BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Sunday 15 April, 2012

ANNAMAYYA SAMKIRTANALU__SRUNGARAM


K.MURALIKRISHNA

నీమసింకరాదు నేనేమిసేతురా
యేమాటకేమాట యింతేలదూరులు


అంటినా నిన్నేమైనా నందరిలో పచ్చిసేసి
కంటకములాడితినా కపటాలకెత్తి
వెంటవెంట నీగుట్టు వెల్లవిరిసేసితినా
యింటిలోన నున్నదాన నికనేలదూరులు


రమ్మంటినా నిన్ను రమణివద్దనుండగా
సొమ్మల మోవికెంపులు చూడబోతినా
నెమ్మది నీయానలలో నేదప్పుబట్టితినా
వుమ్మడినే వున్నదాన నూరకేల దూరులు


యీడ నన్నుగూడి చిత్తమేడనున్నదంటినా
వాడుమోము తెల్లబారవద్దంటినా
యీడులేకశ్రీవేంకటేశ కూడితివి నన్ను
వేడుకతోనునందాన వేయేలదూరులు

nImasiMkarAdu nEnEmisEturA
yEmATakEmATa yimtEladUrulu


aMTinA ninnEmainA naMdarilO paccisEsi
kaMTakamulADitinA kapaTAlaketti
veMTaveMTa nIguTTu vellavirisEsitinA
yiMTilOna nunnadAna nikanEladUrulu


rammaMTinA ninnu ramaNivaddanuMDagA
sommala mOvikeMpulu cUDabOtinA
nemmadi nIyAnalalO nEdappubaTTitinA
vummaDinE vunnadAna nUrakEla dUrulu


yIDa nannugUDi cittamEDanunnadaMTinA
vADumOmu tellabAravaddaMTinA
yIDulEkaSrIvEMkaTESa kUDitivi nannu
vEDukatOnunndAna vEyEladUrulu






No comments:

Post a Comment