S.P.SAILAJA
అలివేణిని పెండ్లాడవయ్యా
చెలుల విన్నపము చేకొనవయ్యా
చరణం:-1
సొలపుల.తొలితొలి చూచిన చూపులు
కొలదిమీర నుంకువలాయ
చెలగి చేతులను సేసిన సన్నలు
తలపగ నలుగడ తలబాలాయ
చరణం:-2
ననుపున.సెలవుల నవ్విన నవ్వులు
గొనకొనగ బాల-కూళ్ళాయ
అనువుగ ప్రియమున.ఆడిన మాటలు
మనసిజతంత్రపు మంత్రములాయ
చరణం:-3
వేడుక.కాగిటి.వినయపుసేతలు
కూడిన కూటపు.గురులాయ
యీడనే శ్రీవేంకటేశ యేలితివి
తోడలమేల్మంగ దోమట్లాయ
alivENini peMDlaaDavayyaa
celula vinnapamu cEkonavayyaa
charaNaM:-1
solapula.tolitoli cUcina cUpulu
koladimIra nuMkuvalaaya
celagi cEtulanu sEsina sannalu
talapaga nalugaDa talabaalaaya
caraNaM:-2
nanupuna.selavula navvina navvulu
gonakonaga baala-kULLAya
anuvuga priyamuna.aaDina maaTalu
manasijataMtrapu maMtramulaaya
caraNaM:-3
vEDuka.kaagiTi.vinayapusEtalu
kUDina kUTapu.gurulaaya
yIDanE SrIvEMkaTESa yElitivi
tODalamElmaMga dOmaTlaaya
No comments:
Post a Comment