BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU
Showing posts with label APRIL/12. Show all posts
Showing posts with label APRIL/12. Show all posts

Tuesday, 17 April 2012

ANNAMAYYA SAMKIRTANALU__ADHYATMIKAM


ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు 
అప్పడగు తిరువేంకటాద్రీశు గంటి

అతిశయంబైన శేషాద్రిశిఖరము గంటి 
ప్రతిలేని గోపుర ప్రభలు గంటి 
శతకోటి సూర్య తేజములు వెలుగగ గంటి 
చతురాస్యు బొడగంటి చయ్యన మేల్కొంటి

కనకరత్న కవాట కాంతు లిరుగడగంటి 
ఘనమైన దీపసంఘములు గంటి 
అనుపమ మణీమయమ్మగు కిరీటము గంటి 
కనకాంబరము గంటి గ్రక్కన మేల్కొంటి

అరుదైన శంఖ చక్రాదు లిరుగడ గంటి
సరిలేని యభయ హస్తము గంటి 
తిరువేంకటాచలాధిపుని జూడగ గంటి 
హరి గంటి గురు గంటి నంతట మేల్కంటి
Ippuditu kalagamti nellalokamulaku 
Appadagu tiruvaemkataadreesu gamti

Atisayambaina saeshaadrisikharamu gamti 
Pratilaeni gopura prabhalu gamti 
Satakoti soorya taejamulu velugaga gamti 
Chaturaasyu bodagamti chayyana maelkomti

Kanakaratna kavaata kaamtu lirugadagamti 
Ghanamaina deepasamghamulu gamti 
Anupama maneemayammagu kireetamu gamti 
Kanakaambaramu gamti grakkana maelkomti

Arudaina samkha chakraadu lirugada gamti 
Sarilaeni yabhaya hastamu gamti 
Tiruvaemkataachalaadhipuni joodaga gamti 
Hari gamti guru gamti namtata maelkamti
ANNAMAYYA LYRICS BOOK NO--10
SAMKIRTANA NO--38
RAGAM MENTIONED--BHUPALAM


Saturday, 14 April 2012

ANNAMAYYA SAMKIRTANALU__RAMA


P.SUSEELA




రామా దయాపరసీమా అయోధ్యాపుర-|
ధామా మావంటివారి తప్పులు లోగొనవే||


అపరాధియైనట్టియాతని తమ్మునినే|
కృపజూపితివి నీవు కింకలుమాని|
తపియించి యమ్ముమొనదారకుజిక్కినవాని|
నెపానగాచి విడిచి నీవాదరించితివి||


సేయరాని ద్రోహము చేసినపక్షికి నీవు|
పాయక అప్పటినభయమిచ్చితి|
చాయసేసుకొనివుండి స్వామిద్రోహి జెప్పనట్టి-|
తోయపుటేటెని మంచితోవనే పెట్టితివి||


నేరములెంచవు నీవు నీదయేచూపుదుగాని|
బీరపుశరణాగతి బిరుదనీవు|
చేరి నేడు నిలుచుండి శ్రీవేంకటాద్రిమీద|
గోరినవరములెల్లా కొల్లలొసగితివి|| 

rAmA dayAparasImaa ayOdhyApura-|
dhAmA mAvaMTivAri tappulu lOgonavE||


aparAdhiyainaTTiyAtani tammuninE|
kRpajUpitivi nIvu kiMkalumAni|
tapiyiMci yammumonadArakujikkinavAni|
nepAnagAci viDici nIvAdariMcitivi||


sEyarAni drOhamu cEsinapakShiki nIvu|
pAyaka appaTinabhayamicciti|
cAyasEsukonivuMDi swAmidrOhi jeppanaTTi-|
tOyapuTETeni maMcitOvanE peTTitivi||


nEramuleMcavu nIvu nIdayEcUpudugAni|
bIrapuSaraNAgati birudanIvu|
cEri nEDu nilucuMDi SrIvEMkaTAdrimIda|
gOrinavaramulellA kollalosagitivi|| 



