BKP
చేపట్టు గుంచము శ్రీవిభుడు
వైపెరిగి పొగడవలెగాక
మనసులోనిహరి మరవక తలచిన
యెనయనిహపరములేమరుదు
పెనగొననాతనిపేరు నుడిగినను
తనకు మహానందములేమరుదు
పుట్టించినాతని పొసగగ గొలిచిన
యిట్టె వివేకంబేమరుదు
చుట్టి యతనిదాసులకు మొక్కినను
పుట్టుగు గెలుచుట భువినేమరుదు
శ్రీవేంకటేశ్వరు జేరిభజించినను
యేవేళ సాత్వికమేమరుదు
భావించియతనిపై భక్తి నిలిపినను
కైవశముగ తనుగనుటేమరుదు
R.BULLEMMA
cEpaTTu gumcamu SrIvibhuDu
vaiperigi pogaDavalegaaka
manasulOnihari maravaka talacina
yenayanihaparamulEmarudu
penagonanaatanipEru nuDiginanu
tanaku mahaanamdamulEmarudu
puTTimcinaatani posagaga golicina
yiTTe vivEkambEmarudu
cuTTi yatanidaasulaku mokkinanu
puTTugu gelucuTa bhuvinEmarudu
SrIvEMkaTESwaru jEribhajimcinanu
yEvELa saatvikamEmarudu
bhaavimciyatanipai bhakti nilipinanu
kaivaSamuga tanuganuTEmarudu
ANNAMAYYA LYRICS-BOOK NO--4
SAMKIRTANA NO--174
RAGAM MENTIONED--KURAMJI
No comments:
Post a Comment