BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Tuesday 3 April, 2012

ANNAMAYYA SAMKIRTANALU--KRISHNA



D.V.MOHANAKRISHNA
చిన్నవాడు నాలుగుచేతులతోనున్నాడు
కన్నప్పుడె శంఖము చక్రము చేతనున్నది


నడురేయి రోహిణినక్షత్రమున బుట్టె
వడికృష్ణుడిదివో దేవతలందు
పడిన మీబాధలెల్ల ప్రజలాల యిప్పుడిట్టె
విడుగరాయ మీరు వెరువకుడికను

పుట్టుతానె బాలుడు అబ్బురమైన మాటలెల్ల
అట్టెవసుదేవునికానతిచ్చెను
వట్టిజాలింకేల దేవతలాల మునులాల
వెట్టివేములుమానెను  వెరువకుడికను


శ్రీవేంకటనాథుడె యాసిసువుదానైనాడు
యీవల వరములెల్లానిచ్చుచును
కావగ దిక్కైనాడిక్కడనె వోదాసులాల
వేవేగ వేడుకతోడ వెరువకుడికను
cinnavADu nAlugucEtulatOnunnADu
kannappuDe Samkhamu cakramu cEtanunnadi

naDurEyi rOhiNinakShatramuna buTTe
vaDikRShNuDidivO dEvatalaMdu
paDinamIbAdhalella prajalAla yippuDiTTe
viDugarAya mIru veruvakuDikanu

puTTutAne bAluDu abburamaina mATalella
aTTevasudEvunikAnaticcenu
vaTTijAlimkEla dEvatalAla munulAla
veTTivEmulumAnenu veruvaDikanu

SrIvEMkaTanAthuDe yAsisuvudAnainADu
yIvala varamulellaaniccucunu
kAvaga dikkainADikkaDane vOdAsulAla
vEvEga vEDukatODa veruvakuDikanu




ANNAMAYYA LYRICS BOOK NO--10
SAMKIRTANA--32
RAGAM MENTIONED--GOULA

No comments:

Post a Comment