ANAND BHATTAR
నీదాసుల భంగములు నీవుజూతురా
ఏదని జూచేవు నీకు నెచ్చరించవలెనా
పాల సముద్రము మీద పవ్వళించ్చినట్టి నీకు
బేలలై సురలు మొరవెట్టిన యట్టు
వేళతో మామనువులు విన్నవించితిమి నీకు
ఏల నిద్దిరించేవు మమ్మిట్టే రక్షించరాద
ద్వారకా నగరములో తగ నెత్తమాడే నీకు
బిరాన ద్రౌపది మొరవెట్టిన యట్టు
ఘోరపు రాజసభల కుంది విన్నవించితిమి
ఏరీతి పరాకు నీకు నింక రక్షించరాద
ఎనసి వైకుంఠములో నిందిర గూడున్న నీకు
పెనగి గజము మొరవెట్టిన యట్టు
చనువుతో మాకోరికె సారె విన్నవించితిమి
విని శ్రీవేంకటేశుండ వేగ రక్షించరాద
nIdAsula BaMgamulu nIvujUturA
Edani jUcEvu nIku neccariMcavalenA
pAla samudramu mIda pavvaLiMccinaTTi nIku
bElalai suralu moraveTTina yaTTu
vELatO mAmanuvulu vinnaviMcitimi nIku
Ela niddiriMcEvu mammiTTE rakShiMcarAda
dvArakA nagaramulO taga nettamADE nIku
birAna draupadi moraveTTina yaTTu
GOrapu rAjasaBala kuMdi vinnaviMcitimi
ErIti parAku nIku niMka rakShiMcarAda
enasi vaikuMThamulO niMdira gUDunna nIku
penagi gajamu moraveTTina yaTTu
canuvutO mAkOrike sAre vinnaviMcitimi
vini SrIvEMkaTESuMDa vEga rakShiMcarAda
No comments:
Post a Comment