BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Saturday 3 November, 2012

ANNAMAYYA SAMKIRTANALU--LAKSHMINARASIMHA



DWARAM TYAGARAJU

నానా మహిమల శ్రీ నారసింహము
పూని మమ్ము రక్షించీ పొగడెద  నిదివో

కొండవంటి వేదాద్రిగుహలలో సింహము
దండి భవనాశి యేటిదరి సింహము
అండ నారుశాస్త్రముల అడవిలో సింహము
నిండి అహోబలముపై నిక్కిచూచీనదిగో

దిట్ట యోగీంద్రుల మతితెర మఱగు సింహము
జట్టిగొన్న శ్రీసతితో జంటసింహము
పట్టి దైత్యుల వేటాడే బలుదీము సింహము
మెట్టి అహోబలముపై మెఱసీదానదిగో

పలుదేవతల వెనుబలమైన సింహము
కెలసి కంబాన చెనగిన సింహము
అలరి శ్రీవేంకటేశడైనట్టి సింహము
కొలువై అహోబలాన గురుతయనిదివో

nAnA mahimala SrI nArasiMhamu
pUni mammu rakShiMcI pogaDeda nidivO

koMDavaMTi vEdAdriguhalalO siMhamu
daMDi bhavanASi yETidari siMhamu
aMDa nAruSAstramula aDavilO siMhamu
niMDi ahObalamupai nikkicUcInadigO

diTTa yOgIMdrula matitera ma~ragu siMhamu
jaTTigonna SrIsatitO jaMTasiMhamu
paTTi daityula vETADE baludImu siMhamu
meTTi ahObalamupai me~rasIdAnadigO

paludEvatala venubalamaina siMhamu
kelasi kaMbAna cenagina siMhamu
alari SrIvEMkaTESaDainaTTi siMhamu
koluvai ahObalAna gurutayanidivO


ANNAMAYYA LYRICS BOOK NO--15
SAMKIRTANA NO--119
RAGAM MENTIONED--NATA

No comments:

Post a Comment