BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Saturday 15 December, 2012

ANNAMAYYA SAMKIRTANALU--SRUNGARAM


CKP

ఇందులోనేవున్నది మీఇద్దరి జాణతనము
అందరము నేమని యాడేము నిన్నును

బాగాలిచ్చేయాటదాని పయ్యెదకొంగెడలించి
చేగదేరేచన్నులు పిసికేవేమయ్యా
ఆగడీడవని నిన్నునౌగాదనగలేక
సోగకన్నుల దప్పక చూచెనాపెనిన్నును

కుంచెవేసేమగువను కొప్పువట్టితీసిమోవి-
యంచు గంటిసేసితివౌనయ్య
వంచకుండవనుచు రవ్వలుగా జేయగలేక
ముంచినమొగమాటాన మొక్కినవ్వీ నిన్నును

సురటివిసరేయింతి జొక్కించి కాగిటగూడి
కెరలించేవు సిగ్గుచెక్కిటనేమయ్యా
పొరపొచ్చెగాడవని పోరక శ్రీవేంకటేశ
సరినిక్కి పైనొరగి యాసలబెట్టీ నిన్నును
imdulOnEvunnadi mIiddari jANatanamu
amdaramu nEmani yADEmu ninnunu

bAgAliccEyATadAni payyedakomgeDalimci
cEgadErEcannulu pisikEvEmayyaa
AgaDIDavani ninnunougAdanagalEka
sOgakannula dappaka cUcenApeninnunu

kumcevEsEmaguvanu koppuvaTTitIsimOvi-
yaMcu gaMTisEsitivounayya
vamcakumDavanucu ravvalugA jEyagalEka
mumcinamogamATAna mokkinavvI ninnunu

suraTivisarEyimti jokkimci kAgiTagUDi
keralimcEvu siggucekkiTanEmayyaa
porapoccegADavani pOraka SrIvEMkaTESa
sarinikki painoragi yAsalabeTTI ninnunu
ANNAMAYYA LYRICS BOOK NO--19
SAMKIRTANA NO--222
RAGAM MENTIONED--KUMTALAVARALI

No comments:

Post a Comment