BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Friday, 2 March 2012

ANNAMAYYA SAMKIRTANALU--TATWAMULU



K.MURALIKRISHNA


కలుషపు చీకటి కలుగగను
వెలుగు లోకముల వెలసినయట్లు


మునుకొని పాతకములు గలుగగబో
జనులకు పుణ్యము జవులాయె
యినుము గలుగగా యిందరి యెదిటికి
కనకము ప్రమోదకరమైనట్లు


జగములోపల విషముగ గలుగబో
మిగులగ నమృతము మేలాయ
వగవు గలుగగా వడి సంతోషం
బగపడుటిందరి కబ్బురమాయ


బహుదైవంబుల ప్రపంచవిదుల బో
మహిమల శ్రీహరి మనసాయ
విహగగమనుడగు వేంకటేశ్వరుడు
యిహమియ్యగ బరమిచ్చైనట్లు

kaluShapu cIkaTi kalugaganu
velugu lOkamula velasinayaTlu


munukoni paatakamulu galugagabO
janulaku puNyamu javulaaye
yinumu galugagaa yimdari yediTiki
kanakamu pramOdakaramainaTlu


jagamulOpala viShamuga galugabO
migulaga namRtamu mElAya
vagavu galugagaa vaDi samtOSham
bagapaDuTimdari kabburamaaya


bahudaivambula prapamcavidula bO
mahimala SrIhari manasaaya
vihagagamanuDagu vEMkaTESwaruDu
yihamiyyaga baramiccainaTlu
ANNAMAYA LYRICSBOOK NO--4
SAMKIRTANA--51
PAGE NO--395
RAGAM MENTIONED--PADI


No comments:

Post a Comment