Y.V.S.PADMAVATI
వినోదకాడైనాడు విఠలేశుడు
అనాదిదేవుడనే యాతడీతడా
మాయరోల గట్టువడి మద్దులు విరిచివేసి
ఆయతమైయున్న యట్టియాతడీతడా
పేయలగాచినాడు పెరుగువంటకములు
ఆయెడ నారగించిన యాతడీతడా
తల్లిబిడ్డలైన గొల్లతరుణులనెల్లాగూడి
అల్లుకొనజేసె వావులాతడీతడా
తొల్లి గోవర్ధనమెత్తి దొరతనాలెల్లా జేసి
అల్లవాడె నిలుచున్నాడాతడీతడా
చందముగ రుకుమిణి సత్యభామాదిసతుల-
నందంద పెండ్లాడిన యాతడీతడా
యిందిరయు తాను గూడి యిదె శ్రీవేంకటాద్రిపై
నందరికీ వరాలిచ్చీనాతడీతడా
vinOdakaaDainaaDu viThalESuDu
anaadidEvuDanE yaataDItaDA
maayarOla gaTTuvaDi maddulu viricivEsi
aayatamaiyunna yaTTiyaataDItaDA
pEyalagaacinaaDu peruguvamTakamulu
AyeDa naaragimcina yAtaDItaDA
tallibiDDalaina gollataruNulanellaagUDi
allukonajEse vaavulaataDItaDA
tolli gOvardhanametti doratanaalellaa jEsi
allavaaDe nilucunnADAtaDItaDA
camdamuga rukumiNi satyabhaamaadisatula-
namdamda pemDlADina yAtaDItaDA
yimdirayu taanu gUDi yide SrIvEMkaTAdripai
namdarikI varaaliccInAtaDItaDA
ANNAMAYYA LYRICS BOOK.NO--18
SAMKIRTANA NO--301
RAGAM MENTIONED--MALAVI
No comments:
Post a Comment