BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Tuesday 30 October, 2012

ANNAMAYYA SAMKIRTANALU--TATWAMULU



BKP

ఏది తుద దీనికేదిమొదలు
పాదుకొను హరిమాయ పరగు జీవునికి

ఎన్ని బాధలు దనకు నెన్ని లంపటములు
యెన్నివేదనలు మరి యెన్ని దు:ఖములు
యెన్ని పరితాపంబులెన్ని తలపోతలు
యెన్ని చూచిన మరియు నెన్నైన గలవు

యెన్ని కొలువులు దనకు నెన్ని యనుచరణలు
యెన్నియాసలు మరియు నెన్ని మోహంబులు
యెన్ని గర్వంఉలు దనకెన్ని దైన్యంబులివి
యిన్నియును దలప మరియెన్నైన గలవు

యెన్నిటికి జింతించు నెన్నిటికి హర్షించు
నెన్నిటికి నాసించు నెన్నిటికి దిరుగు
యిన్నియును దిరువేంకటేశు లీలలుగాగ
నెన్ని చూచినను దానెవ్వడును గాడు
Edi tuda dInikEdimodalu
pAdukonu harimAya paragu jIvuniki

enni bAdhalu danaku nenni laMpaTamulu
yennivEdanalu mari yenni du:Kamulu
yenni paritApaMbulenni talapOtalu
yenni cUcina mariyu nennaina galavu

yenni koluvulu danaku nenni yanucaraNalu
yenniyAsalu mariyu nenni mOhaMbulu
yenni garvaMulu danakenni dainyaMbulivi
yinniyunu dalapa mariyennaina galavu

yenniTiki jiMtiMcu nenniTiki harShiMcu
nenniTiki nAsiMcu nenniTiki dirugu
yinniyunu diruvEMkaTESu lIlalugAga
nenni cUcinanu dAnevvaDunu gADu


ANNAMAYYA LYRICS BOOK NO--1
SAMKIRTANA NO--102
RAGAM MENTIONED--BOULI

No comments:

Post a Comment