taavicallI
nakkajapu maatuvajraalai merasIni
nikkuTaddamulai maa niluvu nIDalu chUpI-
nakkara taaLLapaaka annamayya padamulu

rI;;,ripamapamarisaniri/saa;;,nisarisanisaripama
paa,mapadaapa mapadadapama rima/rI,rimapaama rimapamarisa rima
paa,rimaama rimaama ripaapa ma/nIni pasaasa nirIri pamarisani
saa,risasanidapaa,pamarisani/saa,sarimapama rimapanipa mapani sani
charaNaM:-2
pannIrai paibUsI kapraMbai chaluvarEcI
minnagala mutyamulai meyiniMDInI
vennubalamulai maa veMTaveMTa tirigIni
anniTa taaLLapaaka annamayyapadamulu
charaNaM:-3
neTTana vEdAMtamulai nityamulai poDacUpI
puTTutOne guruvulai bOdhiMcIni
gaTTi varaaliccE SrIvEMkaTanaadhuni meppiMci-
naTTe taaLLapaaka annamayya padamulu
rI;;,ripamapamarisaniri/saa;;,nisarisanisaripama
paa,mapadaapa mapadadapama rima/rI,rimapaama rimapamarisa rima
paa,rimaama rimaama ripaapa ma/nIni pasaasa nirIri pamarisani
saa,risasanidapaa,pamarisani/saa,sarimapama rimapanipa mapani sani



శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారి జన్మదినసందర్భములో చిన్ని కానుక..
కాస్త అయినా నేర్చుకుని గురువుగారి జయంతినాడు పాడుకుంటారని ఆశిస్తూ..
అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ
మీ

బాలాంత్రపు వెంకట శేష రమాకుమారి
09437418299

SrI tALLapAka annamAcAryulavaari janmadinasamdarbhamulO cinni kaanuka..
kaasta ayinA nErcukuni guruvugaari jayantinaaDu paaDukunTArani ASistU..
aMdarikI SubhAkaankShalu teliyajEstU
mI

baalaantrapu venkaTa SESha ramaakumaari
09437418299
balantrapuvariblog.blogspot.com


stotramalika.blogspot.com


siniganalahari.blogspot.com




seeking good suggestions 

Friday, 23 April 2010

ANNAMAYYA SAMKIRTANAMULU__TATWAMULU





ఎన్ని బాధలబెట్టి యేచెదవు నీవింక యెంతకాలముదాక కర్మమా
మన్నించుమనుచు నీమరుగు జొచ్చితిమి మామాటాలకించవో కర్మమా

ప్రతిలేని దురితముల పాలుసేయకనన్ను పాలించవైతివో కర్మమా
తతితోడ నాత్మపరితాపంబు తోడుతను తగులేల చేసితివో కర్మమా
జితకాములకుగాని చేతికిని లోనయి చిక్కవేకాలంబు కర్మమా
మతిహీనులైనట్టి మాకునొక పరిపాటి మార్గంబు చూపవో కర్మమా

తిరువేంకటాచలాధిపుని మాయలచేత దెసల దిరిగినయట్టి కర్మమా
హరిదాసులగువారి నాదరింతువుగాక అంత నొప్పింతువా కర్మమా
వరుస నేనుగుమీదివానిసున్నంబడుగ వచ్చునా నీకిట్ల కర్మమా
పరమపురుషోత్తముని భ్రమతబడి నీవిట్ల బట్టబయలైతిగా కర్మమా

enni baadhalabeTTi yaechedavu neeviMka yeMtakaalamudaaka karmamaa
manniMchumanuchu neemarugu jochchitimi maamaaTaalakiMchavO karmamaa

pratilaeni duritamula paalusaeyakanannu paaliMchavaitivO karmamaa
tatitODa naatmaparitaapaMbu tODutanu tagulaela chaesitivO karmamaa
jitakaamulakugaani chaetikini lOnayi chikkavaekaalaMbu karmamaa
matiheenulainaTTi maakunoka paripaaTi maargaMbu choopavO karmamaa

tiruvaeMkaTaachalaadhipuni maayalachaeta desala diriginayaTTi karmamaa
haridaasulaguvaari naadariMtuvugaaka aMta noppiMtuvaa karmamaa
varusa naenugumeedivaanisunnaMbaDuga vachchunaa neekiTla karmamaa
paramapurushOttamuni bhramatabaDi neeviTla baTTabayalaitigaa karmamaa