BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU
Showing posts with label SINGER--B.M.VASANTA. Show all posts
Showing posts with label SINGER--B.M.VASANTA. Show all posts

Friday, 11 May 2012

ANNAMAYYA SAMKIRTANALU--TATWAMULU




N.C.SATYANARAYANA& B.M.VASANTA

శరణంటే నీవు దిక్కు సర్వేశ్వరా
నిరతి మాయవావికిని నిజమేది


యిన్నిటా బుట్టినదేహికి యింకా సులశీలమేది
చన్నుబాలకానికి యాచారమేది
పన్నిన సంసారికి పరమాత్ముచింతయేది
వున్నతి జంతరపుబొమ్మకు ఉద్యోగమేది


పంచేద్రియబుధ్ధికి పట్టి స్వతంత్ర్యమేది
చంచలచిత్తునికి విజ్ఞానమేది
యెంచబూతావాసునికింక జేసేధర్మమేది
నించి మలమూత్రకాయునికి భోగమేది


కామాతురునకును కర్మానుష్ఠానమేది
వాముల నిత్యలోభికి వైరాగ్యమేది
శ్రీమంతుడైనయట్టి శ్రీవేంకటేశ్వర నీవే
కామించి కాచితి గాక గతియేది

SaraNaMTE nIvu dikku sarwESwarA
nirati mAyavAvikini nijamEdi


yinniTA buTTinadEhiki yiMkA sulaSIlamEdi
cannubAlakAniki yAcAramEdi
pannina saMsAriki paramAtmuciMtayEdi
vunnati jaMtarapubommaku udyOgamEdi


pamcEdriyabudhdhiki paTTi swatamtryamEdi
camcalacittuniki vijnAnamEdi
yeMcabUtAvAsunikimka jEsEdharmamEdi
niMci malamUtrakAyuniki bhOgamEdi


kAmAturunakunu karmAnuShThAnamEdi
vAmula nityalObhiki vairAgyamEdi
SrImamtuDainayaTTi SrIvEMkaTESwara nIvE
kAmiMci kAciti gAka gatiyEdi




ANNAMAYYA LYRICS BOOK NO--15
SAMKIRTANANA--205
RAGAM MENTIONED--BHUPALAM

Friday, 17 February 2012

ANNAMAYYA SAMKIRTANALU--SARANAGATI



N.C.SATYANARAYANA& B.M VASAMTA
ఆదినారాయణా నాకు అభయమీయవె
కాదని తప్పులెంచక కరుణా నిధీ


తుదకెక్క నింద్రియపు దొంగలకు దాపిచ్చితి
ఎదుటికి రాగా నీవేమి యందువో
మదించి నాలోనుండగ మరచితి నేనిన్ను
యిదె కానుకియ్యగా నీవేమందువో


పక్కన నీయాజ్ఞ దోసి పాపములెల్లా జేసితి
యిక్కడ నే మొక్కగా నీవేమందువో
దిక్కు నీవుండగా పరదేవతలా గొలిచితి
నెక్కొని రక్షించుమంటే నీవిక నేమందువో


తొట్టి కామక్రోధాలతో దూరులెల్లా గట్టుకొంటి
యిట్టె ముద్ర మోచెనంటే నేమందువో
నెట్టన శ్రీవేంకటేశ నీకు అలమేల్మంగకు
గట్టిగా నేలెంకనైతి కరుణించేమందువో



AdinArAyaNA nAku abhayamIyave
kaadani tappulemcaka karuNA nidhI


tudakekka nimdriyapu domgalaku daapicciti
eduTiki rAgA nIvEmi yamduvO
madimci naalOnuMDaga maraciti nEninnu
yide kaanukiyyagaa nIvEmamduvO


pakkana nIyAjna dOsi paapamulellaa jEsiti
yikkaDa nE mokkagaa nIvEmamduvO
dikku nIvumDagaa paradEvatalaa goliciti
nekkoni rakShimcumamTE nIvika nEmamduvO


toTTi kaamakrOdhaalatO dUrulellaa gaTTukoMTi
yiTTe mudra mOcenamTE nEmamduvO
neTTana SrIvEmkaTESa nIku alamElmamgaku
gaTTigA nElemkanaiti karuNimcEmamduvO


book--15 
samkIrtana--447
salmganaaTa rAgam





Saturday, 21 May 2011

ANNAMAYYA SAMKIRTANALU__SRUNGARAM



AUDIO
మరుని నగరిదండ మాయిల్లెరగవా
విరుల తావులు వెల్ల విరిసేటి చోటు


మఱగు మూక చింతల మాయిల్లెరగవా
గురుతైన బంగారు కొడల సంది
మఱపుఁ దెలివి యిక్క మాయిల్లెరగవా
వెరవక మదనుడు వేటాడేచోటు


మదనుని వేదసంత మాయిల్లెరగవా
చెదరియు జెదరని చిమ్మఁ జీకటి
మదిలోన నీవుండేటి మాయిల్లెరగవా
కొదలేని మమతలు కొలువుండేచోటు


మరులుతుమ్మెదల తోట మాయిల్లెరగవా
తిరువేంకటగిరి దేవుడ నీవు
మరుముద్రల వాకిలి మాయిల్లెరగవా
నిరతము నీసిరులు నించేటి చోటు


maruni nagaridaMDa mAyilleragavA
virula tAvulu vella virisETi chOTu


ma~ragu mUka chiMtala mAyilleragavA
gurutaina baMgAru koDala saMdi
ma~rapu@M delivi yikka mAyilleragavA
veravaka madanuDu vETADEchOTu


madanuni vEdasaMta mAyilleragavA
chedariyu jedarani chimma@M jIkaTi
madilOna nIvuMDETi mAyilleragavA
kodalEni mamatalu koluvuMDEchOTu


marulutummedala tOTa mAyilleragavA
tiruvEMkaTagiri dEVuDa nIvu
marumudrala vAkili mAyilleragavA
niratamu nIsirulu niMchETi chOTu