SMITHA MADHAV
వెదకవో చిత్తమా వివేకించి నీవు
అదనతదీయసేవ అంతకంటే మేలు
చూపులెన్నైనా గలవు సూర్యమండలముదాకా
చూపులు శ్రీహరిరూపు చూడదొరకదుగాని
తీపులెన్నైనాగలవు తినదిన నాలికెకు
తీపు శ్రీహరిప్రసాదతీర్థమని కోరదు
మాటలెన్నైనాగలవు మరిగితే లోకమందు
మాటలు శ్రీహరినామము మరపగ వలె
తేటలెన్నైనా గలవు తీరనిచదువులందు
తేటగా రామనుజులు తేరిచె వేదములలో
చేతలెన్నైనా గలవు సేసేమంటే భూమి
చేతల శ్రీవేంకటేశు సేవసేయవలెను
వ్రాతలెన్నైనా గలవు వనజభవుని ముద్ర-
వ్రాతలు చక్రాంకితాలె వహికెక్కే ముద్రలు
vedakavO cittamA vivEkiMci nIvu
adanatadIyasEva amtakamTE mElu
cUpulennainA galavu sUryamaMDalamudAkA
cUpulu SrIharirUpu cUDadorakadugAni
tIpulennainAgalavu tinadina naalikeku
tIpu SrIhariprasaadatIrthamani kOradu
mATalennainAgalavu marigitE lOkamMdu
mATalu SrIharinAmamu marapaga vale
tETalennainA galavu tIranicaduvulaMdu
tETagA rAmanujulu tErice vEdamulalO
cEtalennainA galavu sEsEmaMTE bhUmi
cEtala SrIvEMkaTESu sEvasEyavalenu
vrAtalennainA galavu vanajabhavuni mudra-
vrAtalu cakrAMkitAle vahikekkE mudralu
ANNAMAYYA LYRICS BOOK NO--3
SAMKIRTANA NO--415
RAGAM MENTIONED--DESALAM
No comments:
Post a Comment