BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Saturday 15 September, 2012

ANNAMAYYA SAMKIRTANALU--SRUNGARAM



PADMAVATHI


చాలామేలుదిరా ఈ బాలామణిపుడు నీ
పాలిటచిక్కెరా గోపాలకకృష్ణమ్మా

పంకాజముఖి నీవంకచూచినప్పుడే
పొంకముగా వలచె యింకానేమందురా
సంకెలేక నీమీద నంకితమైన పాట
లంకించిపాడీ నీతో లంకెలకృష్ణమ్మా

పల్లాదమున నీవు మొల్లామినందరిలో
మొల్లాపూబంతివేయ జల్లున కరగెరా
మెల్లానే వ్రాసిచూచీ చల్లాగ నీరూపమె 
కల్లా గాదురా శ్రీవల్లభ కృష్ణమ్మా

తటుకాన నీవప్పుడు నటనాలాసరసాన
యిటునటు కాగిలించ నెట్లా దా జొక్కెరా
విటరాయడవు శ్రీవేంకటనాధ నీకూటమి
ఘటియించ వేడుక మిక్కుటమాయ కృష్ణమ్మా

cAlAmEludirA I bAlAmaNipuDu nI
pAliTacikkerA gOpAlakakRShNammA

paMkaajamukhi nIvaMkacUcinappuDE
poMkamugA valace yiMkAnEmaMdurA
saMkelEka nImIda naMkitamaina pATa
laMkiMcipADI nItO laMkelakRShNammA

pallAdamuna nIvu mollAminaMdarilO
mollApUbaMtivEya jalluna karagerA
mellAnE vrAsicUcI callAga nIrUpame 
kallA gAdurA SrIvallabha kRShNammA

taTukAna nIvappuDu naTanAlAsarasAna
yiTunaTu kAgiliMca neTlA dA jokkerA
viTarAyaDavu SrIvEMkaTanAdha nIkUTami
ghaTiyiMca vEDuka mikkuTamAya kRShNammaa 

ANNAMAYYA LYRICS BOOK NO--10
SAMKIRTANA--84
RAGAM MENTIONED--LALITHA

No comments:

Post a Comment