ANNAMAYYA LYRICS BOOK NO--30
SAMKIRTANA NO--94
RAGAM MENTIONED--BOULI





Friday, 6 April 2012

ANNAMAYYA SAMKIRTANALU__KRISHNA



D.V.MOHANAKRISHNA
బ్రహ్మగన్నవాడు పసిబిడ్డ
బ్రహ్మమైనవాడు పసిబిడ్డ


వగపులేక చంపవచ్చిన పూతకి 
పగసాధించినవాడు పసిబిడ్డ
పగటున దనమీద పారవచ్చినబండి
పగులదన్నినవాడు పసిబిడ్డా

గుట్టున నావులకొరకు వేలనె కొండ-
పట్టి యెత్తినవాడు పసిబిడ్డా
జెట్టిపోరున దన్ను జెనకవచ్చినవాని
పట్టి చంపినవాడు పసిబిడ్డా


మిడికెటి కోపపు మేనమామ బట్టి
పడనడిచినవాడు పసిబిడ్డా
కడువేగ శ్రీవేంకటనాధుడై గొల్ల-
పడతుల గూడినాడు పసిబిడ్డా

brahmagannavADu pasibiDDa
brahmamainavaaDu pasibiDDa


vagapulEka campavaccina pUtaki 
pagasAdhimcinavADu pasibiDDa
pagaTuna danamIda pAravaccinabaMDi
paguladanninavADu pasibiDDA


guTTunanAvulakoraku vElane koMDa
paTTi yettinavADu pasibiDDA
jeTTipOruna dannu jenakavaccinavAni
paTTi campinavADu pasibiDDA


miDikeTi kOpapu mEnamAma baTTi
paDanaDicinavADu pasibiDDA
kaDuvEga SrIvEMkaTanAdhuMDai golla-
paDatula gUDinADu pasibiDDA
ANNAMAYYALYRICS BOOK NO--10
SAMKIRTANA NO--111
RAGAM MENTIONED--BOULI


Sunday, 1 April 2012

ANNAMAYYA SAMKIRTANALU--RAMA


BKP & BULLEMMA


రాముడు లోకాభిరాముడు త్రైలోక్య
ధాముడు రణరంగ భీముడు వాడే

వరుడు సీతకు, ఫలాధరుడు మహోగ్రపు-
శరుడు రాక్షస సంహరుడు వాడే
స్థిరుడు సర్వగుణాకరుడు కోదండ దీక్షా-
గురుడు సేవకశుభకరుడు వాడే

ధీరుడు లోకైకవీరుడు సకలా-
ధారుడు భవబంధదూరుడు వాడే
శూరుడు ధర్మవిచారుడు రఘువంశ-
సారుడు బ్రహ్మసాకారుడు వాడే

బలుడు యిన్నిటా రవికులుడు భావించ, ని-
ర్మలుడు నిశ్చలుడవికలుడు వాడే
వెలసి శ్రీ వేంకటాద్రి నిజనగరములోన
తలకొనె పుణ్యపాదతలుడు వాడే

Raamudu lokaabhiraamudu trailokya
Dhaamudu ranaramga bheemudu vaadae

Varudu seetaku, phalaadharudu mahograpu
Sarudu raakshasa samharudu vaadae
Sthirudu sarvagunaakarudu kodamda deekshaa
Gurudu saevakasubhakarudu vaadae

Dheerudu lokaikaveerudu sakalaa
Dhaarudu bhavabamdhadoorudu vaadae
Soorudu dharmavichaarudu raghuvamsa
Saarudu brahmasaakaarudu vaadae

Baludu yinnitaa ravikuludu bhaavimcha, ni
Rmaludu nischaludavikaludu vaadae
Velasi Sree vaemkataadri nijanagaramulona
Talakone punyapaadataludu vaadae