BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Monday 16 April, 2012

ANNAMAYYA SAMKIRTANALU--ADHYATMIKAM



G.MADHUSUDAN RAO

విశ్వాత్మ నీకంటె వేరేమియునుగాన
ఐశ్వర్యమెల్ల నీ యతివచందములే


కలవు మతములు పెక్కు కర్మభేదములగుచు
కలవెల్ల నీయందె కల్పితములే
కలరు దేవతలు బహుగతులమహిమల మెరయు
అలరి వారెల్ల నీయంగభేదములే


ఘనమంత్రములు పెక్కుగలవు వరములనొసగు
ననిచి యవియెల్ల నీనామంబులే
పెనగొన్నజంతువులు పెక్కులెన్నేగలవు
పనిగొన్న నీదాసపరికరములే


యెందును దగులువడకేకరూపని నిన్ను
కందువ గొలుచువాడే ఘనపుణ్యుడు
అందపుశ్రీవేంకటాద్రీశ అన్నిటా-
నందినపొందినవెల్లా హరి నీయనుమతే


viSvAtma nIkaMTe vErEmiyunugAna
aiSvaryamella nI yativacaMdamulE


kalavu matamulu pekku karmabhEdamulagucu
kalavella nIyaMde kalpitamulE
kalaru dEvatalu bahugatulamahimala merayu
alari vArella nIyaMgabhEdamulE


ghanamMtramulu pekkugalavu varamulanosagu
nanici yaviyella nInAmaMbulE
penagonnajaMtuvulu pekkulennEgalavu
panigonna nIdAsaparikaramulE


yeMdunu daguluvaDa kEkarUpani ninnu
kaMduva golucuvADE ghanapuNyuDu
aMdapuSrIvEMkaTAdrISa anniTA-
naMdinapoMdinavellA hari nIyanumatE


ANNAMAYYA LYRICS BOOK NO--3
SAMKIRTANA NO--544
RAGAM MENTIONED--LALITA

No comments:

Post a Comment