BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Saturday, 13 July 2013

ANNAMAYYA SAMKIRTANALU--TATWAMULU



G.N.NAIDU

అడుగరె యీ మాట అతని మీరందరును
యెడయని చోటను యిగిరించు ప్రియము

పొరపొచ్చమగుచోట పొసగవు మాతలు
గరిమ నొరసితేను కలగు మతి
సరవులు లేనిచోట చలము వెగ్గళమౌను
నొరసి పెనగేచోట నుమ్మగిలు వలపు

వొలసినొల్లనిచోట వొనరవు నగవులు
బలిమి చేసేటిచోట పంతము రాదు
అలుకచూపేచోట  అమరదు వినయము
చలివాసి వుండేచోట చండిపడు పనులు

ననుపులేనిచోట నమ్మిక చాలదు పొందు-
అనుమానమైనచోట  నంటదు రతి
యెనసినాడు శ్రీవేంకటేశుడు నన్నింతలోనే
తనివిలేనిచోట దైవారు కొర్కులు

adugare yee maaTa atani mIramdarunu
yeDayani chOTanu yigirimchu priyamu

porapochchamaguchOTa posagavu maatalu
garima norasitEnu kalagu mati
saravulu lEnichOTa chalamu veggaLamounu
norasi penagEchOTa nummagilu valapu

volasinollanichOTa vonaravu nagavulu
balimi chEsETichOTa pamtamu raadu
alukacoopEchOTa  amaradu vinayamu
chalivaasi vumDEchOTa chaMDipaDu panulu

nanupulEnichOTa nammika chaaladu pomdu-
anumaanamainachOTa  namTadu rati
yenasinaaDu SrIvEmkaTESuDu nannimtalOnE
tanivilEnichOTa daivaaru korkulu


ANNMAYA LYRICS BOOK NO--24
SAMKIRTANA--498
RAGAM MENTIONED--SALAMGAM

No comments:

Post a Comment