BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Wednesday 4 April, 2012

ANNAMAYYA SAMKIRTANALU__KRISHNA



Y.V.S.PADMAVATI
గోవులగాచీయలసీ గోవిందుడు
గోవాళితనాలు సేసీ గోవిందుడు


పానుపుమీదట దాను పవళించి వున్నవాడు
గోనాలగొందినిదె గోవిందుడు
ఆనుక చేతులుచాచీనట్టె చన్నులమీద
పూని యేడోనుండి వచ్చిభోగించీ గోవిందుడు


బట్టబాయిట నింతుల పాదాలు విసుకుమనీ
గుట్టుసేయడించుకంతా గోవిందుడు
జట్టిగొని మోవితేనె సారెకునియ్యగవచ్చి
చుట్టమువలెనే వచ్చిసొలసీ గోవిందుడు


యెలమి దెరవేసుక యిద్దరిగాగిటగూడీ
కొలువులోపలనే గోవిందుడు
వెలయ గొల్లెతలము వేడుకతో మమ్మునేలె
అలరినశ్రీవేంకటాద్రి గోవిందుడు
\
gOvulagAcIyalasI gOviMduDu
gOvALitanAlu sEsI gOvimduDu

paanupumIdaTa dAnu pavaLimci vunnavADu
gOnAlagomdinide gOviMduDu
Anuka cEtulucAcInaTTe cannulamIda
pUni yEDOnuMDi vaccibhOgimcI gOviMduDu

baTTabAyiTa nimtula pAdAlu visukumanI
guTTusEyaDiMcukaMtA gOviMduDu
jaTTigoni mOvitEne sArekuniyyagavacci
cuTTamuvalenE vaccisolasI gOviMduDu

yelami deravEsuka yiddarigAgiTagUDI
koluvulOpalanE gOviMduDu
velaya golletalamu vEDukatO mammunEle
alarinaSrIvEMkaTAdri gOviMduDu
ANNAMAYYA LYRICS BOOK NO--18
SAMKIRTANA--414
RAGAM MENTIONED--SAMKARABHARANAM

No comments:

Post a Comment