BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Sunday 15 April, 2012

ANNAMAYYA SAMKIRTANALU--SRUNGARAM


T.P.CHAKRAPANI

ఇంతి భువనమోహినియైన ఫలము
కాంతుని దలచి వగల జిక్కెనిపుడు


మెలుతకన్నులు గండుమీలైన ఫలము
తొలకురెప్పలనీరు దొరకె నేడు
లలనమై నవపుష్పలతయైన ఫలము
వలపుచెమటనీట వడి దోగెనిపుడు


మెఱుగారు నెరులు తుమ్మిదలైన ఫలము
నెఱిదమ్మి మోముపై నెలకొన్నవి
పఱచు జక్కవలు గుబ్బలైన ఫలము
తొఱలి తాపపురవితో గూడెనిపుడు


పలువన్నెమోవిబింబమైన ఫలము
చిలుకవోట్లచేత జెలువందెను
కలికివేంకటపతి గలసిన ఫలము
సొలసినాడనె నిత్యసుఖమబ్బెనిపుడు

imti bhuvanamOhiniyaina phalamu
kAmtuni dalaci vagala jikkenipuDu


melutakannulu gaMDumIlaina phalamu
tolakureppalanIru dorake nEDu
lalanamai navapuShpalatayaina phalamu
valapucemaTanITa vaDi dOgenipuDu


me~rugAru nerulu tummidalaina phalamu
ne~ridammi mOmupai nelakonnavi
pa~racu jakkavalu gubbalaina phalamu
to~rali tApapuravitO gUDenipuDu


paluvannemOvibiMbamaina phalamu
cilukavOTlacEta jeluvaMdenu
kalikivEMkaTapati galasina phalamu
solasinADane nityasukhamabbenipuDu


ANNAMAYYA LYRICS BOOKA NO--5
SAMKIRTANA NO--266
RAGAM MENTIONED--SAMKARABHARANAM

No comments:

Post a Comment