BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU
Showing posts with label ALUKA. Show all posts
Showing posts with label ALUKA. Show all posts

Thursday, 11 November 2010

ANNAMAYYA SAMKIRTANALU__ALAMELUMANGA


BKP

అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ
తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ 


నీరిలోన తల్లడించే నీకే తలవంచీ
నీరికింద పులకించీ నీరమణుండు 
గోరికొన చెమరించీ కోపమే పచరించీ
సారెకు నీయలుక ఇట్టె చాలించవమ్మ 


నీకుగానే చెయ్యిచాచీ నిండాకోపమురేచీ
మేకొని నీవిరహాన మేను వెంచీని 
ఈకడాకడి సతుల హౄదయమే పెరరేచీ
ఆకు మడిచియ్యనైన ఆనతియ్యవమ్మా 


చక్కదనములె పెంచీ సకలము గాలదంచి
నిక్కపు వేంకటేశుడు నీకే పొంచీని 
మక్కువతో అలమేల్మంగ నాంచారమ్మ
అక్కున నాతని నిట్టే అలరించవమ్మ 



ammamma Emamma alamElmaMga nAMcAramma
tammiyiMTa nalarukomma Oyamma 


nIrilOna tallaDiMcE nIkE talavaMcI
nIrikiMda pulakiMcI nIramaNuMDu 
gOrikona cemariMcI kOpamE pacariMcI
sAreku nIyaluka iTTe cAliMcavamma 


nIkugAnE ceyyicAcI niMDAkOpamurEcI
mEkoni nIvirahAna mEnu veMcIni 
IkaDAkaDi satula hRudayamE perarEcI
Aku maDiciyyanaina AnatiyyavammA 


cakkadanamule peMcI sakalamu gAladaMci
nikkapu vEMkaTESuDu nIkE poMcIni 
makkuvatO alamElmaMga nAMcAramma
akkuna nAtani niTTE alariMcavamma 

Wednesday, 10 November 2010

ANNAMAYYA SAMKIRTANALU__ALAMELUMANGA



G.NAGESWARA NAIDU
అలుగకువమ్మా నీవాతనితోనెన్నడునూ
పలువేడుకలతోనే పాయకుండరమ్మా


జలధి తపముసేసి సాధించె పాతాళము 
నెలత నీరమణుడు నీకుగానె
యిలవెల్లా హారించె యెనసె కొండగుహల
యెలమినిన్నిటాను నీకితవుగానె


బాలబొమ్మచారైయుండె పగలెల్లా సాధించె
నీలీలలు తలచి నీకుగానే
తాలిమి వ్రతము పట్టి ధర్మముతోగూడుండె
పాలించినీవుచెప్పిన పనికి గానె


యెగ్గుసిగ్గు చూడడాయె యెక్కెను శిలాతలము
నిగ్గులనన్నిటాను మించె నీకుగానె
అగ్గలపు శ్రీవేంకటాద్రిశుడై నిలిచె
వొగ్గి నిన్నురాన మోచియుండుటకుగానె




alugakuvammaa nIvaatanitOnennaDunU
paluvEDukalatOnE paayakuMDarammaa


jaladhi tapamusEsi saadhiMce paataaLamu 
nelata nIramaNuDu nIkugaane
yilavellaa haariMce yenase koMDaguhala
yelamininniTAnu nIkitavugaane


baalabommacaaraiyuMDe pagalellaa saadhiMce
nIlIlalu talaci nIkugaanE
taalimi vratamu paTTi dharmamutOgUDuMDe
paaliMcinIvuceppina paniki gaane


yeggusiggu cUDaDAye yekkenu Silaatalamu
niggulananniTAnu miMce nIkugAne
aggalapu SrIvEMkaTAdriSuDai nilice
voggi ninnuraana mOciyuMDuTakugAne

Sunday, 31 October 2010

ANNAMAYYA SAMKIRTANALU___ALUKA




BKP


అలుకలు చెల్లవు హరి పురుషోత్తమ
నలి నిందిర నీతో నవ్వినది 


ఆదిలక్ష్మి మోహన కమలంబున
వేద మాత నిను వేసినది
ఆదెస నీపై నభయహస్తమును
సాదరముగ గడు సాచినది 


సిరి దన కన్నుల చింతామణులను
పొరి నీపై దిగ బోసినది
వరద హస్తమున వలచెయి పట్టుక
అరుదుగ నిను మాటాడించినది 


జలధి కన్య తన సర్వాంగంబుల
బిలిచి నిన్ను నిటు పెనగినది
అలముక శ్రీ వేంకటాధిప నిను రతి-
నెలమి నీ వురంబెక్కినది 


alukalu cellavu hari puruShOttama
nali niMdira nItO navvinadi 


AdilakShmi mOhana kamalaMbuna
vEda mAta ninu vEsinadi
Adesa nIpai naBayahastamunu
sAdaramuga gaDu sAcinadi 


siri dana kannula ciMtAmaNulanu
pori nIpai diga bOsinadi
varada hastamuna valaceyi paTTuka
aruduga ninu mATADiMcinadi 


jaladhi kanya tana sarvAMgaMbula
bilici ninnu niTu penaginadi
alamuka SrI vEMkaTAdhipa ninu rati-
nelami nI vuraMbekkinadi 

Thursday, 28 October 2010

ANNAMAYYA SAMKIRTANALU__ALUKA



వద్దు వద్దు కోపము వదిలినింతే నీకు
సుద్దులేల చెప్పేవు సొలసితి నిన్నును

మారుకొన్నదానకను మాటాడినదాన గాను
యేరా నాతోనేలనెగ్గు వట్టేవు
యీరీతినింతే కోరికలని పరాకురాగా
కూరిమినిట్టే వేడుకొనెను నిన్నును

గుంపించినదానగాను గొణగిన దానగాను
పెంపొనగేరా నన్ను దిక్కొనేవు
చంపల చెమట జార చేత తుడిచితినింతే
అంపలేను ఆయమంటి ఆదరించే నిన్నును

బాసియున్నదానగాను పదరిన దనగను
వేసరక నన్ను యేల వెడ్డువెట్టేవు
ఆశలశ్రీవెంకటేశ అట్టే నన్ను కూడీటీవి
మోసలేదు నీకు నాకు 



vaddu vaddu kOpamu vadiliniMtE nIku
suddulEla ceppEvu solasiti ninnunu


maarukonnadaanakanu maaTADinadAna gAnu
yErA nAtOnElaneggu vaTTEvu
yIrItiniMtE kOrikalani parAkurAgA
kUriminiTTE vEDukonenu ninnunu


guMpiMcinadAnagAnu goNagina dAnagAnu
peMponagErA nannu dikkonEvu
caMpala cemaTa jaara cEta tuDicitiniMtE
aMpalEnu AyamaMTi AdariMcE ninnunu


bAsiyunnadAnagAnu padarina danaganu
vEsaraka nannu yEla veDDuveTTEvu
ASalaSrIvenkaTESa aTTE nannu kUDITIvi
mOsalEdu nIku naaku mokkamiCCEninnunu