BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Friday, 2 March 2012

ANNAMAYYA SAMKIRTANALU--HANUMAN


G.N.NAIDU

కలశాపురముకాడ గంధపుమాకులనీడ
నలరేవు మేలు మేలు హనుమంతరాయ


సంజీవికొండదెచ్చి సౌమిత్రిబ్రతికించితి
భంజించితి వసురుల బలువిడిని
కంజాప్తకులరాఘవుని మెప్పించితివి
అంజనీతనయ వో హనుమంతరాయ


లంక సాధించితివి నీలావులెల్లాజూపితివి
కొంకక రాముని సీతగూర్చితివి
లంకెల సుగ్రీవునికి లలిప్రధానివైతివి
అంకెలెల్లా నీకుజెల్లె హనుమంతరాయ


దిక్కులు గెలిచితివి ధీరత పూజగొంటివి
మిక్కిలి ప్రతాపాన మెరసితివి
యిక్కువతో శ్రీవేంకటేశ్వరు బంటవైతివి
క్కజపు మహిమల హనుమంతరాయ

kalaSApuramukaaDa gamdhapumaakulanIDa
nalarEvu mElu mElu hanumamtaraaya

samjIvikomDadecci soumitribratikimciti
bhamjimciti vasurula baluviDini
kamjAptakularaaghavuni meppimcitivi
amjanItanaya vO hanumamtaraaya

lamka saadhimcitivi nIlAvulellaajUpitivi
komkaka raamuni sItagUrcitivi
lamkela sugrIvuniki lalipradhaanivaitivi
amkelellaa nIkujelle hanumamtaraaya

dikkulu gelicitivi dhIrata pUjagomTivi
mikkili prataapaana merasitivi
yikkuvatO SrIvEmkaTESwaru bamTavaitivi
akkajapu mahimala hanumamtaraaya
ANNAMAYYA LYRICS BOOKNO--3
SAMKIRTANA NO--521
RAGAM MENTIONED--PADI

No comments:

Post a Comment