G.N.NAIDU
నానా దిక్కులా నరులెల్లా
వానలలోనే వత్తురు గదలి
సతులు సుతులు బరుసరులు బాంధవులు
హితులు గొలువగా నిందరును
శతసహస్రయోజనవాసులును సు-
వ్రతముల తోడనే వత్తురు కడలి
ముడుపులు జాళెలు మొగి దలమూటలు
కడలేని ధనము గాంతలును
కడుమంచి మణులు కరులు దురగములు
వడిగొని చెలగుచు వత్తురు గదలి
మగుటవర్ధనులు మండలేశ్వరులు
జగదేకపతులు జతురులును
తగువేంకటపతి దరుసింపగ బహు-
వగల సంపదల వత్తురు గదలి
nAnAdikkula narulellA
vAnalalOnane vatturu gadali
satulu sutulu barusarulu bAMdhavulu
hitulu goluvagA niMdarunu
SatasahasrayOjanavAsulu su-
vratamulatODane vatturu gadali
muDupulu jALelu mogi dalamUTalu
kaDalEnidhanamu gAMtalunu
kaDumaMcimaNulu karulu duragamulu
vaDigoni celagucu vatturu gadali
maguTavardhanulu maMDalESvarulu
jagadEkapatulu jaturulunu
taguvEMkaTapati daruSiMpaga bahu-
vagalasaMpadala vatturu gadali
ANNAMAYYA LYRICS BOOK NO--1
SAMKIRTANA NO--346
RAGAM MENTIONED--AHIRI
No comments:
Post a Comment