BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Monday 23 July, 2012

ANNAMAYYA SAMKIRTANALU---SRUNGARAM


CKP

కానవచ్చీనందులోనే కడమదొడమలెల్లా
నీనేరుపులామీద నెరుపుమా చూతము


చేపట్టుకుంచమనంటా సిగ్గులీడబలికేవు
ఆపెతోడనీమాటే ఆడుమా నీవు
వోపుదునంటా నాకు వూడిగాలు చెప్పేవు
యేపున నాపెచేత చేయించుకొమ్మా చూతము


గోలదాననంటా నన్ను కొనగోర జెనకేవు
నాలినాపెతోడనిట్టె నవ్వుమా నీవు
మేలుగలదాననంటా మెట్టేవు నాపాదము
గేలినాపెపాదాన దాకించుమాచూతము


సేసుకొన్నదాననంటా చేరి నన్నుగూడితివి
ఆసల నాపె కాగిట నంటుమా నీవు
శ్రీసతినంటా నన్ను శ్రీవేంకటేశ ఏలితి
భూసతి ఆపెను నిట్టె పొందుమా చూతము
kaanavaccInaMdulOnE kaDamadoDamalellA
nInErupulAmIda nerupumA cUtamu

cEpaTTukuMcamanaMTA siggulIDabalikEvu
ApetODanImATE ADumA nIvu
vOpudunaMTA nAku vUDigAlu ceppEvu
yEpuna nApecEta cEyiMcukommA cUtamu

gOladAnanaMTA nannu konagOra jenakEvu
nAlinApetODaniTTe navvumA nIvu
mElugaladAnanaMTA meTTEvu nApaadamu
gElinApepAdAna dAkiMcumAcUtamu

sEsukonnadAnanaMTA cEri nannugUDitivi
Asala nApe kAgiTa naMTumA nIvu
SrIsatinaMTA nannu SrIvEMkaTESa Eliti
bhUsati Apenu niTTe poMdumA cUtamu


ANNAMAYYA LYRICS BOOK NO--19,
SAMKIRTANA NO--201
,RAGAM MENTIONED--PURVAGOULA

1 comment:

  1. ఇంతకు ముందు ఈ కీర్తన వినలేదు అండీ...
    Thanks For Posting....

    ఓం నమో వేంకటేశాయ..

    ReplyDelete