BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Saturday 17 November, 2012

ANNAMAYYA SAMKIRTANALU--SRUNGARAM



P.S.RANGANATH


బంగారుమేడలలోన పరమాత్ముడువాడే
సింగారాలు మీదమీద సేయరే చెలులు

తట్టుపుణుగులనూనె తగనిండా నంటుకొని
గట్టిగా కస్తూరి యటకలివెట్టి
మట్టులేని పన్నీట మజ్జనమాడెనిదే
వెట్టదీరనిందరును విసరరే చెలులు

కప్పురపు గంధవొడి కడునిట్టె మెత్తుకొని
కొప్పు దువ్వి ముడిచెను గొజ్టంగలెల్లా
తెప్పలుగా నించుకొనె తిరుమేన సొమ్ములెల్లా
దప్పిదేర వెడెమీరే తలకొని చెలులు

అలమేలుమంగ నురమందు నిట్టె నించుకొని
తలసిదండలు మోచె నిలువునను
చెలరేగి యారగించె శ్రీవేంకటేశ్వరుడు
కొలువున్నాడు మోహాలు గుప్పరే చెలులు
bamgArumEDalalOna paramAtmuDuvADE
siMgArAlu mIdamIda sEyarE celulu

taTTupuNugulanUne taganiMDA naMTukoni
gaTTigA kastUri yaTakaliveTTi
maTTulEni pannITa majjanamADenidE
veTTadIraniMdarunu visararE celulu

kappurapu gaMdhavoDi kaDuniTTe mettukoni
koppu duvvi muDicenu gojTamgalellA
teppalugA nimcukone tirumEna sommulellA
dappidEra veDemIrE talakoni celulu

alamElumaMga nuramMdu niTTe niMcukoni
talasidaMDalu mOce niluvunanu
celarEgi yAragiMce SrIvEMkaTESwaruDu
koluvunnADu mOhAlu gupparE celulu
ANNAMAYYA LYRICS BOOK NO--23
SAMKIRTANA NO--330
RAGAM MENTIONED--SRIRAGAM









No comments:

Post a Comment