BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Thursday 28 June, 2012

ANNAMAYYA SAMKIRTANALU--NIMDASTUTI



CKP
దేవరవు గావా తెలిసితిమల్లనాడే
చేవదేరినపనులు చెప్పనేల యికను


జఱసి జఱసి నీయాచారములేమి చెప్పేవు
యెఱగనా నీ సరితలింతకతొల్లి
యెఱుకలుసేసి నీవు యెచ్చరించనిపుడేల
మఱచేవా నీకతలు మాటిమాటికిని


వెంటనే పొగడుకొని విఱ్ఱవీగేవెంతేసి
కంటిగా నీగుణములు గరగరగా
పెంటలుగా బచారించి పెనుగులాడగనేల
జంటగాకవిడిచేవా చలముతో నీవు


పుక్కిటివిడెమిచ్చి పొంచీ వొడబరచేవు
దక్కెగా నీకాగిలి తతితోడను
గక్కన శ్రీవేంకటేశ కలసితివిదె నన్ను
తక్కువయినవా నీ తగినమన్ననలు

dEvaravu gAvA telisitimallanADE
cEvadErinapanulu ceppanEla yikanu


ja~rasi ja~rasi nIyAcAramulEmi ceppEvu
ye~raganA nI saritaliMtakatolli
ye~rukalusEsi nIvu yeccariMcanipuDEla
ma~racEvA nIkatalu mATimATikini


veMTanE pogaDukoni vi~r~ravIgEvemtEsi
kaMTigA nIguNamulu garagaragA
peMTalugA bacAriMci penugulADaganEla
jaMTagAkaviDicEvA calamutO nIvu


pukkiTiviDemicci poMcI voDabaracEvu
dakkegA nIkAgili tatitODanu
gakkana SrIvEMkaTESa kalasitivide nannu
takkuvayinavA nI taginamannanalu


ANNAMAYYA LYRICS BOOK NO--19
SAMKIRTANA NO--147
RAGAM MENTIONED--NATTANARAYANI

No comments:

Post a Comment