తాళ్ళపాక అన్నమయ్యా దైవము నీవె మాకు
వేళమె శ్రీహరిగానే వెరవానతిచ్చితివి
గురుడవు నీవే సుమీ కుమతినైన నాకు
సరవి బ్రహ్మోపదేశం చేసితి
పరమబంధుడవైన పరికింప నీవే సుమీ
వరుసనె చెడకుండా వహించుకొంటివి
తల్లివైన నీవేసుమీ తగిన విషయాలలో
వల్లదాన వడకుండా వతికించితి
అల్లుకొని తోడూనీడవైన నీవే సుమీ
చిల్లరమయలలోన చెడకుండా చేసితి
దాతవు నీవే సుమీ తగు శ్రీవేంకటనాధ
నా తలపులలోన నిలిచి నమ్మజేసితివి
యేతల చూచిన నాకు నేడుగడయూ నీవై
ఆతల యీతల నన్ను ఆదుకొని గాచితి
taaLLapaaka annamayyaa daivamu neeve maaku
vELame SrIharigaanE veravaanatichcitivi
guruDavu nIvE sumI kumatinaina naaku
saravi brahmOpadESam cEsiti
paramabamdhuDavaina parikimpa neevE sumee
varusane ceDakuMDA vahimchukomTivi
tallivaina neevEsumee tagina vishayaalalO
valladaana vaDakuMDA vatikimchiti
allukoni tODooneeDavaina neevE sumee
chillaramayalalOna ceDakumDA cEsiti
daatavu neevE sumee tagu SrIvEmkaTanaadha
naa talapulalOna nilichi nammajEsitivi
yEtala choochina naaku nEDugaDayoo neevai
aatala yeetala nannu aadukoni gaaciti
No comments:
Post a Comment