BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Wednesday, 31 October, 2012

ANNAMAYYA SAMKIRTANALU--SARANAGATI





PASUPATI
ఎండగానీ నీడగానీ యేమైనగానీ
కొండలరాయడే మాకులదైవము

తేలుగాని పాముగాని దేవపట్టయినా గాని
గాలిగాని ధూళిగాని కానీ యేమైనా
కాలకూటవిషమినా గక్కున మింగిన నాటి-
నీలవర్ణుడే మా నిజదైవము

చీమగాగాని దోమగాని చెలది యేమైనగాని
గాముగాని నాముగాని కానీ యేమైనా
పాములనిన్నిటి మింగేబలుతేజిపైనున్న-
ధూమకేతువే మాకు దొరదైవము

పిల్లిగాని నల్లిగాని పిన్నయెలుకైనాగాని
కల్లగాని పొల్లగాని కానీ యేమైనా
బల్లిదుడై వేంకటాద్రిపైనున్న యాతడే మ-
మ్మెల్లకాలమును యేలేయింటిదైవము
BKP
eMDagAnI nIDagAnI yEmainagAnI
koMDalarAyaDE mAkuladaivamu

tElugAni pAmugAni dEvapaTTayinaa gAni
gAligAni dhULigAni kAnI yEmainA
kAlakUTaviShaminA gakkuna mimgina nATi-
nIlavarNuDE mA nijadaivamu

cImagAgAni dOmagAni celadi yEmainagAni
gAmugAni nAmugAni kAnI yEmainA
pAmulaninniTi miMgEbalutEjipainunna-
dhUmakEtuvE mAku doradaivamu

pilligAni nalligAni pinnayelukainAgAni
kallagAni pollagAni kAnI yEmainA
balliduDai vEMkaTAdripainunna yAtaDE ma-
mmellakAlamunu yElEyiMTidaivamu
ANNAMAYYA LYRICS BOOK NO--1
SAMKIRATAN NO--214
RAGAM MENTIONED--BOULI
35TH RAGI REKU

2 comments: